నంబర్‌ ప్లేట్స్‌పై ఉండే కలర్స్‌ మీనింగ్ ఏంటో తెలుసా..? రాష్ట్రపతి, గవర్నర్లకు ఆ నంబర్‌ ప్లేట్స్‌ ఎందుకు?

రోడ్డుపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు దర్శనమిస్తాయి. అందులో చాలా వరకు వివిధ కలర్ల నంబర్ ప్లేట్స్‌తో ఉంటాయి. ఇందులో చాలామందికి ఎక్కువగా వైట్ ప్లేట్‌ మరియు బ్లాక్‌ కలర్ ఫాంట్‌లో ఉన్న నంబర్‌ ప్లేట్స్‌ మాత్రమే కనిపించి ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా వేరే కలర్‌లో కూడా నంబర్‌ ప్లేట్స్‌ అప్పుడప్పుడు కనిపిస్తాయి.

మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ ప్రకారం వాహనాలకు పలు కలర్లలో నంబర్‌ ప్లేట్లను కేటాయిస్తారు. వీటిలో పసుపు, ఎరుపు, నీలి,ఆకుపచ్చ ఇలా మరెన్నో కలర్లలో నంబర్‌ ప్లేట్స్‌ ఉంటాయి. ఇలా ఎందుకు ఆ కలర్లను మాత్రమే కేటాయిస్తారు. అలా కేటాయించడానికి గల కారణాలను ఈ కథనంలో మీకు వివరించే ప్రయత్నం చేయనున్నాం.

Number-Plate

నంబర్‌ ప్లేట్‌: సాధారణంగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను సూచించే బోర్డు అల్యూమినియం తయారు చేయబడుతుంది. వాహనం ముందు మరియు వెనుక భాగంలో వీటిని అమర్చాలి. అందులోని అక్షరాలు మరియు నంబరింగ్ అనేది వాహనం గురించి నిర్దిష్ట సమాచారాన్ని సూచిస్తాయి. భారతదేశంలో RTO ద్వారా జారీ చేయబడిన ఎనిమిది రకాల నంబర్ ప్లేట్లు ఉన్నాయి.

White-Number-Plate

తెలుపు రంగు ప్లేట్: తెలుపు రంగు ప్లేటు మీద నలుపు రంగులో వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటే, దీని అర్థం వీటిని కేవలం వ్యక్తిగత అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని అర్థం. ఇలాంటి వెహికిల్స్‌ని ఎటువంటి ఇతర వ్యాపార మరియు అద్దెల కోస వినియోగించకూడదు. అలా చేస్తే ఫైన్ పడే అవకాశం ఉంటుంది.

Yellow-Number-Plate

ఎల్లో కలర్ నంబర్‌ ప్లేట్‌: పసుపు రంగు ఉన్న నంబర్ ప్లేటు మీద బ్లాక్‌ కలర్‌లో వాహన రిజిస్ట్రేన్ నంబర్ ఉంటుంది. ఇటువంటి వాహనాలను అద్దె మరియు వ్యాపార అవసరలాకు వినియోగిస్తున్నట్లు అర్థం. ఇందులో ట్యాక్సీలు, క్యాబ్‌లు మరియు ట్రక్కులు ఉంటాయి. ఇటువంటి వాహనాలకు డ్రైవింగ్ పర్మిట్ కూడా ఉండాల్సి ఉంటుంది.

రెడ్ కలర్ నంబర్ ప్లేట్‌పై భారత చిహ్నం: ఈ కలర్‌ కల్గిన నంబర్‌ ప్లేట్‌ను భారత రాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల గవర్నర్లకు రిజర్వ్ చేస్తారు. ఈ వాహనాలపై లైసెన్స్ నంబర్ స్థానంలో భారత చిహ్నం ఉంటుంది. అయితే భారత ప్రధాని కారు నంబర్ ప్లేట్ సామాన్యుడి కారులా తెల్లగా ఉంటుంది.

బ్లాక్‌ కలర్‌ నంబర్‌ ప్లేట్: నలుపు రంగు ప్లేటు మీద పసుపు రంగులో వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. ఇలాంటి వెహికిల్స్‌ని వ్యక్తిగత డ్రైవింగ్ కోసం వాడే అద్దె వాహనాలు అంటారు. ఇవి చాలా తక్కువ సంఖ్యలో దర్శనమిస్తాయి. వీటికి కమర్షియల్ యుటిలిటి వెహికల్ అనే పేరు కూడా ఉంది.

Blue-Number-Plate

బ్లూ కలర్ నంబర్ ప్లేట్: ఈ కలర్‌ కలిగిన నంబర్‌ ప్లేట్‌ను విదేశీ ప్రతినిధులు లేదా రాయబారులకు(అంబాసిడర్లు)కు ఉపయోగిస్తారు. ఈ ప్లేట్‌పై తెలుపు సిరాతో నంబర్ ఉంటుంది. ఈ నంబర్‌ ప్లేట్ల స్థానంలో భారతదేశంలోని రాష్ట్రాల కోడ్‌కి బదులుగా దౌత్యవేత్త దేశ కోడ్‌ను ఉపయోగిస్తారు. ఈ రకమైన ప్లేట్లను విదేశీ రాయబార కార్యాలయాలు లేదా దౌత్యవేత్తలకు మాత్రమే వర్తిస్తుంది.

Green-Number-Plate

గ్రీన్‌ కలర్‌ నంబర్‌ ప్లేట్: గ్రీన్‌ కలర్‌ నంబర్‌ ప్లేట్స్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలకు కేటయించారు. గ్రీన్‌ కలర్‌లో ఉన్న ప్లేట్‌పై తెలుపు రంగులో అంకెలు ఉంటాయి. ఇవి వ్యక్తిగత వాహనాల కిందకు వస్తాయి. గ్రీన్‌ కలర్‌పై ఎల్లో కలర్‌ ఉన్న నంబర్‌ ప్లేట్స్‌ కమర్షియల్ వెహికిల్స్‌కి కేటాయిస్తారు.

Military-Number-Plate

మిలటరీ నంబర్‌ ప్లేట్‌: సైనిక వాహనాల కోసం 11 అంకెలతో ప్రత్యేక నంబరింగ్ ఉంటుంది. న్యూఢిల్లీలోని రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నంబర్లు రిజిస్టర్ చేయబడతాయి. మొదటి,మూడవ అక్షరం బ్రాడ్ యారో (పైకి సూచించే బాణం) ఉంటుంది. బాణం తర్వాత వచ్చిన రెండు అంకెలు సైన్యం వాహనాన్ని కొనుగోలు చేసిన సంవత్సరాన్ని తెలియజేస్తాయి.

తాత్కాలిక నంబర్‌ ప్లేట్స్‌: గతంలో తాత్కాలిక నంబర్ ప్లేట్స్‌ ఉండేవి. ప్రస్తుతం వీటికి స్వస్తి పలికారు. అయితే కొన్ని ప్రీమియం బ్రాండ్స్‌పై తాత్కాలిక నంబర్లు వస్తున్నాయి. వీటికి కేవలం 30 రోజులు మాత్రమే కాలపరిమితి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో టెంపరరీ నంబర్ ప్లేట్స్‌ రెడ్‌ కలర్‌లో కూడా ఉంటాయి.

Red-Number-Plate

ఉదా.. TS30J7340 అనే నెంబర్‌ను ఒక వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌గా పరిగణిస్తే. ఇందులోని మొదటి రెండు అంగ్ల అక్షరాలు రాష్ట్రాన్ని సూచిస్తాయి. తరువాత ఉన్న అంకెలను జిల్లా కోడ్‌గా పరిగణిస్తారు. ఆ తరువాత ఉన్న జె అనే అక్షరం జిల్లాలోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో రిజిస్టర్డ్‌ అయిన సిరీస్‌/సంఖ్యను సూచిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 11, 2023, 9:22 [IST]
English summary
Typs number plates in india full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+