లాక్ డౌన్ ఉల్లంఘించిన కర్ణాటక ఎమ్మెల్యే, ఎవరో తెలుసా.. !
కరోనా వైరస్ ప్రభావానికి ప్రపంచ దేశాలు భయబ్రాంతులకు గురవుతున్నాయి. ఈ కరోనా వ్యాప్తి వల్ల చాలామంది ప్రజలు చనిపోతున్నారు. అంతే కాకుండా రోజు రోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ కారణంగా చాలా దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

భారతదేశంలో కరోనా వ్యాప్తిని తగ్గించడానికి భారత ప్రభుత్వం 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ లో భాగంగా అత్యవసర సేవలు మినహాయించి మిగిలినవన్నీ రద్దు చేయబడ్డాయి. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఒక రాష్ట్రంలోని ప్రజలను ఇతర రాష్ట్రాలకు వెళ్లనియ్యడం లేదు. ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నప్పటికీ కొంతమంది వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఒక ఎమ్మెల్యే తన మనవడితో రోడ్డుపైకి రావడం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం..

భారతదేశంలో చాలామంది రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించడం మనం ఇదివరకే చాలా చూసాం. కానీ ఇప్పుడు కరోనా వైరస్ వ్యాపిస్తున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా బాధ్యతాయుతంగా నడుచుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఒక ఎమ్మెల్యే లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పడ్డాడు.

కర్ణాటకలోని గుబ్బి అనే ప్రాంతానికి చెందిన శాసనసభ సభ్యుడు ఎస్.ఆర్.శ్రీనివాస్ లాక్ డౌన్ సమయంలో రహదారిపైకి తన మనవడితో రోడ్డుపైకి వచ్చాడు. ఈ విధంగా రోడ్డుపైకి వచ్చినప్పుడు ఈ సంఘటనను ఒక పోలీసు అధికారి మొబైల్ ఫోన్ కెమెరాలో వీడియో తీశారు. ఈ ఎమ్మెల్యే రిమోట్ కంట్రోల్డ్ బొమ్మ కారులో ఉన్న తన మనవడిని అనుసరయించడం వీడియోలో చూడవచ్చు.

గత కొన్ని రోజులుగా భారతదేశంలో విధించిన లాక్ డౌన్ లో భాగంగా పోలీస్ అధికారులు నిరంతరం ప్రజలకు అవగాహన కలిపిస్తూనే ఉన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఒక ఎమ్మెల్యే ఈ విధంగా చేయడం వల్ల అతడిపై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు.

భారతదేశంలోని అనేక ఇతర ప్రాంతాల్లో లాక్ డౌన్ ఉల్లంఘించినందుకు పోలీసు అధికారులు వాహనదారుల వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరికొందరికి భారీ జరిమానాలు కూడా విధించారు.

ఈ విధంగా లాక్ డౌన్ సమయంలో ఉల్లంఘించిన ఎమ్మెల్యే ఒక మోస్ట్ సీనియర్ లీడర్. అంతే కాకుండా 4 సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే కూడా. ఈ సమయంలో ఎక్కువ బాధ్యతాయుతంగా నడుచుకుకోవలసిన ఇతడు ఈ విధంగా చేయడం సరైనదికాదని చాలామంది ఖండించారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ 2020 మార్చి 24 న అర్ధరాత్రి 8 గంటలకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. కాబట్టి మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్ డౌన్ లో భాగంగా ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలన్నారు. రోజు రోజుకి పెరుగుతున్న కరోనా వైరస్ నివారణకు ఇప్పటికె చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
భారతదేశంలో లాక్ డౌన్ ప్రకటించడానికి ప్రధాన కారణం ఏమిటంటే వైరస్ ఎక్కువ మందికి సోకకుండా నిరోధించడం. అంతే కాకుండా ఇప్పటికే వైరస్ సోకిన ప్రజలకు తగ్గించడానికి ప్రయత్నాలు చేయడం.

బాధ్యతయుతమైన చట్టసభ సభ్యులు ఈ విధంగా చేయడం చాలా తప్పు. ఎందుకంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వారు కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మిగిలిన వారిని ప్రోత్సహించడమే అవుతుంది. వీరు ఇలాంటి వ్యతిరేఖ చర్యలకు పాల్పడకుండా లాక్ డౌన్ కి మరింత సహకరించాలి.


Click it and Unblock the Notifications








