తన కారుకి పైన్ వేసిన పోలీసులను సన్మానించిన మంత్రి KTR.. ఎందుకంటే?

భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు తారా స్థాయికి చేరటానికి ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ నియమాలను సరిగ్గా పాటించక పోవడం.రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే మోటార్ వాహన చట్టానికి సంబందించిన నియమాలను పోలీసులు చాలా కఠినంగా అమలు చేస్తున్నారు.

మంత్రి KTR కారుకి ట్రాఫిక్ ఫైన్ వేసిన పోలీస్ సిబ్బంది.. తరువాత ఏం జరిగిందంటే?

ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. ఇందులో కొంతమంది పోలీసులు రాజకీయ నాయకులు మరియు సెలబ్రెటీల వాహనాలు ట్రాఫిక్ నియమాలను ఉల్లంగిస్తే పెద్దగా పట్టించుకోరు. కానీ మరికొంత మంది పోలీసులు సామాన్య ప్రజలైనా, రాజకీయ నాయకులైన.. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారు ఎంతవారైనా ఖచ్చితంగా జరిమానాలు విధిస్తారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది.

మంత్రి KTR కారుకి ట్రాఫిక్ ఫైన్ వేసిన పోలీస్ సిబ్బంది.. తరువాత ఏం జరిగిందంటే?

నివేదికల ప్రకారం, ఈ సంఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగినట్లు తెలిసింది. లంగర్‌హౌస్‌ సంగం సమీపంలో బాపూఘాట్‌లో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం కోసం అనుకోని పరిస్థితుల్లో కేటీఆర్ యొక్క Toyota Innova Crysta (టొయోటా ఇన్నోవా క్రిస్టా) రాంగ్ రూట్ లో వచ్చింది. అయితే మంత్రి వెహికల్ అయినప్పటికీ విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య ఆ వాహనానికి చలాన్ విధించారు.

మంత్రి KTR కారుకి ట్రాఫిక్ ఫైన్ వేసిన పోలీస్ సిబ్బంది.. తరువాత ఏం జరిగిందంటే?

మహాత్మాగాంధీ 150 వ జయంతి సందర్భంగా నివాళులర్పించడానికి కేటీఆర్ బాపు ఘాట్‌ను సందర్శించారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మరియు హోంమంత్రి మహమూద్ అలీ కూడా పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ ని పిక్ అప్ చేసుకోవడానికి ఆ సమయంలో రాంగ్ రూట్ లో వెళ్లిన కేటీఆర్ యొక్క ఇన్నోవా క్రిష్టా కి చలానా జారీ చేశారు.

మంత్రి KTR కారుకి ట్రాఫిక్ ఫైన్ వేసిన పోలీస్ సిబ్బంది.. తరువాత ఏం జరిగిందంటే?

ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తన వాహనానికి చలాన్ విధించిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఐళయ్య మరియు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లులను ప్రశంసించారు. అంతే కాకుండా వారిని తన కార్యాలయాలని పిలిపించుకొని మరీ శాలువా కప్పి, పుష్ప గుచ్చాలను అందించి అభినందించారు.

మంత్రి KTR కారుకి ట్రాఫిక్ ఫైన్ వేసిన పోలీస్ సిబ్బంది.. తరువాత ఏం జరిగిందంటే?

మంత్రి కేటీఆర్ చేసిన ఈ పనికి నెటిజన్లు ఎంతగానో కొనియాడుతున్నారు. విధి నిర్వహణలో నిజాయితీగా ఉండే అధికారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించటంలో తాను ముందుంటానని,చలాన్ విధించిన రోజు తాను ఆ వెహికల్ లో లేనని అన్నారు.

మంత్రి KTR కారుకి ట్రాఫిక్ ఫైన్ వేసిన పోలీస్ సిబ్బంది.. తరువాత ఏం జరిగిందంటే?

ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చట్టానికి వ్యతిరేకంగా నడుచుకునే వారు ఎంతవారైనా వారిని తప్పకుండా శిక్షించాలని ఆయన పేర్కొన్నారు. నిజాయితీగా ఉండే ప్రతి ఒక్కరికీ కూడా తాను ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పుకొచ్చారు.

మంత్రి KTR కారుకి ట్రాఫిక్ ఫైన్ వేసిన పోలీస్ సిబ్బంది.. తరువాత ఏం జరిగిందంటే?

అయితే పోలీసులు ఎంత జరిమానా జారీ చేశారు అనే విషయం స్పష్టంగా తెలియదు, కానీ ఈ చలానా మొత్తాన్ని కూడా మంత్రి క్లియర్ చేసినట్లు తెలిసింది. ఇది నిజంగా ప్రశంస నీయం.

సాధారణంగా పోలీసులు, అధికారంలో ఉన్న అధికారులను ఎలాంటి ప్రశ్నలు వేయరు. ఒక వేళా వారిని ప్రశ్నిస్తే తరువాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఊరుకుంటారు, కానీ ట్రాఫిక్ పోలీస్ ఐలయ్య మాత్రం దీనికి బిన్నంగా తన నిజాయితీ చాటుకున్నాడు.

మంత్రి KTR కారుకి ట్రాఫిక్ ఫైన్ వేసిన పోలీస్ సిబ్బంది.. తరువాత ఏం జరిగిందంటే?

ప్రస్తుతం రోడ్డుపై వాహనాలను నిలిపి చలానాలు జారీ చేసే పద్దతి పూర్తిగా నశించింది, కావున రోడ్డుపై ట్రాఫిక్ నియమాలను ఉల్లంగించిన వాహనాల నెంబర్ ప్లేట్ ఆధారంగా జరిమానా నేరుగా వాహనదారుని ఇంటికి పంపుతారు. జరిమానాలు మరియు చలాన్ల జారీ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

మంత్రి KTR కారుకి ట్రాఫిక్ ఫైన్ వేసిన పోలీస్ సిబ్బంది.. తరువాత ఏం జరిగిందంటే?

చాలా మంది పోలీసు అధికారులు ట్రాఫిక్ నియమాలు ఉల్లంగించిన వాహనాలకు ఆన్‌లైన్‌లో చలాన్ పంపుతారు. ఏదైనా కారణం చేత పోలీసులు ఆపమని అడిగినప్పుడు పోలీసు అధికారుల నుండి పారిపోవడం చాలా పెద్ద నేరం. ఇది మరింత పెద్ద నేరానికి కారణమౌతుంది.

మంత్రి KTR కారుకి ట్రాఫిక్ ఫైన్ వేసిన పోలీస్ సిబ్బంది.. తరువాత ఏం జరిగిందంటే?

వాహనదారులకు తప్పులు జరిమానా జారీ చేయబడిందని అనిపిస్తే, కోర్టులో లేదా సీనియర్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా దానిని నివారించుకోవచ్చు. అయితే ఇది చాలా పెద్ద ప్రక్రియ. అయినప్పటికీ వాహనదారులు తమ హక్కులను వినియోగించుకోవచ్చు. వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. లేకుంటే ఎంతవారికైనా జరిమానాలు తప్పవు. దీనికి నిదర్శనమే తెలంగాణలో జరిగిన ఈ సంఘటన.

NOTE: ఈ ఆర్టికల్ లో ఉపయోగించిన కొన్ని ఫొటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.

Most Read Articles

English summary
Ts minister ktr wishes police officers who fined his car after traffic violation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X