వావ్ గ్రేట్.. 24 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలు: సైకిల్‌పై చుట్టి వచ్చేసారు
'పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండ నీదే విజయం' అనే పాటను చాలామంది వినే ఉంటారు. అయితే బెంగళూరుకు చెందిన యువకులు ఈ పాటలోని మాటలను నిజం చేశారు. ఇంతకీ వీరు అంత గొప్ప ఘనకార్యం ఏమి చేశారు అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. బెంగళూరుకు చెందిన 23 సంవత్సరాల 'ధనుష్ మంజునాథ్' మరియు 24 సంవత్సరాల 'హేమంత్' అనే ఇద్దరు యువకులు భారతదేశంలో 24 రాష్ట్రాలను మరియు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలను 245 రోజుల్లో చుట్టి వచ్చారు. ఇందులో ఏమి గొప్ప అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా, వీరు 245 ప్రయాణించింది ఏసీ కారులోనే లేదా బస్సుల్లోనో కాదు సైకిల్ పైన. ఇది వినటానికి కొంత విడ్డూరంగా ఉన్నా, ఇదే నిజం.

ఆరోగ్య శాఖలో పనిచేసిన మంజునాథ్, హోస్కోటేకు చెందిన హేమంత్ ఇద్దరూ కూడా దేశవ్యాప్తంగా సైక్లింగ్ చేసి స్పోర్ట్స్ క్లైమ్బింగ్ మరియు అడ్వెంచర్ సైక్లింగ్ వంటి వాటిమీద అవగాహన కల్పించడానికి 2021 జులై 11 న బెంగళూరులోని విధాన సౌధ ప్రాంతం నుంచి తమ ప్రయాణం ప్రారంభించింది దేశంలో 24 రాష్ట్రాలను చుట్టేశారు. అంతే కాకుండా 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా వీరు సైక్లింగ్ చేసి అందరిని ఔరా అనిపించారు.

ఈ ఇద్దరికీ సైక్లింగ్ పైన సరైన అవగాహన లేదు. అంతే కాకుండా వారి ప్రయాణంలో ఎలాంటి బ్యాకప్ మరియు వైద్య సిబ్బంది కూడా లేదు. వారి సైకిల్స్ పైన దాదాపు 50 కేజీల బరువుతో మొత్తానికి 24,000 కిలోమీటర్ల ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసి అరుదైన రికార్డ్ బద్దలు కొట్టారు. ఇటీవల (2022 మార్చ్ 12) బెంగళూరుకు తిరిగి చేరుకున్నారు.

వీరి ప్రయాణం 50 డిగ్రీల సెల్సియస్ లో మరియు -10 డిగ్రీల సెల్సియస్ లో కూడాముందుకు సాగించారు. కొన్నిసార్లు చాలా కఠినమైన సందర్భాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మంచులో చిక్కుకున్నామని తమిళనాడు, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో కూడా కొన్ని ఆటంకాలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు. వీరి మొత్తం ప్రయాణానికి దాదాపు రూ. 9 లక్షలు ఖర్చు అయినట్లు, ఆ మొత్తం డబ్బును కొంతమంది స్పాన్సర్ చేసారని కూడా చెప్పారు.

245 రోజుల వ్యవధిలో, వీరిద్దరూ సిలిగురిలో విపరీతమైన వర్షం, హిమాచల్ ప్రదేశ్‌లో హిమపాతం మరియు రాజస్థాన్‌లో మండే వేడిని ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఎన్ని ఆటంకాలను ఎదుర్కొన్నప్పటికీ అద్భుతమైన ప్రదేశాలను సందర్శించగలిగామన్నారు. ఈ ప్రయాణంలో వివిధ ప్రాంతాల ఆహారపు రుచులను కూడా అనుభవించాము. ఈ ప్రయాణం కోసం మంజునాథ్ తన ఉద్యోగాన్ని సైతం వదిలివేశారు.

ఈ పర్యటనలో దాదాపు 20 కి పైగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను కూడా వారు సందర్శించినట్లు సమాచారం. అంతేకాకుండా, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు మరియు అందరికీ సమాన విద్య ఆవశ్యకతపై పెరుగుతున్న ఆందోళనపై స్థానిక ప్రజలతో చర్చించినట్లు తెలిపారు.

తమ ప్రయాణం గురించి హేమంత్ మాట్లాడుతూ.. నిజంగా ఈ ప్రయాణం ఎన్నో గొప్ప ప్రదేశాలను పరిచయం చేసింది. జీవితంలో ఇది మరచిపోలేని అన్హుభూతి అని అన్నారు. మొదట్లో వారి ప్రయాణం గురించి చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మలేదని, ఇప్పుడు తమకు చాలా గర్వంగా ఉందని అన్నారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
నిజానికి 'జన్మనామ్ నరజన్మ దుర్లభం' అనే సంస్కృత వాక్యం ప్రకారం అన్ని జనాల్లోకి మానవ జన్మ చాలా గొప్పది అని చెబుతారు. కాబట్టి మనం ఏమి చేయాలన్నా.. ఏమి సాధించాలన్నా ఇప్పుడే సాధించాలి. ఇప్పుడు భారతదేశం చుట్టివచ్చిన ధనుష్ మంజునాథ్ త్వరలో భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 సంవత్సరాలు కానున్న కారణంగా సైకిల్ పెయిన్ లండన్ వెళ్లాలని అనుకున్నట్లు తెలిపాడు.
Image Courtesy: Hemanth Gowda, Dhanush Manjunath/Instagram


Click it and Unblock the Notifications








