Cab driver roasts passenger క్యాబ్‌లో ఆ పనులు నిషిద్ధం.. ప్రయాణికుడిని టీజ్ చేసిన క్యాబ్ డ్రైవర్!
మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ సమస్య ప్రతినిత్యం ప్రయాణికులకు ఓ సవాల్ లాంటిది. ఇక బస్సుల్లో వెళితే దానిని అధిగమించి గమ్యస్థానానికి చేరుకునేసరికి.. అలసటతో పాటు ఆలస్యం కూడా అవుతుంది. అందుకే చాలా మంది ఆ రిస్క్ తీసుకోకుండా క్యాబ్‌లకు ప్రాధాన్యమిస్తున్నారు. సిటీల్లో క్యాబ్‌లకు డిమాండ్ ఎక్కువ. ఇదిలా ఉండగా తాజాగా ఓ క్యాబ్ డ్రైవర్ చేసిన పని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం తన క్యాబ్‌లో అతికించిన స్టిక్కర్. అదేంటంటే.
క్యాబ్ డ్రైవర్లు సాధారణంగా వారి క్యాబ్‌లలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులకు కొన్ని జాగ్రత్తలు పాటించమని చెబుతారు. వారు చెప్పినట్లు పాటిస్తే ఈ రిస్క్ లేకుండా సులభంగా గమ్య స్థానానికి చేరుకోవచ్చని వారి అభిప్రాయం. ఉదాహరణకు సీటు బెల్ట్ ధరించడం. మీరు క్యాబ్‌లో ప్రయాణించేటప్పుడు, డ్రైవర్ ఎల్లప్పుడూ మీ సీట్‌బెల్ట్ ధరించమని అడుగుతారు. ఇది మీకు కూడా సురక్షితం.

అయితే తాజాగా ఉబర్ కంపెనీకి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ తన కారుపై ఓ స్టిక్కర్ అంటించిన వీడియో వైరల్‌గా మారింది. కారులో ఉన్న ఓ ప్రయాణికుడు ఆ స్టిక్కర్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని పలువురు సరదాగా తమ వాళ్లతో పంచుకుంటున్నారు.
ఈ వీడియో ఈ స్టిక్కర్ వల్లనే కాదు. వీడియో తీసిన ప్రయాణికుడు, క్యాబ్ డ్రైవర్ సంభాషణ కూడా వైరల్ అయ్యింది. ఈ సంభాషణతో ప్రయాణికుడి మనోభావాలు దెబ్బతిన్నాయి అనడంలో కూడా సందేహం లేదు. అసలు ఆ కారులో ఏ నోటిఫికేషన్ స్టిక్కర్‌ను ఉందంటే.. 'ఈ క్యాబ్‌లో శృంగారానికి అనుమతి లేదు' అని పేర్కొన్నారు. అదేంటంటే.. ప్రేమికులు ఈ కారులో ఎక్కితే రొమాన్స్ చేయకూడదని రాసుకున్నారు. దీన్ని చూస్తే వింతగా అనిపిస్తుంది కదా..
ఈ స్టిక్కర్‌ను చూశాక.. సదరు డ్రైవర్‌కు గతంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో అనే సందేహం రాక మానదు. అంతే కాకుండా.. ఈ స్టిక్కర్‌ను వీడియో తీసిన వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడిన సంభాషణ వైరల్‌గా మారింది. వీడియో తీస్తుండగా, 'అదృష్టవశాత్తూ నేను నా గర్ల్‌ఫ్రెండ్‌తో ఈ క్యాబ్‌లో లేను'. అన్నారు. ఇది విన్న క్యాబ్ డ్రైవర్ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ''మీకు గర్ల్‌ఫ్రెండ్ ఉందా?' అని అడిగారు.
ఈ వీడియోను సదరు వ్యక్తి 'ద గై విత్ వైట్ బియర్డ్' ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు ఈ వీడియోను షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా రొమాంటిక్ జంటలు క్యాబ్‌లకు వెళ్లడంతో క్యాబ్స్ మరింత ప్రాచుర్యం పొందుతున్నాయి. కానీ వారు క్యాబ్‌ను పబ్లిక్ ప్లేస్‌గా చూడరు. క్యాబ్‌లో అలా వ్యవహరించడం చట్టరీత్యా నేరమే కాకుండా వారి భద్రతకు ముప్పు అని కూడా గమనించాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








