మహీంద్రా కార్ల మధ్య టగ్ ఆఫ్ వార్.. ఊహించని ఫలితం.. వీడియో వైరల్..!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నాణ్యమైన ఉత్పత్తులతో కస్టమర్లలో మంచి ఆదరణను పొందింది. ఆఫ్‌రోడ్ వాహనంగా మహీంద్రా థార్ (Mahindra Thar) గణనీయమైన విక్రయాలను నమోదు చేసుకుంది. సరసమైన ధరలోనే అందుబాటులో ఉంది. త్వరలో 5 డోర్ వెర్షన్ మార్కెట్‌లోకి రానుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మహీంద్రా థార్, స్కార్పియో N (Mahindra Scorpio N) మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతున్న వీడియో ఇది. ఈ వీడియోను స్మాల్ టౌన్ రైడర్ యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మహీంద్రా థార్ ఆటోమేటిక్ వేరియంట్, స్కార్పియో 4Xplor Z8L మాన్యువల్ వేరియంట్‌లు పోటీపడ్డాయి.

మహీంద్రా థార్, స్కార్పియో N వాహనాలు ఒకదాని కొకటి గట్టి పోటీనిచ్చాయి. స్కార్పియో కొన్ని సమయాల్లో వెనక్కి తగ్గినట్లు కనిపించినా.. గట్టి పోటీనిచ్చింది. స్కార్పియో 4వీల్ డ్రైవ్‌ను కలిగి ఉంటుంది. మొదటి రౌండ్‌లో మహీంద్రా థార్.. స్కార్పియో Nను విజయం సాధించింది. అయితే రెండో రౌండ్‌కు వచ్చేసరిగా రెండు కారు గట్టి పోటీనిచ్చాయి. ఫలితంగా ఆట టైగా ముగిసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మహీంద్రా 3 డోర్ థార్ ప్రారంభ ధర రూ.10.98 లక్షల నుంచి రూ.16.94 లక్షలుగా ఉంది. ఈ థార్ 1.5 లీటర్ డీజిల్, 2.2 లీటర్ డీజిల్, 2.0 లీటర్ టర్బోచార్జడ్ పెట్రోల్ ఇంజిన్లను కలిగి ఉంది. 6-స్పీడ్ మాన్యువల్/ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది.

మహీంద్రా స్కార్పియో N ఇంజిన్ : మహీంద్రా స్కార్పియో N 2.0 లీటర్ టర్బోఛార్జడ్ పెట్రోల్ ఇంజిన్ 200 bhp శక్తి, 380 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ తో అందుబాటులో ఉంది.
మహీంద్రా థార్ 5 డోర్ : ఇటీవల మహీంద్రా థార్ 5 డోర్ వేరియంట్‌ను టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. SUV ముందు భాగంలో కొత్త గ్రిల్, LED ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్‌లు, కొత్త టెయిల్ ల్యాంప్‌లను గుర్తించాం. దీంతోపాటు ఈ ఆఫ్‌రోడ్ SUV వెనుకవైపు డిజైన్‌లో చాలా మార్పులు చేశారు. అల్లాయ్ వీల్స్, పిల్లర్ మౌంటెర్ డోర్ హ్యాండిల్‌ను అమర్చారు.

కొన్ని నివేదికల ప్రకారం 5- డోర్ థార్ ఆఫ్ డోర్ SUV 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2,2 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 6-స్పీడ్ మాన్యువల్/ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే 5 డోర్ థార్ ధర ఎంత ఉంటుందనే స్పష్టత లేకపోయినా.. రూ.15 లక్షల - రూ.16 లక్షల మధ్య ఉంటుందని అంచనా.
3- డోర్ మహీంద్రా థార్‌తో పోలిస్తే 5 డోర్ థార్ 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఈ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. 4- స్పోక్ స్టీరింగ్ వీల్, సర్కులర్ AC వెంట్స్, స్టీరింగ్ మౌటెండ్ కంట్రోల్స్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ సహా అనేక కీలక ఫీచర్లున్నాయి.


Click it and Unblock the Notifications








