వీడు తోపు దమ్ముంటే ఆపు.. ఎక్స్ఎల్ బండికి రూ.3 లక్షల వీఐపీ ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్..

ఇటీవల దేశంలో వీఐపీ సంస్కృతి పెరిగిపోతోంది. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు రకరకాల పనులు చేస్తుంటారు. అందరి దృష్టి తమపై ఉండాలని కోరుకుంటారు. ఖరీదైన దుస్తులు, గడియారాలు, ఫోన్లు, లగ్జరీ కార్లు, బైకులతో తమ హుందాతనాన్ని చాటుకుంటారు. ఆ హుందాతనానికి ఇప్పుడు మరొకటి జోడిస్తున్నారు. అదే వీఐపీ నెంబర్‌.

లక్షలు, కోట్లు విలువ చేసే బైకులు, కార్లను మనం ప్రముఖులు, సెలబ్రిటీల వద్ద ఎక్కువగా చూస్తుంటాం. అవి ఎంత ఖరీదైనవి అయినా వాటికి సాధారణ నెంబర్‌ కాకుండా వీఐపీ, ఫ్యాన్సీ నంబర్లు ఉంటేనే ఆ హుందాతనం స్పష్టంగా తెలుస్తుంది. అందుకే లక్షలు ఖర్చు చేసి మరీ వీఐపీ నంబర్లను కొనుగోలు చేస్తారు.

VIP-Number-Plate

ఖరీదైన వాహనాలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీఐపీ నెంబర్‌ కొనుగోలు చేయడం పెద్దగా ఆశ్చర్యం అనిపించదు. ఎందుకంటే అంత బడ్జెట్‌లో వాహనం కొనుగోలు చేసిన వారికి వీఐపీ నెంబర్‌ కోసం ఆ మాత్రం ఖర్చు చేయడానికి వెనుకాడరు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి తన టీవీఎస్‌ బండికి రూ. 3 లక్షలు పెట్టి వీఐపీ నెంబర్‌ కొనుగోలు చేశారు. షాకయ్యారు కదా.. అసలు కథనంలోకి వెళ్తే..

వీఐపీ నంబర్‌ ప్లేట్‌ ఉన్న TVS XL 100 ని మీరు ఎప్పుడైనా చూశారా.. ఈ బండి దేశీయ మార్కెట్‌లో ఎంట్రీ లెవెల్‌ మోటార్‌ సైకిల్‌. దేశవ్యాప్తంగా ప్రతి చోటా మనం ఈ బండిని చూడవచ్చు. తక్కువ బడ్జెట్‌లో అధిక మైలేజిని ఇస్తూ డ్రైవింగ్‌ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ 100 కి వీఐపీ నెంబర్‌ ఉండటం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

VIP-Number-Plate

రోడ్డుపై ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద వేచి ఉన్న TVS XL 100 బండిపై వీఐపీ నెంబర్‌ X0009 ఉండటాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఈ బండి వెనుక ప్రయాణిస్తున్న మరో వాహనదారుడు ఆ బండిని ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. టీవీఎస్‌ బండికి X0009 తో ఉన్న వీఐపీ నెంబర్‌ను చూసి అతను ఆశ్చర్యానికి గురయ్యాడు.

0001 మరియు 0010 మధ్య ఉన్న సంఖ్యలు కొన్ని ఇతర ప్రత్యేక సీక్వెన్స్‌లతో పాటు VIP నంబర్లు అని అందరికీ తెలిసిందే. వాహనదారులు వీటిలోని వీఐపీ నెంబర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఆర్టీవోకి లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే సెలబ్రెటీలు మరియు ఖరీదైన కార్లకు మాత్రమే ఇలాంటి నంబర్లను చూస్తాం.

VIP-Number-Plate

అయితే మనం బడ్జెట్‌ చూసుకుని కొనుగోలు చేసే మోటారు సైకిళ్లపై VIP నంబర్ ప్లేట్‌ను చూడలేం. ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి అనంతరం TVS XL 100 ధరను ఇంటర్నెట్‌లో వెతికాడు. తాజా సమాచారం ప్రకారం ఆ బండి విలువ దాదాపు రూ. 53,000 అని తెలుసుకున్నాడు. మరోవైపు ఈ వీఐపీ నంబర్ ప్లేట్ 0009 ధర రూ.3 లక్షలు.

ఒక వ్యక్తి తన ద్వి చక్ర వాహనం ధర కంటే దాదాపు 6 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి నంబర్ ప్లేట్‌ను కొనుగోలు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లను విపరీతంగా స్పందించారు. కామెంట్స్‌లో తమ అభిప్రాయాలను వెల్లడించారు. మరికొందరు ఆ డబ్బుతో కారు కొనుగోలు చేయవచ్చని కామెంట్‌ చేశారు.

ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ ఇన్‌స్టాగ్రామ్‌లో 15.3 మిలియన్లకు పైగా వీక్షించారు. 1.66 మిలియన్ల కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది. దీని ద్వారా ప్రజలు దీనిపై ఎంత ఆశ్చర్యం వ్యక్తం చేశారో అర్థం చేసుకోవచ్చు. వీఐపీ నంబర్లపై ఉన్న అభిరుచితో ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడరనేది ఈ టీవీఎస్‌ వాహనదారుడిని చూస్తే అర్థమవుతోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 27, 2023, 17:05 [IST]
English summary
Tvs xl 100 has vip number plate worth rs 3 lakh video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+