ఇండియన్ ఇస్రో దాటికి బెంబేలెత్తుతున్న అమెరికన్ రాకెట్ లాంచింగ్ సంస్థలు

By Anil

అమెరికా ప్రస్తుతం శాటిలైట్లను ఇస్రో ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది. అయితే ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన కొన్ని రాకెట్ లాంఛింగ్ సంస్థలు అమెరికా శాటిలైట్లను ఇండియన్ ఇస్రో ద్వారా ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.

అమెరికాకు చెందిన శాటిలైట్లను ఇస్రో ద్వారా ప్రయోగిస్తుండటంతో అమెరికాలోని రాకెట్ లాంఛింగ్ సంస్థలు అవకాశాలు కోల్పోతున్నాయి. ఈ తరుణంలో భష్యత్తులో వాటి పరిస్థితి మరింత దారుణమయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం అమెరికాలోని ప్రాంతీయ రాకెట్ లాంచింగ్ సంస్థలు అమెరికా ప్రభుత్వం మీద దీని గురించి తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తున్నాయి. మరిన్ని వివరాలు క్రింది కథనంలో...

అమెరికా శాటిలైట్లు

అమెరికా శాటిలైట్లు

గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాకు చెందిన నాలుగు శాటిలైట్లను ఇస్రో పిఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఇది విజయవంతమైన తరువాత ఇప్పుడు మరిన్ని అమెరికన్ శాటిలైట్లు ఇస్రో సేవలను వినియోగించుకోవడానికి వరుసలో ఉన్నాయి.

రష్యాతో పోటి

రష్యాతో పోటి

ప్రస్తుతం ఏరో స్పేస్ రంగంలో అమెరికా మరియు రష్యా దేశాలు మధ్య తీవ్ర పోటి కలదు. అయితే అమెరికా తమ ఏరో స్పేస్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్‌తో చేతులు కలిపింది. అయితే ఈ రెండు దేశాల పోటిని తట్టుకుని ఇండియా రాకెట్‌లను ఎంతో విజయవంతంగా ప్రయోగిస్తోంది.

రద్దు చేయమని కోరుతున్న అమెరికా సంస్థలు

రద్దు చేయమని కోరుతున్న అమెరికా సంస్థలు

అమెరికా శాటిలైట్లను ఇండియన్ ఇస్రో ద్వారా ప్రయోగిస్తే అమెరికాలోని రాకెట్ లాంచింగ్ సంస్థలకు తీవ్ర స్థాయిలో నష్ట వాటిల్లుతోందని మరియు అవకాశాలు కూడా కోల్పోతున్నామని అమెరికా సంస్థలు అమెరికా ప్రభుత్వం మీద ఈ ఒప్పందాన్న రద్దు చేయాలని తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తున్నాయి.

 వినతుల స్వీకరణ

వినతుల స్వీకరణ

అమెరికా రాకెట్ లాంచింగ్ సంస్థల విన్నిపాన్ని అమెరికా స్పేస్ కమీషన్ స్వీకరిస్తోంది, మరియు వారి రివ్యూలను కూడా పరిశీలిస్తోంది. మరియు దీనికి అధనంగా కమర్షియల్ స్పేస్ రవాణా సలహాదారుల కమిటీ దీని గురించి స్పందిస్తూ, ప్రాంతీయ రాకెట్ లాంచింగ్ సంస్థల ద్వారా నష్టపోతున్న తీరును గురించి ప్రశ్నించారు.

అమెరికా పద్దతి

అమెరికా పద్దతి

అమెరికాలోని శాటిలైట్లను ఇతర దేశాల రాకెట్‌ల ద్వారా కక్ష్యలోకి ప్రయోగించడాని అమెరికాలో దీనికి సంభందించి చట్టపరమైన ఆక్షేపణలు ఉన్నాయి. వాటన్నింటికి న్యాయం చేస్తున్న పక్షంలో అమెరికా సంస్థలు వారి శాటిలైట్లను అమెరికాలోని రాకెట్ లాంచింగ్ సంస్థల ద్వారా కాకుండా ఇతర దేశాల రాకెట్‌లతో ప్రయోగించవచ్చు.

కారణం ఏమిటి ?

కారణం ఏమిటి ?

ప్రస్తుతం ఇస్రో అమెరికాకు చెందిన శాటిలైట్లను తక్కువ స్థాయిలో మాత్రమే ప్రయోగించడానికి అనుమతిస్తోంది. అమెరికాలోని రాకెట్ లాంచింగ్ సంస్థలు శాటిలైట్లను ప్రయోగించడానికి పట్టే సరైన సమయాన్ని వెల్లడించలేకపోతున్నాయి ఈ తరుణంలో ఎక్కువగా అమెరికా శాటిలైట్ సంస్థలు ఇండియన్ ఇస్రో వైపు మళ్లుతున్నారు.

ప్రారంభ రుసుము

ప్రారంభ రుసుము

అమెరికాలోని దేశీయ రాకెట్ లాంచింగ్ సంస్థలు అమెరికా ప్రభుత్వం మీద ఈ పద్దతిని రద్దు చేయాలని ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఇండియన్ రాకెట్ లాంచింగ్ సంస్థ ఇస్రో అమెరికా వారి శాటిలైట్లను ప్రయోగించడానికి ప్రాథమిక రుసుమును తీసుకుంటోంది. ఈ దెబ్బతో మరిన్ని అమెరికా శాటిలైట్ సంస్థలు ఇండియన్ ఇస్రో సేవలు వినియోగించుకుంటాయి.

చిన్న రాకెట్లు

చిన్న రాకెట్లు

అమెరికాలోని రాకెట్ లాంచింగ్ సంస్థలు ప్రస్తుతం చిన్న చిన్న రాకెట్లను మాత్రమే ప్రయోగిస్తోంది. అందుకోసం అమెరికా శాటిలైట్ సంస్థలు అన్ని రకాల సైజులో ఉన్న రాకెట్లను ప్రయోగించగల సామర్థ్యం గల ఇస్రోను ఆశ్రయిస్తున్నాయి.

ఆర్డర్లను స్వీకరిస్తున్న ఇస్రో

ఆర్డర్లను స్వీకరిస్తున్న ఇస్రో

అమెరికాలోని రాకెట్ లాంచింగ్ సంస్థలు అమెరికా వారి చిన్న చిన్న శాటిలైట్లను ప్రయోగించడానికి చాలా బయపడుతున్నాయి, దీని వెనుక చాలానే కారణాలు ఉన్నాయి. అయితే ఈ తరుణంలో అమెరికా శాటిలైట్లను ప్రయోగించడానికి ఇస్రో ఆర్డర్లను కూడా స్వీకరిస్తోంది.

పిఎస్‌ఎల్‌వీ (PSLV) ప్రత్యేకతలు

పిఎస్‌ఎల్‌వీ (PSLV) ప్రత్యేకతలు

1990లో కేరళ రాజధాని తిరువంతనపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో దీనిని ప్రారంభించారు. ఈ రాకెట్‌లోని రెండు మరియు నాలుగవ స్థాయిలో ద్రవ రూప ఇంధన విభాగాన్ని తిరునేల్‌వేలిలోని ప్రొపెల్లర్ రీసెర్చ్ సెంటర్ వారు అభివృద్ది చేశారు అధే విధంగా ఘణ రూపం ఇంధన టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్‌లో అభివృద్ది చేశారు.

మోసుకేళ్లే బరువుల సామర్థ్యం

మోసుకేళ్లే బరువుల సామర్థ్యం

భారీ స్థాయిలో బరువులను మోసుకెళ్లే పిఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను‌ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు అసూయపడే విధంగా అభివృద్ది చేశారు. అంతేకాకుండా ఒకేసారి ఇది చాలా రకాల శాటిలైట్లను తీసుకెళ్లగలదు.

ఖచ్చితత్వం

ఖచ్చితత్వం

ఇస్రో ప్రయోగించే శాటిలైట్లు అన్ని కూడా చాలా వరకు విశ్వనీయంగా ఖచ్చితంగా కక్ష్యలోకి ప్రయోగించబడుతున్నాయి. ఇలా ప్రయోగించిన శాటిలైట్లను ఎక్కువగా మోసుకెళ్లింది పిఎస్‌ఎల్‌వీ రాకెట్.

స్పేస్ చరిత్రలో రికార్డ్

స్పేస్ చరిత్రలో రికార్డ్

ఇస్రో త్వరలో పిఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ఉపయోగించుకున్న అంతరిక్షంలో ఒకే సారి 22 శాటిలైట్లను ప్రయోగించనుంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇస్రో మీద దృష్టి సారిస్తున్నాయి. అంతరిక్ష చరిత్రలో ఇది ఒక పెద్ద రికార్డు.

రూపం

రూపం

పిఎస్‌ఎల్‌వీ రాకెట్ 44 మీటర్లు పొడవు, 2.8 మీటర్లు చుట్టు కొలతతో ఉంది. ఇది దాదాపుగా 1425 కిలోల నుండి 3250 కిలోల వరకు బరువును మోయగలదు (ప్రయాణించే దూరాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంది).

ఇంజన్

ఇంజన్

ఇందులో మొదటి స్టేజ్‌లో ఘణ రూప ఇంధనాన్ని వినియోగించుకునే ఇంజన్, మొదటి స్టేజ్‌లో 138 టన్నుల ఇంధన సామర్థ్యం కలదు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రాకెట్ ఇంజన్. రెండవ స్టేజ్‌లో వికాస్ 1, మూడవ స్టేజ్‌లో హెచ్‌పిఎస్ 3 మరియు నాలుగవ స్టేజ్‌లో ఎల్-2-5 ఇంజన్‌ కలదు.

ఇంధన వినియోగించుకునే సమయం

ఇంధన వినియోగించుకునే సమయం

మొదటి స్టేజ్‌లోని ఇంధనం 105 సెంకడ్లలో, రెండవ స్టేజ్‌లోని ఇంజన్ ఇంధనాన్ని 158 సెంకండ్లలో, మూడవ స్టేజ్‌లోని ఇంజన్ ఇంధనాన్ని 83 సెంకండ్ల వ్యవధిలో మరియు నాలుగవ స్టేజ్‌లోని ఇంజన్ ఇంధనాన్ని 425 సెకండ్లలో దహించువేస్తాయి.

ప్రయోగ ఖర్చులు

ప్రయోగ ఖర్చులు

ఒక్క పిఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ప్రయోగించడానికి 90 కోట్ల రుపాయలు ఖర్చవుతాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇది ఎంతో తక్కువ. ప్రపంచ వ్యాప్తంగా పిఎస్‌ఎల్‌వి విజయవంతం అవడానికి కారణం ఇదే మరి.

విదేశీ శాటిలైట్లు

విదేశీ శాటిలైట్లు

ప్రస్తుతం పిఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా అమెరికా, కెనడా, సింగపూర్, ఇండోనేషియా, ఇండియా మరియు 19 ఇతర దేశాలు ఈ పిఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను వినియోగించుకుంటున్నారు. కారణం తక్కువ ధర, సరైన సమయంలో మరియు ఎంతో ఖచ్చితత్వమైనది.

సంపాదనలు

సంపాదనలు

19 దేశాలకు చెందిన దాదాపుగా 45 శాటిలైట్లను ప్రయోగంచడం ద్వారా 637,35 కోట్లు రుపాయలు సంపాదించినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జిత్తేందర్ ప్రసాద్ గత ఏడాది లోక్‌ సభలో తెలిపాడు.

ఎక్కువ మంది చదివిన ఆసక్తికరమైన కథనాలు మీ కోసం....

అమెరికాను అడుక్కోవాల్సిన పని లేదు....స్వదేశీ పరిజ్ఞానంతో రానున్న భారతదేశపు న్యావిగేషన్ సిస్టమ్

ఎక్కువ మంది చదివిన ఆసక్తికరమైన కథనాలు మీ కోసం....

అగ్ని మిస్సైల్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు...

మూత్రం నుండి కాఫీ : ఏడాది తరువాత అంతరిక్షం నుండి వచ్చిన వారి అనుభవాలు

Most Read Articles

English summary
Us Launch Companies Lobby Maintain Ban On Use Indian Rocket
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X