Tyre Care Tips వర్షాకాలంలో మీ కారు టైర్లు సేఫ్‌గా ఉండాలా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
మరికొద్ది రోజుల్లో వేసవి కాలం ముగిసి రుతు పవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తూ ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటివరకూ పొడిగా ఉన్న రోడ్లన్నీ వర్షాకాలం మొదలవగానే వర్షపు నీళ్లతో దర్శనమిస్తాయి. ఈ పరిస్థితుల్లోనే వాహనదారులు తమ వాహనాలను వర్షాకాలం కోసం సిద్ధం చేయాలి.
వర్షాకాలంలో వాహనాల టైర్లు ముఖ్యంగా కారు టైర్ల నిర్వహణ చాలా ముఖ్యం. మాన్‌సూన్‌లో రోడ్లు తడిగా ఉంటుంది కాబట్టి మీరు మీ వాహనం టైర్లను సరిగ్గా నిర్వహించకపోతే ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం మీకు ఈ కథనంలో మీ టైర్లను ఎలా మెయింటెయిన్ చేయాలి? వర్షాకాలంలో వచ్చే టైర్ల సమస్యలను ఎలా నివారించాలి అనే అంశాలు మీ కోసం.

తడి రోడ్లు ఘర్షణ లేని ఉపరితలంగా పని చేస్తాయి. అంతే కాకుండా రహదారిపై మీ వాహనం యొక్క పట్టును తగ్గిస్తాయి. రోడ్లు జారుడుగా ఉండటమే కాకుండా నీరు నిలిచిపోవడం వల్ల మీ కారు టైర్లు మరింత క్షీణించవచ్చు. వర్షాకాలంలో టైర్లు ఒత్తిడిని కోల్పోతాయి. రోడ్ల పరిస్థితి మరింత దిగజారడంతో టైర్లు ఒత్తిడికి గురవుతాయి. టైర్లు పంక్చర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
టైర్ థ్రెడింగ్ : వాహనదారులు ముఖ్యంగా టైర్ థ్రెడింగ్‌ను తనిఖీ చేసుకోవాలి. టైర్ గ్రిప్ దాని థ్రెడింగ్‌లో ఉంటుంది. టైర్ ఎక్కువగా నడిస్తే థ్రెడింగ్ అనేది అరిగిపోతుంది. 1.6mm కంటే తక్కువ టైర్ థ్రెడింగ్ ప్రమాదకరం. వర్షాకాలంలో జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ వాహనం టైర్ల థ్రెడింగ్ స్థాయిని తనిఖీ చేయండి. ఈ థ్రెడింగ్ వర్షాకాలంలో ప్రమాదాల నుంచి రక్షిస్తుంది.

టైర్ ప్రెజర్ : వర్షాకాలంలో టైర్‌లో గాలి పీడనం తగ్గే అవకాశాలు ఉన్నాయి. తక్కువ గాలితో ఉన్న టైర్‌ని ఉపయోగించడం వల్ల టైర్ పంక్చర్ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో, టైర్‌పై ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండకూడదు. ఒత్తిడి ఎక్కువైతే రోడ్డుపై టైర్‌కు పట్టు తగ్గుతుంది. అందువల్ల తడి రోడ్లపై కూడా మంచి పట్టు ఉండేలా సరైన డ్రైయర్ ప్రెజర్ నిర్వహించాలి.
రైనీ డ్రైవింగ్ : వర్షాకాలంలో ఏ సమయంలో బయటికి వెళ్లినా వర్షం పడే అవకాశం ఉన్నందున కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో అతివేగంతో వెళ్లకూడదు. వర్షంలో ప్రయాణించేటప్పుడు, పరిమిత వేగం అంటే 20 నుంచి 25 కిమీ వేగంతో మాత్రమే ప్రయాణించడం ఉత్తమం.

వర్షాకాలంలో వేగంగా వాహనాలు నడుపుతున్నప్పుడు రోడ్డుపై వర్షపునీటితో కూడిన గుంతలు ఉంటాయి. దీంతో కారు టైర్లు గుంతలో ఇరుక్కుపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో, మీరు వర్షంలో వేగంగా వెళితే, మీరు నియంత్రణ కోల్పోవచ్చు. అందుకే వర్షాకాలంలో నెమ్మదిగా ప్రయాణం చేయడం మంచిది.
టైర్ రొటేషన్: రుతుపవనాల తీవ్రతను బట్టి, సీజన్ ప్రారంభమయ్యే ముందు వాహనదారులు తమ పొడి టైర్‌లను తడి లేదా ఆల్-టెర్రైన్ టైర్‌లతో భర్తీ చేస్తారు. మీరు సంవత్సరానికి కనీసం రెండుసార్లు మీ టైర్లను మార్చవలసి ఉంటుంది. వర్షాకాలంలో మీరు ఎక్కడికి వెళ్లినా మీ వాహనంలో ఎల్లప్పుడూ స్పేర్ టైర్‌ని(స్టెఫ్నీని) తీసుకెళ్లండి. టైర్‌ను ఎలా మార్చాలో కూడా తెలుసుకోవాలి. స్పేర్ టైర్‌ను సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేసుకోవాలి.

మీ కారు నిర్వహణ సరిగా ఉంటేనే మీకు సుదీర్ఘ ప్రయాణంలో విసుగు లేని జర్నీని అందిస్తుంది. ఈ చిన్న టిప్స్‌ను పాటించదు ద్వారా మరమ్మతులకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. లేదంటే కారు షెడ్డులోనే ఉంచాల్సి వస్తుంది. ఈ చిట్కాలను పాటిస్తూ వర్షాకాలంలో సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి.


Click it and Unblock the Notifications








