అర్ధరాత్రి ఖరీదైన కారులో వచ్చి పూల కుండీలను దొంగిలించిన యువతులు.. సీసీటీవీ విజువల్స్‌ వైరల్‌.!!

సోషల్‌ మీడియా పుణ్యమా అని ఇటీవల చిత్రవిచిత్రమైన దొంగతనాల వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు కూడా తెగ వైరల్‌ అవుతున్నాయి. అయితే ఎక్కువగా దొంగతనాలు డబ్బు కోసమే జరుగుతాయి. కానీ ఇక్కడ విచిత్రంగా యువతులు ఖరీదైన కారులో వచ్చి పూల కుండీలు ఎత్తుకెళ్లారు.

సాధారణంగా దొంగతనాలను పరిశీలిస్తే.. చోరీలు ఎక్కువగా ఈజీ మనీ కోసమో.. లేదంటే జల్సాలు, ఇంకా ఎంజాయ్‌ చేయడం కోసం జరుగుతాయని మనకి తెలుసు. కానీ ఇక్కడ ఇద్దరు యవతులు విచిత్రంగా దొంగతనం చేస్తూ సీసీ నిఘా కెమెరాకు చిక్కారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Women-Steal-Flower-Pots

ఇటీవల ఖరీదైన హ్యుందాయ్‌ ఆరా(Hyundai Aura) కారులో వచ్చిన ఇద్దరు యువతులు విచిత్రమైన దొంగతనానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో ఓ ఇంటి బయట ఈ సంఘటన చోటుచేసుకుంది.

మొహాలీలోని ఓ ఇంటి ముందు హ్యుందాయ్‌ ఆరా కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఇద్దరు యువతులు దిగి ముందుగా నిశితంగా చుట్టుపక్కల పరిసరాలను గమనించారు. ఆ తర్వాత ఇంటి ఎదురుగా గోడపై ఉంచిన పూల కుండీలను మెల్లగా తీసుకున్నారు. అనంతరం కారు ఎక్కి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.

Women-Steal-Flower-Pots

నవంబర్‌ 11 న తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లుగా సీసీటీవీ విజువల్‌ ద్వారా తెలుస్తోంది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే.. ఆ ఇద్దరు యువతులు ఖరీదైన హ్యుందాయ్‌ ఆరా కారులో వచ్చి మరీ చోరీకి పాల్పడ్డారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ప్రాంతంలో గత వారం రోజుల నుంచి దాదాపు 10 చోరీ సంఘటనలు నమోదు అయినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్ల కామెంట్లు కూడా వైరల్‌గా మారాయి. ఖరీదైన కారులో వచ్చిన యువతులు పూల కుండీలు దొంగిలించడం ఏంటని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు అవి ఎంతో ఖరీదైన పూల కుండీలు కావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాల ఉద్దేశ్యమే మారిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Women-Steal-Flower-Pots

అంతేకాకుండా ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జీ 20 సమ్మిట్‌ జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ రోడ్లను పూల కుండీలతో అందంగా అలంకరించారు. సమావేశం అనంతరం రోడ్డు పక్కన అనేక పూల కుండీలు దొంగతనానికి గురైనట్లు నెట్టింట్లో వార్తలు వ్యాపించాయి.

మరోవైపు ఢిల్లీ-గురు‌గ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లోని అంబియన్స్ మాల్ వద్ద కూడా.. ఖరీదైన పూల కుండీలు వరుసగా దొంగతనానికి గురైనట్లు సమాచారం. ఎస్‌యూవీలో ఇద్దరు వ్యక్తులు పూల కుండీలను ఉంచుతున్న వీడియో నెట్టింట హల్‌చల్‌ చేసింది. ఈ ఘటనలో గురుగ్రామ్‌కి చెందిన 50 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Women-Steal-Flower-Pots

ఇక యువతులు చోరీ చేసేందుకు వచ్చిన హ్యుందాయ్ ఆరా కారు విషయానికొస్తే.. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్‌ గరిష్ఠంగా 83 hp మరియు 113.8 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్‌ ఆరా సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది 69 hp గరిష్ఠ శక్తిని, 95.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కొత్త ఫేస్‌లిఫ్టెడ్ ఆరా నాలుగు E, S, SX మరియు SX(O) వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 15, 2023, 19:23 [IST]
English summary
Two young women arrive in hyundai aura to steal flower pots video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+