వీగో స్కూటర్ మీద ధరలు తగ్గించిన టీవీఎస్

Written By:

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ వీగో స్కూటర్ మీద ధర తగ్గించినట్లు ప్రకటించింది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పలు సంస్థలు తమ ఉత్పత్తుల మీద ధరల పెంపు చేపడుతుంటే, టీవీఎస్ మోటార్స్ ఆశ్చర్యకరంగా వీగో స్కూటర్ ధరలో రూ. 2,000 ల వరకు తగ్గించింది.

Recommended Video - Watch Now!
BMW G 310 GS ను షోకేస్ చేసిన BMW | BMW G 310 GS Full-Specifications - DriveSpark
టీవీఎస్ వీగో మీద తగ్గిన ధరలు

టీవీఎస్ వీగో మునుపటి ధర రూ. 52,165 లు ధరల సవరణ అనంతరం దీని ధర రూ. 50,165 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. అయితే, డిస్క్ వేరియంట్లో లభించే టీవీఎస్ ధరలో ఎలాంటి మార్పులేదు. టీవీఎస్ వీగో డిస్క్ వేరియంట్ ధర రూ. 53,083లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

టీవీఎస్ వీగో మీద తగ్గిన ధరలు

వీగో సేల్స్ పెంచుకునే ఉద్దేశ్యంతోనే ఈ మోడల్ మీద ధరలు తగ్గింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2018లో వీగో సేల్స్‌ను 2017 ఫిబ్రవరి సేల్స్‌తో పోల్చుకుంటే తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ, ఇదే వీగో ఆధారంతో డెవలప్ చేసిన జూపిటర్ మాత్రం విక్రయాల పరంగా వీగో స్కూటర్‌ను అధిగమించింది.

టీవీఎస్ వీగో మీద తగ్గిన ధరలు

సాంకేతికంగా టీవీఎస్ వీగో స్కూటర్‌లో 109.7సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 8బిహెచ్‌పి పవర్ మరియు 8.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టీవీఎస్ వీగో మీద తగ్గిన ధరలు

సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ కలదు. టీవీఎస్ వీగోలో, ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఇడి టెయిల్ లైట్లు, 16-లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, 12-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్, బయటివైపు ఉన్న ఫ్యూయల్ ఫిల్లర్ మరియు ఇగ్నిషన్ కీ లైటింగ్ వంటివి ఫీచర్లు ఉన్నాయి.

టీవీఎస్ వీగో మీద తగ్గిన ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ వీగో ఎంతో కాలంగా దేశీయ స్కూటర్ల పరిశ్రమలో ఉంది. ప్రస్తుతం, దీని మీద రెండు వేల రుపాయలు ధర తగ్గడంతో వీగో సేల్స్ ఊపందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టీవీఎస్ ఇటీవల విడుదల చేసిన అపాచే ఆర్ఆర్310 స్పోర్ట్స్ బైకు మీద ధర పెంచింది.

టీవీఎస్ వీగో, విపణిలో ఉన్న హోండా యాక్టివా-ఐ, సుజుకి లెట్స్ మరియు యమహా రే-జడ్ వంటి స్కూటర్లకు గట్టి పోటీనిస్తోంది.

టీవీఎస్ వీగో మీద తగ్గిన ధరలు

1. బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 150 మోటార్‌సైకిల్‌కు వీడ్కోలు

2.ఆర్మీ ఎడిషన్‌లో టాటా సఫారీ: అసలు తిరకాసు ఇక్కడే ఉంది!!

3.మార్కెట్ నుండి పల్సర్ ఎల్ఎస్ 135 బైకును తొలగించిన బజాజ్

4.125సీసీ స్కూటర్ కొంటున్నారా...? అయితే దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!!

5.విడుదలకు సిద్దమైన ఏబిఎస్ వెర్షన్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్: ధర మరియు ఇతర వివరాలు

English summary
Read In Telugu: TVS Wego Prices Reduced — Company Hopes To Revive Sales Of the Wego
Story first published: Monday, April 9, 2018, 12:20 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark