బైకుపై వెల్తూ స్నానం చేసే వారిని ఎక్కడైనా చూసారా, అయితే ఇప్పుడే చూడండి

సాధారణంగా వాహనదారులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. కానీ ఇప్పుడు చాలా మంది ఎటువంటి నియమాలను పాటించడం లేదు. ఈ కారణంగా రోజు రోజురోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య వేలల్లో పెరిగిపోతుంది.

బైకుపై వెల్తూ స్నానం చేసే వారిని ఎక్కడైనా చూసారా, అయితే ఇప్పుడే చూడండి

హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మద్యం తాగి ప్రయాణించడం, వాహనం యొక్క సరైన ధ్రువపత్రాలు లేకపోవడం వంటివి చట్ట రీత్యా నేరం. కానీ ఇవన్నీ ఏ మాత్రం పట్టించుకోకుండా వియత్నాంలో ఏకంగా వాహనాన్ని నడుపుతూ స్నానం చేసే వీడియో, సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

బైకుపై వెల్తూ స్నానం చేసే వారిని ఎక్కడైనా చూసారా, అయితే ఇప్పుడే చూడండి

వియాత్నాంకి చెందిన 23 సంవత్సరాల హుయిన్ తన్ ఖాన్ మరియు మరొక వ్యక్తిని స్కూటర్ లో ప్రయాణిస్తూ స్నానం చేయడం మనం వీడియోలో చూడవచ్చు. వాహనంపై ప్రయాణించే ఇద్దరి వ్యక్తుల మధ్యలో ఒక నీటితో నింపిన బకెట్ ఉంది. వాహనంలో ప్రయాణిస్తూనే ముందు వున్న వ్యక్తి ఒక చేతితో డ్రైవ్ చేస్తూ ఇంకో చేత్తో మొహానికి తలకి సబ్బు రుద్దుకోవడం మనం గమనించవచ్చు.

బైకుపై వెల్తూ స్నానం చేసే వారిని ఎక్కడైనా చూసారా, అయితే ఇప్పుడే చూడండి

ఈ విధంగా స్నానం చేయడమే కాకుండా వారికి ఎటువంటి హెల్మెట్లు గాని, ఒంటిపై షర్టులు గాని ఏమి లేకుండా ఉండటం మనం గమనించవచ్చు. ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా చేయడం సోషల్ మీడియాలో కలకలం రేపడం వల్ల పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. పోలీసులు బుధవారం వారి మోటారుబైక్ యొక్క లైసెన్స్ ప్లేట్ ఉపయోగించి ఇద్దరు వ్యక్తులను గుర్తించగలిగారు.

బైకుపై వెల్తూ స్నానం చేసే వారిని ఎక్కడైనా చూసారా, అయితే ఇప్పుడే చూడండి

డ్రైవ్ చేసిన వ్యక్తిని హుయిన్ తన్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, క్రాష్ హెల్మెట్ ధరించకుండా మోటారుబైక్పై ప్రయాణించడం, సివిల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్స్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల అతనికి మరియు అతని సహచరియూనికి ఇద్దరికీ కలిపి VND 1.8 మిలియన్ జరిమానా విధించడం జరిగింది. అంటే దాదాపు ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 5,500.

బైకుపై వెల్తూ స్నానం చేసే వారిని ఎక్కడైనా చూసారా, అయితే ఇప్పుడే చూడండి

ఇప్పుడు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రభుత్వాలు కొన్ని కఠినమైన నిభందనలు ప్రవేశపెట్టినప్పటికీ పూర్తిగా నివారించలేకపోతోంది. ఎందుకంటే వినియోగదారుల యొక్క నిర్లక్యం వల్ల నిరంతరం భయానకమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల వాహనాదారులంతా నియమ నిబంధనలను కచ్చితంగా పాటించినట్లయితే చాల వరకు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు.

రోడ్డుపై ప్రయాణించే వాహనదారులందరు ఇటువంటి నిభందణలను పాటించినప్పుడే ప్రమాదాలను ఆపవచ్చు, లేకుంటే ఈ ప్రమాదాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Two Men Take A Bath During Bike Ride. Bizarre Video Prompts Police Action. Read in telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X