కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

బుల్లితెర తారలు తమ జీవితంలో ఏ చిన్న సంఘటన జరిగినా వాటిని సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా, ఓ బుల్లితెర నటి సుమారు కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసి, ఆ కారును డెలివరీ తీసుకుంటున్న వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి, వైరల్ అయ్యింది.

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

బాలీవుడ్ పరిశ్రమకు చెందిన ప్రముఖ టెలివిజన్ స్టార్ నియా శర్మ, సరికొత్త వోల్వో ఎక్స్‌సి90 డి5 ఇన్‌స్క్రిప్షన్ కారును కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన అభిమానులతో పంచుకుంది. డబ్బుతో మీరు సంతోషాన్ని కొనలేరు, కానీ కార్లను కొనచ్చు. నా విషయంలో ఇవి రెండూ ఒక్కటే అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

వోల్వో బ్రాండ్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కార్లను తయారు చేసే కంపెనీల్లో ఒకటిగా ఇప్పటికే ప్రపంచ ఖ్యాతిని కలిగి ఉంది. భారతదేశంలో వోల్వో అందిస్తున్న ఎక్స్‌సి90 డి5 ఇన్‌స్క్రిప్షన్ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ.87.90 లక్షలు. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.1 కోటి వరకూ ఉంటుంది.

MOST READ:కొత్త ఆడి ఎ4 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. పూర్తి వివరాలు

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

నియా శర్మ ఇంత ఖరీదైన కారును కొనుగోలు చేసినందుకు గానూ ఆమె సన్నిహితులు, మిత్రులు, కో-స్టార్స్ మరియు అభిమానులు ఆమెకు అభినందనలు తెలిపారు. కారును జాగ్రత్తగా, సురక్షితంగా నడపాల్సిందిగా ఆమెకు సలహాలు కూడా చేస్తున్నారు.

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

నియా శర్మ 2020లో స్పెషల్ ఎడిషన్‌గా వచ్చిన అడ్వెంచర్ రియాలిటీ షో ఖత్రోన్ కే ఖిలాడి మేడ్ ఇన్ ఇండియాలో విజేతగా నిలిచిన విషయం తెలిసినదే. ఈ షోని బట్టి చూస్తుంటే ఈమెకు అడ్వెంచర్స్ అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. భారతి సింగ్, హర్ష్ లింబాచియా, కరణ్ వాహి, రిత్విక్ ధంజని, కరణ్ పటేల్ వంటి ఇతర టెలీ ప్రముఖలతో ఆమె ఈ షోలో పాల్గొంది.

MOST READ:బైక్ రైడర్‌కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

టెలీ స్టార్ నియా శర్మ 2010లో కాశీ - ఏక్ అగ్నిపరీక్ష అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టింది. ఏక్ హజారోన్ మెయి మేరీ బెహ్నా హై, జమై రాజా, ఇష్క్ మెయిన్ మార్జావన్ మరియు నాగిన్ వంటి పలు సీరియళ్లతో ఆమె మంచి పాపులారీటిని సంపాధించుకుంది.

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

2016 మరియు 2017లో బ్రిటిష్ ఆధారిత ఈస్టర్న్ ఐ వార్తాపత్రిక ప్రచురించిన టాప్ 50 సెక్సీయెస్ట్ ఆసియా మహిళల జాబితాలో నియా శర్మ వరుగా మూడవ మరియు రెండవ స్థానాలను దక్కించుకుంది. నియా శర్మ వోల్వో కారును కొనుగోలు చేయటాన్ని చూస్తుంటే, వాహనాల్లో భద్రత పట్ల ఆమె చూపించే ఆసక్తి కనబడుతుంది.

MOST READ:షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

నిజానికి ఈ విభాగంలో, కోటి రూపాయలు వెచ్చిస్తే అనేక ఇతర లగ్జరీ కార్ బ్రాండ్లు లభిస్తాయి. అయితే, వోల్వో ఎక్స్‌సి90 కారులో విలాసవంతమైన ఫీచర్లతో పాటుగా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తాయి. గత కొన్నేళ్లుగా ఇది అత్యంత సురక్షితమైన కారుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

వోల్వో కార్స్ గత కొంతకాలంగా ఎక్స్‌సి90 కారును భారతదేశంలో విక్రయిస్తోంది. ఈ కారును 2017లో బెంగళూరులోని తమ ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేయటాన్ని ప్రారంభించింది. వోల్వో యొక్క ఎస్‌పిఏ మాడ్యులర్ వెహికల్ ఆర్కిటెక్చర్‌పై దీనిని నిర్మించారు.

MOST READ:ఇంటెర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఇప్పుడు వెరీ సింపుల్.. ఇలా చేయండి

కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!

వోల్వో ఎక్స్‌సి90 డి5 ఇన్‌స్క్రిప్షన్ ఎస్‌యూవీలో శక్తివంతమైన 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 4250 ఆర్‌పిఎమ్ వద్ద 235 బిహెచ్‌పి పవర్‌ను మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 480 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. భారత్‌లో ఇది టి8 ఎక్సలెన్స్ హైబ్రిడ్ అనే వేరియంట్‌లో కూడా హైబ్రిడ్ రూపంలో లభిస్తుంది.

Most Read Articles

English summary
Bollywood TV Actress Nia Sharma Buys New Volvo XC90 D5 Inscription. Read in Telugu.
Story first published: Sunday, January 17, 2021, 13:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X