భయంకర ప్రమాదం నుంచి చిటికెలో తపించుకున్న యువకులు [వీడియో]

భారతదేశంలోని రోడ్లపై సాధారణంగా ప్రతిరోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలను ఎన్నింటినో మనం ప్రత్యక్షంగా చూసి ఉంటాం. ఈ ప్రమాదాలలో గాయపడి వారు మాత్రమే కాకుండా ప్రాణాలను సైతం కోల్పోయిన వారు కోకొల్లలు. రోడువుపై వెళ్లేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే ఏ వైపు నుంచి ప్రమాదం మృత్యు రూపంలో కబళిస్తుందో ఎవరికీ తెలియదు.

భయంకర ప్రమాదం నుంచి చిటికెలో తపించుకున్న యువకులు [వీడియో]

సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం. కొన్ని సార్లు ప్రమాదాలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘించడం వల్ల మాత్రమే కాద్దు, వాహనంలో ఏర్పడే కొన్ని సాంకేతిక లోపల వల్ల కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనంలో ఏర్పడే సాంకేతిక లోపల వల్ల జరిగిన ప్రమాదాల గురించి మనం ఇదివరకటి కథనాలతో తెలుసుకున్నాం.

భయంకర ప్రమాదం నుంచి చిటికెలో తపించుకున్న యువకులు [వీడియో]

ఇప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఈ టీవీ ఆంధ్రప్రదేశ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోవడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అంతే కాకుండా ట్రక్కు కంట్రోల్ చేయడానికి వీలు లేకపోవడం వల్ల ట్రక్ రోడ్డుపై ఫుట్‌పాత్ వైపు రావడాన్ని చూడవచ్చు.

MOST READ:పెట్రోల్ బంక్‌లోనే బ్యాటరీ ఎక్స్చేంజ్ సెంటర్స్ ప్రారంభించనున్న హెచ్‌పి ; వివరాలు

భయంకర ప్రమాదం నుంచి చిటికెలో తపించుకున్న యువకులు [వీడియో]

ట్రక్ ఫుట్‌పాత్ వైపు రావడమే కాకుండా అక్కడ నిలిపి ఉంచిన బైక్ ని వేగంగా ఢీ కొట్టడం వల్ల, ఆ బైక్ ట్రక్ ఫుట్‌పాత్‌పై పడింది. ట్రక్ నియంత్రణ కోల్పోయినప్పుడు ఇద్దరు వ్యక్తులు బైక్ పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పై నిలబడ్డారు. తమ వైపు ట్రక్ రావడం గమనించి వారు అక్కడి నుంచి వేగంగా పరుగెత్తి ప్రాణాలను రక్షించుకోగలిగారు.

భయంకర ప్రమాదం నుంచి చిటికెలో తపించుకున్న యువకులు [వీడియో]

ఒక వేలా వారు అక్కడే ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో మీరు ఊహించవచ్చు. ట్రక్ బ్రేక్ అకస్మాత్తుగా పనిచేయకుండా పోవడం వల్ల, ట్రక్ డ్రైవర్ ట్రక్కుపై నియంత్రణ కోల్పోయాడు. ఈ కారణంగా ఇంత ప్రమాదం జరిగింది. కానీ అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

MOST READ:మీ ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలా? అయితే ఇలా చేయండి!

భయంకర ప్రమాదం నుంచి చిటికెలో తపించుకున్న యువకులు [వీడియో]

తమిళనాడులోని వయలూర్‌లో ఈ ప్రమాదం జరిగిందని నివేదికల ద్వారా మనకు తెలుస్తుంది. సాధారణంగా వాహనంలోని ప్రధానమైన భాగాలలో బ్రేకులు ఒకటి. బ్రేక్‌లు సరిగ్గా పనిచేయడంతో డ్రైవర్లు వేగంగా డ్రైవ్ చేస్తారు. ఒక వేళా ఈ బ్రేకులు పనిచేయకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.

భయంకర ప్రమాదం నుంచి చిటికెలో తపించుకున్న యువకులు [వీడియో]

వాహనాలలో బ్రేకులు లేకపోతే అత్యవసర సమయంలో వాహనాన్ని ఆపలేము. ఈ కారణంగా వాహనంతో బయలుదేరేముందు వాహనంలో బ్రేకులు సరిగ్గా ఉన్నాయా, లేదా అని టెస్ట్ చేసుకోవాలి. వాహనదారుడు వాహనం యొక్క బ్రేక్ మరియు బ్రేక్ ప్యాడ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం ముఖ్యం. అవి సరిగ్గా పనిచేయవు అని అనిపిస్తే ఆ స్థానంలో కొత్తవాటిని భర్తీ చేయడం మంచిది. ధర ఎక్కువగా ఉన్నప్పటికీ, నాణ్యమైన బ్రేక్‌లను ఉపయోగించడం చాలా అవసరం.

MOST READ:ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ధైర్యం కావాలి.. ఈ వీడియో చూడటానికి గుండె ధైర్యం కావాలి

కొత్త బ్రేక్‌లు మరియు బ్రేక్ ప్యాడ్‌లను వ్యవస్థాపించినప్పుడు, మరీ వేగంగా వెళ్ళకపోవడం చాలా మంచిది. కొన్ని సందర్భాలలో అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి వచ్చినప్పుడు ఇవి అంత పట్టును అందించకపోవచ్చు. బ్రేక్ పెడల్స్ అనవసరంగా చాలా గట్టిగా ఉండకూడదు. వాహనం యొక్క బ్రేక్‌లు సరిగా పనిచేయకపోతే, వాహనానికి మరియు వాహనంలోని వారికీ చాలా ప్రమాదం మరియు ప్రాణాంతకం..కూడా.

భయంకర ప్రమాదం నుంచి చిటికెలో తపించుకున్న యువకులు [వీడియో]

వాహనదారులు వాహనాలను అత్యంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, అప్పుడే అనుకోని ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంతే కాకుండా వాహనదారులు తప్పకుండా రూల్స్ పాటించాలి.

MOST READ:ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ భామ.. ఈ కార్ ధర ఎంతంటే ?

Image Courtesy: ETV Andhra Pradesh

Most Read Articles

English summary
Two Youngsters Escaped From Accident Viral Video. Read in Telugu.
Story first published: Wednesday, December 30, 2020, 10:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X