రోడ్డుపై రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక మీ బైక్‌ టైర్లు డ్యామేజ్‌ అవ్వక తప్పదు!!

దేశంలో రోడ్లపై రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ అనేది సాధారణమైపోయింది. సీసీ కెమెరాల నిఘా ఉన్నా సరే కొందరు వాహనదారులు చుట్టూ తిరిగి వెళ్తే ఆలస్యమవుతుందని భావించి రాంగ్‌ సైడ్‌లో వెళ్తుంటారు. దీని ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇలా రాంగ్‌ రూట్లో డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడితే జరిమానా తప్పదు.

రోడ్డుపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల వాహనదారులు రోడ్డుకు కుడివైపున వచ్చే ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారు. ఎక్కువగా నగరాల్లోనే బైక్ రైడర్లు నిబంధనలను అతిక్రమిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీనిని నివారించడానికి, ముంబై నగర కార్పొరేషన్‌ ఓ అద్భుతమైన ఆలోచనతో ముందుకు వచ్చింది.

Tyre-Killer-Spikes

ముంబయి నగరంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ సమస్యను పరిష్కరించడానికి, BMC (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) నగరంలోని స్పీడ్ బ్రేకర్ల వద్ద టైర్ కిల్లర్ స్పైక్‌(Tyre Killer Spike)ను ఏర్పాటు చేసింది. అంటే వీటివల్ల రాంగ్ సైడ్‌లో వచ్చే వాహనాల టైర్లు డ్యామేజ్‌ అవుతాయి. స్థానికులు ముంబయి అధికారుల ఈ చర్యను స్వాగతించారు. అయితే మరికొందరు వారి భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా ఇటువంటి స్పైక్‌లు ఇప్పటికే విదేశాల్లో వాడుకలో ఉన్నాయి. అదే విధంగా, మన దేశంలో పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇలాంటి స్పైక్‌లను చూడవచ్చు. ఇప్పుడు ముంబయి BMC మలబార్ హిల్‌లోని BG ఖేర్ మార్గ్‌లో స్పైక్ స్పీడ్ బ్రేకర్‌లను ప్రవేశపెట్టారు. ఇలాంటి స్పైక్‌లు వాడడం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు. వాహనం పాడవుతుందన్న భయంతో రైడర్లు ఎదురుగా వెళ్లడం లేదని అధికారులు అభిప్రాయపడ్డారు.

Tyre-Killer-Spikes

BMC అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, బైకర్లు రాంగ్ లేన్‌లోకి ప్రవేశించడంపై నివాసితుల నుంచి అనేక ఫిర్యాదులను స్వీకరించిన తర్వాతే ఈ చర్యను తీసుకున్నట్లు తెలిపారు. అవసరమైతే అదే రహదారిపై ఇతర ప్రదేశాల్లో ఇలాంటి స్పైక్‌లను ఏర్పాటు చేయడానికి BMC చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

స్థానికులు ఈ చర్యను అభినందిస్తున్నప్పటికీ, పలువురు నిపుణులు విభేదిస్తున్నారు. ఈ స్రైక్‌ల ద్వారా ప్రమాదం జరిగే అవకాశముందని వాహనదారులు తీవ్రమైన గాయాలకు గురయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులు రాంగ్ రూట్‌లో వెళ్లకుండా వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించాలని అభిప్రాయపడుతున్నారు.

2018లో కూడా, పూణే ట్రాఫిక్ పోలీసులు రాంగ్‌ సైడ్‌ మార్గంలో వాహనాల రాకపోకలను నిరోధించడానికి అమనోరా టౌన్‌షిప్ అనే ప్రైవేట్ సొసైటీ సమీపంలో టైర్ కిల్లర్ స్పీడ్(Tyre Killer Spikes) బ్రేకర్లను ఏర్పాటు చేశారు. తరువాత, అవి చాలా ప్రమాదకరమైనవిగా భావించిన పోలీసులు వాటిని తొలగించాలని సూచించారు.

గతంలో నోయిడా పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని నగరం చుట్టూ హెవీ డ్యూటీ టైర్ కిల్లర్లను ఏర్పాటు చేశారు. వాహనదారులు రాంగ్ సైడ్ నుండి దానిపైకి వెళ్లకుండా ఉండేలా వారు టైర్ కిల్లర్‌ల పైన భారీ సంకేతాలను కూడా ఉంచారు. అయితే టైర్ కిల్లర్స్ మీదుగా భారీ వాహనాలు వెళ్లడం వల్ల కలిగే ఒత్తిడిని బోల్ట్‌లు తట్టుకోలేక పాడైపోయాయి. దీంతో ప్రస్తుతం నోయిడా నగరంలో టైర్ కిల్లర్లు లేవు.

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో భారీ ట్రాఫిక్ సాధారణం. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వాహనదారులు ముఖ్యంగా బైక్‌ రైడర్లు రాంగ్ సైడ్‌లో వెళ్తుంటారు. కాబట్టి టైర్‌ కిల్లర్‌ స్పైక్‌లను అమలు చేయడం ద్వారా ఖచ్చితంగా ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తారు. అయితే దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశమూ లేకపోలేదు.

More from DriveSpark

Article Published On: Monday, July 24, 2023, 9:30 [IST]
English summary
Tyre killer spikes installed on mumbai city roads to stop wrong side driving
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+