క్యాబ్‌ డ్రైవర్‌ టూ లగ్జరీ కార్ల ఓనర్.. ఈ యువ పారిశ్రామికవేత్త లగ్జరీ కార్‌ కలెక్షన్‌ చూశారా?

యువ పారిశ్రామికవేత్త గురించిన వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే ఆ వ్యక్తి ఒకనాడు ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్ కావడం విశేషం. ప్రస్తుతం అనేక రకాల కార్లను వినియోగిస్తోంది. ఈ యువ వ్యాపారవేత్త పేరు సాహిత్‌ అన్వర్‌. ప్రస్తుతం ఇతని వయస్సు 29 సంవత్సరాలుగా ఉంది.

సుమారు 7 ఏళ్ల క్రితం సౌదీ అరేబియా నుంచి అమెరికా వెళ్లాడు. ఆ సమయంలో సాహిత్‌ అన్వర్‌ వద్ద కేవలం 5 వేల డాలర్లు మాత్రమే ఉన్నాయి. అమెరికాలో తొలుత న్యూయార్క్‌ నగరానికి వెళ్లాడు. అనంతరం అక్కడ నుంచి కాలిఫోర్నియాకు వెళ్లాడు. అలా వర్జీనియాకు వెళ్లి.. తొలుత ఉబర్‌లో టాక్సీ డ్రైవర్‌గా పనిచేశాడు. అలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు.

uber driver to businessman and buys many luxury cars

బెంట్లీ కాంటినెంటర్‌ GT : ప్రస్తుతం ఈ యువ పారిశ్రామిక వేత్త సాహిత్‌ అన్వర్‌ అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. అందులో బెంట్లీ కాంటినెంటల్‌ GT లగ్జరీ కారు ఒకటి. ఈ కారు ధర రూ.3 కోట్లుగా ఉంది. ఇది 4.0 లీటర్‌ ట్విన్‌ టర్భోఛార్జడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ గరిష్ఠంగా 542 bhp శక్తి, 770 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర రూ.1.9 కోట్లు విలువైన కారు : దీంతోపాటు మరో లగ్జరీ కారును కూడా కలిగి ఉన్నారు. ఆస్టన్‌ మార్టిన్‌ వాంటేజ్‌ రోడ్‌స్టర్‌. ఈ కారు ధర రూ.1.9 కోట్లుగా (ఎక్స్‌షోరూం) ఉంది. ఇందులో 4.0 లీటర్‌ ట్విన్‌ టర్భోఛార్జడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది గరిష్ఠంగా 502 bhp శక్తిని మరియు 675Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

uber driver to businessman and buys luxury cars

మరిన్ని లగ్జరీ కార్ల కోసం ఆర్డర్ : దీంతోపాటు Mercedes Bens G63 AMG ఈ కారు ధర రూ.3 కోట్లుగా ఉంది. ఈ తరహా అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లతో సహా ఫెరారీ, McLaren కార్లను ఆర్డర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అత్యంత పిన్న వయస్సులోనే సాహిత్‌ పారిశ్రామిక వేత్తగా ఎదిగాడు. అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు.

క్యాబ్‌ డ్రైవర్‌ టూ లగ్జరీ కార్లకు ఓనర్‌ : కెరీర్ ప్రారంభంలో ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేసిన సాహిత్‌ అన్వర్‌.. అనేక ప్రయత్నాలు చేశారు. కరోనా కారణంగా కొన్ని అవస్థలు పడ్డారు. అయితే వాటిని అన్నింటిని సమర్థవంతంగా నిర్వహించి, యువ వ్యాపారవేత్తగా ఎదిగారు. అనేక లగ్జరీ కార్లకు యాజమానిగా మారారు.

uber driver to businessman and buys many luxury cars

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, December 18, 2023, 14:20 [IST]
English summary
Uber cab driver turned into businessman and owns many luxury cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+