ట్యూబ్ లెస్ టైర్ల ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు: నిపుణుల మాటల్లో!!

By N Kumar

Recommended Video

Bangalore Bike Accident At Chikkaballapur | Full Details - DriveSpark

వెహికల్ నడిపే ప్రతి ఒక్కరి లైఫ్‌లో పంక్చర్ అనే పదం సర్వసాధారణం. అయితే, డ్రైవర్లు మరియు ప్రయాణికులు పంక్చర్ అనే పదం వింటే చాలా తీవ్ర చిరాకుపడతారు. నిజమే మరి, ప్రతి ప్రయాణం కూడా పంక్చర్ లేకుండా సాగిపోవాలనుకుంటారు.

ట్యూబ్ లెస్ టైర్ల ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు!!

ఈ పంక్చర్ సమస్యకు వచ్చిన సమాధానమే "ట్యూబ్ లెస్ టైర్లు". అంటే ట్యూబ్ లెస్ టైర్లకు పంక్చర్లు జరగవా...? అంటే, జరుగుతాయనే చెప్పాలి. అయితే, ట్యూబ్ ఉన్న టైర్లతో పోల్చుకుంటే వీటికి పంక్ఛర్ వేయడం పెద్ద సమస్యేమీ కాదు. మరియు పంక్చర్ అయినా కూడా పంక్చర్ షాప్ వచ్చే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రావెల్ చేయవచ్చు.

ట్యూబ్ లెస్ టైర్ల ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు!!

ఈ ట్యూబ్ లెస్ టైర్లు ఏవో బాగున్నాయి కదా... ఇంతే కాకుండా వీటిని వాడితే ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయోజనాలతో పాటు అప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాబట్టి, ఇవాళ్టి కథనంలో ట్యూబ్ లెస్ టైర్లు వాడటం వలన కలిగే ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఎంటో చూద్దాం రండి....

చిన్న పంక్చర్లకు ఏ మాత్రం జంకదు

చిన్న పంక్చర్లకు ఏ మాత్రం జంకదు

సాధారణ టైర్లు ప్రతి చిన్నదానికి పంక్చర్ అవుతుంటాయి. కానీ, ట్యూబ్ లెస్ టైర్లు అలా కాదు. పొడవాటి మేకులు మరియు ఇనుప చువ్వలకు మాత్రమే పంక్చర్ అవుతాయి. టైర్ల నుండి శబ్దం వస్తున్నట్లు గుర్తిస్తే పంక్చర్ అని నిర్ధారించడానికి నీటిని ఉపయోగించి పరీక్షించండి. అయినా కూడా శబ్దం వస్తే, అది టైర్లు మరియు రిమ్ముల మధ్య రాపిడి వలన వస్తుంటుంది. దీనికి బయపడాల్సిన అవసరం లేదు.

తక్కువ గాలితో కూడా నడపవచ్చు.

తక్కువ గాలితో కూడా నడపవచ్చు.

ట్యూబులు ఉన్న టైర్ల పంక్చర్ అయితే ఏంటి పరిస్థితి? ఇవాళ రాంగ్ టైమ్‌లో స్టార్ట్ అయ్యామనుకుని గొనుక్కుంటూ టైరు మార్చుకుంటాం. టూ వీలర్లు అయితే, పంక్చర్ షాప్ వరకు నెట్టుకుంటూ వెళ్లాల్సిందే. కానీ ట్యూబ్ లెస్ టైర్లతో ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే, ఇవి తక్కువ గాలి ఉన్నపుడు మరియు పంక్చర్ ఉన్నపుడు కూడా నడుస్తాయి. కాబట్టి మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు పంక్చర్ వేయించుకోవచ్చు.

లిక్విడ్‌తో సీలింగ్

లిక్విడ్‌తో సీలింగ్

ట్యూబ్ లెస్ టైర్లు పంక్చర్ అయినా కూడా ఎలా నడుస్తాయి..? టైర్లలో ఉన్న గాలి అంతా బయటికొచ్చేస్తుంది కదా...? అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతాయి. ఇక్కడే ఉంది టెక్నాలజీ. పంక్చర్ అయినపుడు ఇనుప చువ్వ కారణంగా టైరులో ఉన్న గాలి బయటకు వచ్చేస్తుంది. అయితే, ట్యూబ్ లెస్ టైర్లలో ఓ లిక్విడ్ ఉంటుంది దానికి గాలి తగలగానే రంధ్రం పడిన ప్రదేశంలో గట్టిగా అయిపోయి రంధ్రాన్ని పూడ్చేస్తుంది.

గాలి నిదానంగా బటకు వెళ్లడం

గాలి నిదానంగా బటకు వెళ్లడం

సాధారణ టైర్లున్న వాహనాలు పంక్చర్‌కు గురైనపుడు వాహనాన్ని ప్రమాదానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా ఎక్కువ గాలి బయటకు రావడం వలన టైర్ పేలి వాహనాన్ని బోల్తాపడేలా చేస్తుంది. అయితే ఈ ట్యూబ్‌ లెస్ టైర్లు పంక్చర్ అయితే గాలి చాలా నిదానంగా బయటకు వస్తుంది. దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ.

తక్కువ బరువు

తక్కువ బరువు

ఈ ట్యూబ్ లెస్ టైర్లబరువు సాధారణ టైర్లతో పోల్చుకుంటే తక్కువగా ఉంటాయి. దీనిని వలన వెహికల్ మొత్తం బరువు తగ్గి ఇంజన్ మీద తక్కువ ప్రభావం చూపుతుంది. దీంతో ఇంజన్ పనితనం పెరిగి మైలేజ్ పెరుగుతుంది.

తక్కువ అరుగుదల

తక్కువ అరుగుదల

ట్యూబ్‌లు ఉన్న టైర్లలో గాలిని అధికంగా నింపేకొద్దీ, వ్యాకోచిస్తాయి. అలాంటి టైర్లతో ప్రయాణిస్తున్నపుడు రోడ్డుకు మరియు టైర్లకు మధ్య రాపిడి అధికమై, ఆ వేడికి టైర్లు ఉపరితలం అరిగిపోవడం, కొన్నిసార్లు పేలిపోవడం జరుగుతుంది. కానీ ట్యూబ్ లెస్ టైర్లు ఉపరితలం మీద నిర్ణీత గ్రిప్ ఉండటంతో టైర్ల అరుగుదల దాదాపు ఉండదు.

ధృడత్వం

ధృడత్వం

ఎక్కువ వేగం వద్ద మీరు వాహనాన్ని నడుపుతున్నపుడు టైర్‌, ట్యూబ్, రిమ్ ఈ మూడు నిర్ధిష్టమైన వేగంతో ఉంటాయి. అయితే టైరు మరియు ట్యూబ్ ల మద్య గల వేగం యొక్క వ్యత్యాసాల వలన గాలి కొద్ది మేర బుడగల రూపంలో టైర్‌‌లోకి చేరుకుని ఉబ్బెత్తుగా మారుతుంది. కాని ట్యూబ్ లెస్ టైర్లలో టైర్ మరియు రిమ్ మాత్రమే ఉండటం వలన ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశమే ఉండదు.

ట్యూబ్ లెస్ టైర్ల అప్రయోజనాలు.

ట్యూబ్ లెస్ టైర్ల అప్రయోజనాలు:

1.అమర్చడంలో ఇబ్బంది

ట్యూబ్ లెస్ టైర్లను రిమ్‌లోకి అమర్చడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే టైరు మరియు రిమ్ముకు మధ్య ఎయిర్ టైట్ సీల్ ఉంటుంది. అనుభవజ్ఞులచే ఫిట్ చేయించడంతో తక్కువ సమయంలో టైరు మరియు రిమ్ముకు ఎలాంటి నష్టం వాటిల్లదు.

ట్యూబ్ లెస్ టైర్ల అప్రయోజనాలు

2. పంక్చర్

ట్యూబ్ లెస్ టైర్లు పంక్చర్‌కు గురైతే పంక్చర్ వేయడానికి కొన్ని ప్రత్యేక పరికరాలు కావాలి. అయితే, ఇప్పుడు దాదాపు అన్ని మెకానిక్ షాపుల్లో అందుబాటులోకి వచ్చాయి. పంక్చర్ వేసే వాళ్లు కూడా ఈ పనితనం నేర్చుకున్నారు. కాబట్టి ఇది పెద్ద సమస్య ఏమీ కాదు.

ట్యూబ్ లెస్ టైర్ల అప్రయోజనాలు

3. టైర్ డ్యామేజ్

ఒక వేళ సాదారణ టైర్లు పెద్ద పంక్చర్‌కు గురైతే ట్యూబ్‌ను మార్చేసి, దాని స్థానంలో కొత్త ట్యూబ్‌ను మారుస్తారు. కాని ట్యూబ్ లెస్ టైర్ పెద్ద పంక్చర్‌కు గురైతే ఆ టైరును పూర్తిగా మార్చేసి కొత్త టైరును తీసుకోవాల్సిందే. ఇది మీ జేబుకు చిల్లులు పెట్టేస్తుంది.

ట్యూబ్ లెస్ టైర్ల అప్రయోజనాలు

4. ధర

ట్యూబ్ లెస్ టైర్లు సాధారణ టైర్లతో పోల్చుకుంటే ఖరీదైనవి. ఎందుకంటే ఇందులో ఎక్కువ విలువైన మెటీరియల్‌ను ఉపయోగించారు.

ట్యూబ్ లెస్ టైర్ల ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు!!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ట్యూబ్ లెస్ టైర్లు కార్లలో కంటే బైకుల్లో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యాయి. ప్రమాదాలు పెద్దగా జరగకపోవడం, పంక్చర్ అయినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. దీనికి తోడు కంపెనీలు కూడా ట్యూబ్ లెస్ టైర్లతో తమ వాహనాలను విక్రయిస్తున్నాయి.

Most Read Articles

English summary
Expert Talk: The Main Advantages & Disadvantages Of Tubeless Tyres
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X