టిటిడికి జూపిటర్ స్కూటర్‌ను కానుకిచ్చిన టీవీఎస్
తిరుమలేశునికి భక్తులు తమకు తోచిన రూపంలో కానుకలను అందజేస్తుంటారు. తాజాగా.. భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తమ సరికొత్త జూపిటర్ స్కూటర్‌ను స్వామి వారికి కానుకగా అందజేసింది. రూ.56,256 విలువైన టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌ను శ్రీవారి సన్నిధిలో కంపెనీ టిటిడికి బహుకరిచింది.
టిటిడి తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ ఈ స్కూటర్ తాళం చెవులను అందుకున్నారు. ఆలయ డిప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ, అజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గతంలో కూడా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఇలా శ్రీవారికి తమ వాహనాలను కానుకగా అందించాయి. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో ఇండియా భారత మార్కెట్లోకి ప్రవేశించిన సందర్భంగా విడుదల చేసిన తమ మొట్టమొదటి కారు (రెనో ఫ్లూయెన్స్)ను స్వామి వారికిగా కానుకగా సమర్పించుకుంటే, ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన సత్య మోటార్స్ పియాజ్జియో ఆపే మినీ ట్రక్కును, మహీంద్రా టూవీలర్స్ తమ కొత్త డ్యూరో డిజెడ్ స్కూటర్‌ను మరియు అశోక్ లేలాండ్ తమ తొలి ప్యాసింజర్ కార్ స్టయిల్ ఎమ్‌పివి తిరుమల తిరుపతి దేవస్థానానికి కానుకగా సమర్పించిన సంగతి తెలిసినదే.

చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ తిరుమల తిరుపతి దేవస్థానానికి బహుకరించిన రెడ్ కలర్ టీవీఎస్ జూపిటర్ స్కూటర్.

టిటిడి తరఫున టీవీఎస్ జూపిటర్ స్కూటర్ తాళం చెవులను అందుకుంటున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ డిప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ, అజయ్ తదితరులు.

ఇంజన్
పురుషుల కోసం ప్రవేశపెట్టిన ఈ టీవీఎస్ జూపిటర్ ఓ 110సీసీ స్కూటర్. ఈ సివిటి-ఐ ఇంజన్ గరిష్టంగా 8 బిహెచ్‌పిల శక్తిని, 8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 7.2 సెకండ్ల వ్యవధిలో 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

మైలేజ్
టీవీఎస్ జూపిటర్ ఆటోమేటిక్ స్కూటర్ పవర్, ఎకానమీ అనే రెండు రైడింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇది లీటరుకు 62 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు
టీవీఎస్ జూపిటర్‌లో సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లు లభ్యం కానున్నాయి. అవి, ఎక్స్‌టర్నల్ ఫ్యూయెల్ ఫిల్లర్ క్యాప్ (పెట్రోల్ పట్టించడం కోసం సీట్ ఎత్తాల్సిన అవసరం లేదు), గ్యాస్ ఫిల్డ్ రియర్ షాక్ అబ్జార్వర్స్ (సౌకర్యవంతమైన రైడ్ కోసం), ఎల్ఈడి ల్యాంప్స్, ఈజీ సెంటర్ స్టాండ్ వంటి ఫీచర్లతో ది లభిస్తుంది.

ఇతర ఫీచర్లు
ఇంకా ఇందులో ట్విన్ సిటీ ల్యాంప్స్, ఆప్షనల్ మొబైల్ ఛార్జర్, ట్యూబ్‌లెస్ టైర్స్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, 5.3 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ, 17 లీటర్ల అండర్ స్టోరేజ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్
టీవీఎస్ జూపిటర్ ఆటోమేటిక్ స్కూటర్ ప్రిస్టీన్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, టైటానియం గ్రే, వొల్కానో రెడ్ అనే నాలుగు సరికొత్త కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది.


Click it and Unblock the Notifications








