మీకు తెలుసా.. అక్కడ బస్సులు కోవిడ్-19 వ్యాక్సిన్ సెంటర్లుగా మారాయ్

ప్రపంచాన్ని వణికించిన కరోనా సెకండ్ వేవ్ తీవ్రత భారతదేశంలో కూడా ఎక్కువగా విస్తరించింది. ఈ మహ్మమరి కారణంగా ఎంతో మంది ప్రజలు మరణించగా, మరికొందరు దీనితో ఇప్పటికి పోరాడుతూనే ఉన్నారు. కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలతో లాక్ డౌన్ విధించింది. అయితే ప్రస్తుతం కరోనా తీవ్రత తక్కుగా ఉన్నట్లు నివేదికల ద్వారా తెలిసింది.

మీకు తెలుసా.. అక్కడ బస్సులు కోవిడ్-19 వ్యాక్సిన్ సెంటర్లుగా మారాయ్

కరోనా తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ దాని ప్రభావం ఏమాత్రం తక్కువగా లేదు. కావున ఈ సమయంలో కూడా ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. దీనిపై పోరాడటానికి ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో కరోనా నివారణకు అవసరమైన టీకా అందించడానికి ఒక కొత్త పద్దతిని అవలంబించింది.

మీకు తెలుసా.. అక్కడ బస్సులు కోవిడ్-19 వ్యాక్సిన్ సెంటర్లుగా మారాయ్

నివేదికల ప్రకారం, నార్త్ ఈస్టర్న్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌ఇకెఆర్‌టిసి) ఇప్పుడు ప్రజలకు సౌలభ్యంగా ఉండటానికి మరియు మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు టీకా అందించడానికి ఏకంగా బస్సులను వ్యాక్సిన్ సెంటర్లుగా మార్చారు. దీని గురించి ఎన్‌ఇకెఆర్‌టిసి చైర్మన్‌ 'రాజ్‌‌కుమార్‌ పాటిల్‌ తేల్‌కూర్‌' అధికారికంగా సమాచారం అందించారు.

మీకు తెలుసా.. అక్కడ బస్సులు కోవిడ్-19 వ్యాక్సిన్ సెంటర్లుగా మారాయ్

ఈ సర్వీస్ ఇక ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజల సౌలభ్యం కోసం, జిల్లా యంత్రాంగం మరియు మునిసిపల్ కార్పొరేషన్ ఈ బస్సును వ్యాక్సిన్ కేంద్రంగా మార్చాయి. హాస్పిటల్ లేని గ్రామాలలో ఈ సర్వీస్ అందించబడుతుంది. ఈ సర్వీస్ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. కావున ప్రజలు ఉపయోగించుకోవచ్చు.

మీకు తెలుసా.. అక్కడ బస్సులు కోవిడ్-19 వ్యాక్సిన్ సెంటర్లుగా మారాయ్

కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ప్రజల సౌకర్యార్థం రెండు బస్సులను కేవలం 24 గంటల్లో వ్యాక్సిన్ సెంటర్లుగా మార్చింది. ఈ బస్ హాస్పిటల్ కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. ఎందుకంటే హాస్పిటల్ లో ఉండే దాదాపు అన్ని వసతులు ఇందులో ఉంటాయి. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరియు వ్యాక్సిన్ తీసుకోవడానికి మరియు రెస్ట్ తీసుకోవడానికి అనుకూలంగా వీటిని ప్రత్యేకంగా తయారు చేశారు.

మీకు తెలుసా.. అక్కడ బస్సులు కోవిడ్-19 వ్యాక్సిన్ సెంటర్లుగా మారాయ్

దీని గురించి కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ, ఈ మొబైల్ బస్ వ్యాక్సిన్ సర్వీస్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. భవిష్యత్ లో ఈ సర్వీస్ మరింత పెంచాలని ప్రభుత్వం కోరినట్లైతే మేము సిద్ధంగా ఉన్నమనన్నారు. ప్రస్తుతం ప్రజల రక్షణ వ్యాక్సిన్ వారి వద్దకే వెళ్లి ఇవ్వడం చాలా అవసరం అని అయన అన్నారు.

మీకు తెలుసా.. అక్కడ బస్సులు కోవిడ్-19 వ్యాక్సిన్ సెంటర్లుగా మారాయ్

ప్రస్తుతం మా కార్పొరేషన్ లో దాదాపు 88 శాతం మంది కార్మికులకు టీకాలు వేశారు, అంతే కాకుండా కొంతమంది కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా టీకాలు వేయించారు. నివేదికల ప్రకారం కర్ణాటకలో గడచిన 24 గంటల్లో 5,041 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

మీకు తెలుసా.. అక్కడ బస్సులు కోవిడ్-19 వ్యాక్సిన్ సెంటర్లుగా మారాయ్

24 గంటల్లో కొత్తగా నమోదైన కేసుల్లో 115 మరణాలు సంభవించగా, 14,785 మంది చికిత్స పొందుతున్నారు. నివేదికల ప్రకారం కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 1,62,282 యాక్టివ్ కేసులున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మునుపటితో పోలిస్తే ప్రస్తుతం కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు నమోదైంది.

Most Read Articles

English summary
Buses Into Mobile COVID Vaccination Centers In Karnataka. Read in Telugu.
Story first published: Friday, June 18, 2021, 9:40 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X