TVS హెల్మెట్స్.. GPS, గూగుల్ అసిస్టన్స్ తో పాటు మరెన్నో స్మార్ట్ ఫీచర్స్..!
భారతదేశపు ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ ఈసారి ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో పాల్గొనలేదు. అయితే, గత రెండురోజులుగా TVS MotoSoul పేరిట గోవాలో తన వినియోగదారుల కోసం ఈవెంట్ ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రోనిన్ బైక్ లతో ఫ్లాట్ ట్రాక్ రేసింగ్ లోకి ప్రవేశిస్తున్నట్లు టీవీఎస్ ప్రకటించింది.
శనివారం జరిగిన కార్యక్రమంలో TVS కంపెనీ తన వినియోగదారుల కోసం రెండు బహుళ ప్రయోజన స్మార్ట్ కనెక్ట్ S10X, S20X హెల్మెట్ కమ్యూనికేషన్ పరికరాలను విడుదల చేసింది. వీటిలో Smart Connect S10X ధర రూ.8499గా నిర్ణయించింది. అలానే Smart Connect S20X రూ.10999 ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచింది.

అప్ డేటెడ్ ఫీచర్లతో అందుబాటులోకి..
S10X, S20X హెల్మెట్-మౌంటెడ్ కమ్యూనికేషన్ నియంత్రణల కోసం మూడు బటన్ లను ఇచ్చింది. హెల్మెట్ కు మధ్యలో Xతో కూడిన ఆధునిక డిజైన్ ను కలిగి ఉండనుంది. RGB LEDలు వీటికి ప్రత్యేక లుక్ లో ఆకర్షించనుంది. ఈ సరికొత్త డిజైన్ కచ్చితంగా ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.
రెండు హెల్మెట్ లు అప్‌డేట్ చేయబడిన TVS కనెక్ట్ యాప్‌కి కనెక్ట్ చేయబడతాయని సంస్థ తెలిపింది. ఈ హెల్మెట్ లో ఇంటర్ కామ్ సిస్టమ్ ద్వారా 1.2 కి.మీ రేంజ్ దూరం వరకు రైడర్ లతో యాప్ కమ్యూనికేట్ చేయడానికి వీలుంటుందని చెప్పింది. బ్లూటూత్ సపోర్ట్ తో ఇది పనిచేస్తుంది. మొబైల్ GPS నావిగేషన్ ను కూడా ఇందులో పొందుపరిచారు. అలాగే అనేక అధునాతన ఫీచర్లు ఈ హెల్మెట్ లో పొందవచ్చని సంస్థ వెల్లడించింది.

ఆటోమేటిక్ గా మ్యూజిక్ వాల్యూ తగ్గించవచ్చు..
గూగుల్ అసిస్టెంట్ & సిరి ఫీచర్లను ఇందులో ఉపయోగించవచ్చు. Xonnect S10X & S20X రెండూ కూడా JBL ద్వారా ట్యూన్ చేయబడిన ఆడియో సెటప్ కు ట్రీట్ ను ఆశ్వాదించవచ్చు. టెర్రా స్పాట్ అని పిలువబడే మ్యూజిక్ ఇంటర్ కామ్ సెటప్ తో పాటు పని చేస్తుంది. టెర్రా స్పాట్ డైనమిక్ వాల్యూమ్ కంట్రోల్ ఫీచర్ ఇంటర్ కామ్ కమ్యూనికేషన్ ల సమయంలో మ్యూజిక్ వాల్యూమ్ ను ఆటోమేటిక్ గా తగ్గిస్తుంది. ఇది హైలెట్ ఫీచర్ గా అభివర్ణించవచ్చు.
Xonnect S10X, S20X రెండూ దుమ్ము, నీటి నిరోధకత రెండింటిని తట్టుకునేలా IP67 రేసిస్టన్స్ తో తీసుకువచ్చింది. ఈ హెల్మెట్లను ధరించి ప్రయాణించడం వల్ల మురికి వేసవి, తీవ్రమైన వర్షాకాలంలో ఎలాంటి సమస్యలు దరిచేరవు. ఈ రకం హెల్మెట్లు మార్కెట్ లో తక్కువగా లభిస్తున్నాయి. ఒక గొప్ప ఫీచర్ గా భావించవచ్చు.
ఘనంగా ముగిసిన వేడుకలు..
రెండో రోజు ముగింపు వేడుకలో టీవీఎస్ మోటార్ కంపెనీ బిజినెస్ డిపార్ట్‌మెంట్ హెడ్ విమల్ సుంబ్లి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం మా కస్టమర్లు, మోటార్ సైకిల్ సంగీత ప్రియులకు మంచి అనుభూతిని అందించిందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఈవెంట్ విజయానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం కస్టమర్ల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ చాలా ప్రోత్సాహకరంగా ఉందని దీనికంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని ఈవెంట్ వేదికగా ఆయన ప్రకటించారు.
మొదటి రోజు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. TVS కంపెనీ మొదటి రోజు రోనిన్ మోటార్ సైకిల్ మోడళల్లో నాలుగు కొత్త వెర్షన్ లను ప్రదర్శించింది. సరికొత్త బైక్ లు ఎక్సైటింగ్ లుక్ తో ఉన్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా, డర్ట్ రేస్, మోటో క్రాస్‌ఫిట్, స్టంట్ షో, స్లో రేస్, మ్యూజిక్ తో సహా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ మోటోసౌల్ కుకు మంచి స్పందన లభించింది.


Click it and Unblock the Notifications








