ఏసి డబుల్ డెక్కర్ ట్రైన్స్: కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-గుంటూర్
ఇకపై కాచిగూడ నుంచి తిరుపతి వచ్చి స్వామి వారిని దర్శించుకోవాలనుకునే వారికి 'చల్లటి' వార్త. ఇటీవలే ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రెండు ప్రత్యేక డబులె డెక్కర్ ఏసి రైళ్లను కేటాయించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే.
దక్షిణ మధ్య రైల్వేలో రెండు డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే రైల్వే బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ రెండు డబులె డెక్కర్ రైళ్లలో ఒకటి కాచిగూడ నుంచి గుంటూరుకు, మరొకటి కాచిగూడ నుంచి కాజీపేట మీదుగా తిరుపతికి నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో, పంజాబ్‌లోని కపుర్తాలోని రైల్ కోచ్‌ఫ్యాక్టరీలో తయారైన ఓ డబుల్ డెక్కర్ రైలు ఇటీవలే కాజీపేటకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ రైలును కాచిగూడలో రైల్వేమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ డబుల్ డెక్కర్ రైలు విశిష్టతలు మరియు చార్జీల వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఈ డబుల్ డెక్కర్ రైలు ఇంజన్ ముందు, వెనుక రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు ఉంటాయి. అలాగే ఇందులో 14 ఏసి బోగీలు ఉంటాయి.

ఒక్కో డబుల్ డెక్కర్ కోచ్‌లో 120 మంది కూర్చుంటారు (కింద, పైన కలిపి). ఇలా రైలు మొత్తంలో 1680 మంది ప్రయాణికులు కూర్చునే సౌకర్యం ఉంది.

ఎరుపు, పసుపు రంగుల కలయికతో ఉండే ఈ ఏసి డబుల్ డెక్కర్ రైలును ధృడమైన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మించారు.

ఈ డబుల్ డెక్కర్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ప్రస్తుత నడిచే రైళ్ల వేగంతో పోల్చుకుంటే, ఇది లాచా అధికం (ప్రస్తుతం నడిచే రైళ్లు వేగం గంటకు 120 కి.మీ.)

ఈ ట్రైన్‌లో రైలు వేగం, దూరం, తర్వాతి స్టేషన్ వంటి వివరాలను తెలిపే రియల్ టైమ్ రన్నింగ్ పొజిషన్‌ను చూపించే జిపిఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది.

అంతేకాకుండా.. త్వరగా ఓపెన్ చేసుకునే వీలున్న ఎమర్జేన్సీ కిటికీ అద్దాలు, ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్, స్మూత్ రైడ్ కోసం మల్టిపుల్ షాక్ అబ్జార్వర్స్, అన్ని కోచ్‌లలో స్మోక్ డిటెక్షన్ సిస్టమ్, అలారమ్ మరియు మంటలను ఆర్పే యంత్రాలు వంటి సేఫ్టీ, కంఫర్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ డబుల్ డెక్కర్ రైలులో హైదరాబాద్ నుంచి తిరుపతికి చార్జీ రూ.720లు, అలాగే హైదరాబాద్ నుంచి గుంటూరుకి 415లుగా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








