ఉబర్‌ ఆటో చార్జ్‌ రూ.7.66 ​కోట్లు.. బిల్ చూసి బిత్తరపోయిన వ్యక్తి - ఎక్కడో తెలుసా?

ఇటీవల సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన వార్తల్లో ఒకటి.. చిన్న దూరానికి రూ. 7.66 కోట్లు చూపించిన ఉబర్ బిల్. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది. చివరికి ఏమైంది.. అంత బిల్ చెల్లించడా? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఎక్కడికి వెళ్లాలన్నా.. ఉబర్ లేదా ఓలా, ర్యాఫిడో ఇలా ఎన్నెన్నో బుక్ చేసుకుని, చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకుంటున్నాం. ఒక వేళా మీరు ఉబర్ లేదా ఓలా క్యాబ్ / ఆటోలో ప్రయాణించేటప్పుడు రూ. 50 లేదా రూ. 60 చార్జికి కోట్లలో బిల్ చూపిస్తే తప్పకుండా షాకవుతారు. ఇలాంటి ఘటనే ఇటీవల నోయిడాలో వెలుగులోకి వచ్చింది.

Uber Auto Charge Rs 7 66 Crore Noida Man

62 రూపాయలకు రూ. 7.66 కోట్ల బిల్

నివేదికల ప్రకారం నోయిడాలో ఒక వ్యక్తి ఉబర్ ఆటోలో ప్రయాణించాడు. అయితే అతనికి వచ్చిన బిల్ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. నిజానికి అతని ప్రయాణానికి అతడు చెల్లించాల్సిన బిల్ కేవలం 62 రూపాయలు మాత్రమే. కానీ అతనికి చూపించిన బిల్ మాత్రం ఏకంగా 7.66 కోట్లు. ఇది చూసి ఒక్కసారిగా ఆ వ్యక్తి ఖంగుతిన్నాడు. మళ్ళీ తేరుకున్నాడు.

ఉబర్ ఆటో బిల్ రూ. 7.66 కోట్లు రావడంతో ఆశ్చర్యపోయిన వ్యక్తి దాన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇది పోస్ట్ చేస్తూ.. ఉబర్ ఇండియా చాలా గొప్పగా చేసింది అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపైనా పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. అతనికి వెయిటింగ్ ఛార్జ్ కింద రూ. 59909189 బిల్ వచ్చింది. ఇక టోల్ ఫీజు వంటివి జీరో వద్ద ఉన్నాయి. అంతే కాకుండా అతని అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్‌లో కూడా జీరో ఉండటం ఒకరకంగా మంచిదే అయింది. లేకుంటే బహుశా ఆ మొత్తం కట్ అయిపోయి ఉండొచ్చని కొందరు భావించారు.

ఇదే మొదటిసారి కాదు..

చివరకు ఆ వ్యక్తి రూ.62 చెల్లించడా? లేక ఇంకా ఎక్కువ ఏమైనా చెల్లించడా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఆ వ్యక్తి 62 రూపాయలు మాత్రమే చెల్లించి ఉంటాడని భావిస్తున్నాము. చిన్న దూరాలకు ఇంత పెద్ద మొత్తంలో బిల్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇంత పెద్ద మొత్తంలో బిల్ ఇప్పటి వరకు ఏ కస్టమర్‌కు వచ్చి ఉండదని తెలుస్తోంది.

రూ. 7.66 కోట్లు బిల్ రావడం మీద ఉబర్ ఇండియా ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇది బహుశా టెక్నీకల్ ఇష్యూ అయి ఉంటుందని తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో బిల్ రావడం కస్టమర్లను షాక్‌కు గురి చేస్తుంది. కానీ ఎవరి దగ్గర ఈ భారీ మొత్తాన్ని స్వీకరించలేదు. అయితే ఇలాంటి టెక్నీకల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా ఉండటం ప్రధానం. కాబట్టి ఇలాంటి సంఘటన ఎవరికైనా ఎదురైతే భయపడకూడదు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 2, 2024, 16:42 [IST]
English summary
Uber auto charge rs 7 66 crore noida man shocked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+