రోల్స్ రాయిస్ సన్‌రూఫ్ వద్ద నిల్చొని బాలికల ప్రమాదకర ప్రయాణం.. నెటిజన్ల కామెంట్లు వైరల్!
సన్‌రూఫ్ ఫీచర్ గతంలో ప్రీమియం, లగ్జరీ కార్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. అలా ఫీచర్ చాలా ఆదరణ పొందింది. దీంతో తక్కువ ధర కలిగిన కార్లు కూడా ఈ ఫీచర్‌తో తన వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఈ సన్‌రూఫ్ ఫీచర్‌ను (Car sunroof) కొంత మంది ప్రయాణికులు దుర్వినియోగం చేస్తున్నారు.
కారు సన్‌రూఫ్‌ను దుర్వినియోగం చేస్తున్న కొన్ని సంఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో వీడియో కొంత ఆందోళన కలిగిస్తోంది. రోల్స్ రోయిస్ ఘోస్ట్ లగ్జరీ సెడాన్‌లో (Rolls Royce Sunroof) ఇద్దరు బాలికలు ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు.

రోల్స్ రాయిస్‌లో తొలిసారి? : ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పుష్పక్ మాత్రే తమ యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో స్కూల్ యూనిఫాం ధరించిన ఇద్దరు బాలికలు రోల్స్ రాయిస్ కారులో ప్రయాణం చేస్తున్నారు. ఆ కారు సన్‌రూఫ్ వద్ద నిల్చొని ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు చాలా వైరల్ అయినా.. రోల్స్ రాయిస్ కారులో తొలిసారిగా ఇటువంటి ఘటన చోటుచేసుకుంది.
వీడియో ఆధారంగా ముంబైలోని రద్దీ రోడ్లపై రోల్స్ రాయిస్ కారు సన్‌రూఫ్ వద్ద నిల్చొని ఇద్దరు బాలికలు ప్రయాణం చేస్తున్నారు. అయితే సన్‌రూఫ్ కారు బయట ఉన్న వాతావరణాన్ని ఆస్వాదించేందుకే కానీ, ఇలా ప్రమాదక ప్రయాణాలు చేసేందుకు కాదని గుర్తుపెట్టుకోవాలి. చట్ట ప్రమాదం ఇటువంటి ప్రవర్తన నేరం కింద పరిగణించబడతాయి.

గతంలో అనేక ప్రాంతాల్లో ఇలా ప్రమాదకరంగా ప్రయాణించిన వ్యక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. భారీ జరిమానాలు విధించారు. అయితే రోల్స్ రాయిస్ కారు సన్‌రూఫ్ వద్ద నిల్చొని ప్రయాణం చేస్తున్న వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. కొంత మంది మద్దతుగా కామెంట్ చేయగా.. ఇంకొంత మంది వారి వైఖరిని తప్పుపట్టారు.
రోల్స్ రాయిస్ కారులో ఇద్దరు బాలికలు ప్రవర్తించిన తీరు చట్టప్రకారం నేరం. అయితే కర్ణాటక, కోలకతా పోలీసులు ఇలాంటి ఘటనలను చట్టవిరుద్ధంగా ప్రకటించారు. అయితే సన్‌రూప్ వద్ద నిల్చొని ప్రయాణం చేయడం ఎప్పుడూ కూడా చాలా ప్రమాదం. కారు అకస్మాత్తుగా బ్రేకులు వేస్తే.. ఇద్దరు బాలికలు బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇలాంటి సందర్భాల్లో కారు నుంచి బయటకు విరిసి వేయబడే అవకాశం కూడా ఉంది. అదే జరిగిదే తీవ్ర గాయాలు సహా ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. కొన్నిసార్లు కళ్లలోకి దూళి కణాలు ప్రవేశించి, కంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సరైన గాలి, వెలుతురు సహా బాహ్యా వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వీలుగా చాలా సంస్థలు సన్‌రూఫ్‌ను ఫీచర్‌ను అందిస్తున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








