బైక్ తీసుకుని రోడ్డెక్కారా.. డ్రైవింగ్ సమయంలో ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే.!!

దేశంలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ ఘటనల్లో బాధితులు, మృతులు ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే ఉంటున్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో టూ వీలర్‌ రైడర్లు ట్రాఫిక్‌ నియమాలను సరిగ్గా పాటించడం ద్వారా 50 శాతం ప్రమాదాలు తగ్గించవచ్చని మీకు తెలుసా.. ఇంతకీ ఆ నియమాలేంటి.. పూర్తి సమాచారం ఈ కథనంలో..

మీకు టూ వీలర్‌ రైడింగ్‌లో అనుభవం ఉన్నా.. లేదంటే ఇప్పుడే కొత్తగా బైక్‌ నడపడం ప్రారంభిస్తున్నా.. ప్రతి ఒక్క వాహనదారుడు కొన్ని నియమాలను పాటించడం తప్పనిసరి.. దీని ద్వారా రహదారి భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లదు. మోటారు వాహన చట్టం ప్రకారం.. ద్విచక్ర వాహనదారులు రోడ్డు పైకి వెళ్లినప్పుడు కొన్ని సర్టిఫికెట్లు తీసుకెళ్లడం తప్పనిసరి.

Traffic-Rules-For-Two-Wheelers

1. డ్రైవింగ్ లైసెన్స్(Driving License): మీరు బైక్‌ లేదా స్కూటర్‌ను నడుపుతున్నప్పుడు RTO జారీ చేసిన డ్రైవింగ్‌ లైెసన్స్‌ను తప్పనిసరిగా మీ వద్ద ఉంచుకోవాలి. 50 సీసీ కంటే తక్కువ ఇంజిన్‌తో పనిచేసే గేర్‌లెస్‌ టూ వీలర్లకు 16 సంవత్సరాలు, 50 సీసీ కెపాసిటీ ఇంజిన్‌ కంటే ఎక్కువ గేర్‌ ఉన్న వాటికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే 18 సంవత్సరాలు అర్హతగా మోటారు వాహన శాఖ(MVD) చట్టంలో పేర్కొంది.

2. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌: టూ వీలర్‌ వాహనదారులు తమ వద్ద ఉంచుకోవాల్సిన మరో ముఖ్యమైన సర్టిఫికెట్‌ RC కార్డు. మీ ద్విచక్ర వాహనం మీ పేరుతో RTO లో చట్టబద్ధంగా నమోదు అయిందనే దానికి ఇది ప్రూఫ్‌. దీనిపై మీ బైక్‌ లేదా స్కూటర్‌ రిజిస్టర్డ్ నంబర్‌ ఉంటుంది. మీ టూ వీలర్‌ నంబర్ ప్లేట్‌పై ఉన్నదే దీనిపై ఉంటుంది. మీరు రైడింగ్‌లో ఉన్నప్పుడు ఆర్‌సీ తప్పనిసరి.

Traffic-Rules-For-Two-Wheelers

3. బీమా సర్టిఫికేట్: భారత్‌లో అన్ని రకాల వాహనాలకు థర్డ్‌ పార్టీ బీమా కవరేజీ తప్పనిసరి. మీ వాహనం దొంగతనానికి గురైనా లేదంటే.. ప్రమాదాల్లో డ్యామేజ్‌ అయినా.. మీపై ఆర్థికంగా భారం పడకుండా ఉండేందుకు సమగ్ర బీమాను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం వెహికల్‌ ఇన్సూరెన్స్‌ను క్రమం తప్పకుండా రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

4. PUC సర్టిఫికేట్: భారత్‌లో అన్ని రకాల మోటార్‌ వాహనాలకు PUC(Pollution Under Control) సర్టిఫికెట్‌ తప్పనిసరి. మీరు టూ వీలర్‌పై రోడ్డు మీద ప్రయాణించినప్పుడు తప్పనిసరిగా పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ను మీ వద్ద ఉంచుకోవాలి. ఈ ధ్రువీకరణ పత్రాన్ని కూడా మీరు గడువు ప్రకారం రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కాలుష్య ఉద్గార పరీక్షల అనంతరం సర్టిఫైడ్‌ సెంటర్ల నుంచి మీరు పీయూసీ సర్టిఫికెట్‌ను పొందవచ్చు.

Traffic-Rules-For-Two-Wheelers

5. హెల్మెట్‌: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన మరో రూల్‌ హెల్మెట్‌. రైడింగ్‌లో ఉన్నప్పుడు రైడర్‌తో పాటు పివిలియన్‌ రైడర్‌.. తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలి. యాక్సిడెంట్ల సమయంలో తలకు బలమైన గాయాలు కాకుండా హెల్మెట్‌ మిమ్మల్ని రక్షిస్తుంది. ఇందుకోసం మీరు ISI సర్టిఫైడ్‌ హెల్మెట్‌ను ధరించాలి. హెల్మెట్‌ ధరించకపోతే జరిమానా తప్పదని గుర్తుంచుకోవాలి.

వీటిని మీ వద్ద ఉంచుకోవడం ద్వారా.. ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. కాగా రోడ్డుపై సేఫ్‌ డ్రైవింగ్‌ కోసం వాహనదారులు కొన్ని జాగ్రత్తలను కూడా పాటిస్తే క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. రైడింగ్‌లో చేతులకు గ్లౌజెస్‌, ఫుల్‌ స్లీవ్‌ జాకెట్‌, దృఢమైన బూట్లు, రైడింగ్‌ ప్యాంట్‌ లేదంటే మోకాలికి గార్డ్‌ లాంటివి ధరించడం ద్వారా ప్రమాదాలకు గురైనా గాయాలు కాకుండా బయటపడవచ్చు.

Traffic-Rules-For-Two-Wheelers

ఇంకా రోడ్డుపై వెళ్తున్నప్పుడు టూ వీలర్లు(Traffic Rules For Two Wheelers).. ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించడం చాలా అవసరం. వీటి ద్వారా ప్రమాదాలు తగ్గడంతో పాటు ఇతర వాహనదారులకు నష్టం వాటిల్లదు. ముఖ్యంగా రైడర్లు స్పీడ్‌ లిమిట్‌ను పాటించాలి. మీరు వెళ్తున్న రోడ్డుపై నిర్దేశించిన వేగంతోనే ప్రయాణించాలి. అతి వేగం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి.

మరో ముఖ్యమైన విషయం మద్యం సేవించి రైడ్‌ చేయకూడదు. ర్యాష్‌ డ్రైవింగ్‌ కాకుండా యూ టర్న్‌, సిగ్నల్స్‌ ద్వారా మాత్రమే లేన్‌లను మార్చాలి. బైక్‌ లేదా స్కూటర్‌పై వెళ్తున్నప్పుడు ట్రిపుల్‌ రైడింగ్‌కు అనుమతి లేదు. ఇంకా పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు లాంటివి చేస్తే ట్రాఫిక్‌ పోలీసుల నుంచి జరిమానా బాదుడు తప్పదు.

Traffic-Rules-For-Two-Wheelers

ఇంకా ట్రాఫిక్‌ అధికారులు నిర్దేశించిన పార్కింగ్‌ ప్లేస్‌ల్లో మాత్రమే మీ వాహనాలను పార్క్‌ చేయాలి. రైడింగ్‌ చేసేటప్పుడు ఫోన్‌ ఉపయోగించకూడదు. రైడింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ మాట్లాడితే.. దృష్టి తప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీ ముందు వెళ్తున్న వాహనాల నుంచి నిర్దేశించిన దూరం పాటించాలి. దీని ద్వారా సడెన్‌ బ్రేక్‌ వేసినప్పుడు ఢీకొట్టకుండా కాపాడుకోవచ్చు.

రోడ్డుపై వెళ్తున్నప్పుడు కొందరు హడావుడిలో లేదంటే కావాలనే ట్రాఫిక్‌ రెడ్ సిగ్నల్స్‌ను జంప్‌ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను మీరకుండా రైడ్‌ చేయాలి. అంబులెన్స్‌ లాంటి అత్యవసర వాహనాలు వెళ్తున్నప్పుడు వాటికి దారి ఇవ్వాలని గుర్తుంచుకోండి. ముఖ్యంగా రోడ్డుపై రేసింగ్‌లకు అనుమతి లేదు. ఒకవేళ రేసింగ్‌ చేయాలనుకుంటే అందుకోసం రేసింగ్‌ ట్రాక్‌లను వినియోగిచుకోవాలి.

Traffic-Rules-For-Two-Wheelers

రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్‌ నియమాలను అతిక్రమిస్తే జరిమానా తప్పదని వాహనదారులు గుర్తుంచుకోవాలి. ట్రాఫిక్‌ ఉల్లంఘనలు సాధారణంగా రూ. 100 నుంచి రూ. 2500 వరకు ఉంటాయి. ఒక్కో ఉల్లంఘనకు ఒక్కో ఫైన్‌ విధిస్తారు. చెల్లుబాటు కాని డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉపయోగిస్తే రూ. 5000 వరకు జరిమానా లేదా 3 నెలలు జైలు శిక్ష.

ఓవర్‌ స్పీడ్‌లో వెళ్తే జరిమానాతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తారు. నిర్లక్ష్య డ్రైవింగ్‌కు తీవ్రతను బట్టి 6 నెలల జైలు శిక్ష, రోడ్డు ప్రమాదాల్లో మరణానికి కారణమైతే రెండేళ్లు జైలు శిక్ష, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తూ ప్రమాదాలకు కారణమైతే రూ. 10 వేల జరిమానాతో పాటు జైలు శిక్షను కోర్టు విధిస్తుంది.

దేశంలో రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని మోటారు వాహన శాఖ పైన చెప్పిన వాటిని అమలు చేస్తుంది. కాబట్టి వాహనదారులు రోడ్డుపై బాధ్యతాయుతంగా రైడ్‌ చేయడం చాలా ముఖ్యం. లేదంటే మీతో పాటు ఇతరులకూ హాని కలిగించిన వారవుతారు. సురక్షిత ప్రయాణం కోసం ప్రతి వాహనదారుడు ఈ నియమాలను పాటించాలి.

More from DriveSpark

Article Published On: Sunday, December 10, 2023, 8:01 [IST]
English summary
Two wheeler riders must and should follow these traffic rules in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+