52 కి.మీ దూరానికి ఉబర్ క్యాబ్ ధర రూ.4,000.. ఈ ఛార్జీతో విమాన ప్రయాణం చేయొచ్చుగా..!!
బస్సులు, ఆటోలు కంటే క్యాబ్ ప్రయాణానికి కొంచెం అధికంగా చెల్లించేందుకు మనం సిద్ధమవుతాం. అయితే డబుల్ ఛార్జీలు చెల్లించే పరిస్థితి కూడా కొన్నిసార్లు ఉంటుంది. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఉబర్ ఛార్జీ ధర చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనపై అధికారులు చర్యలు ప్రారంభించారు.
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్ సిటికీ వెళ్లేందుకు ఉబర్ యాప్ ప్రదర్శించిన ఛార్జీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కర్ణాటక రోడ్డు రవాణా మరియు భద్రత కమిషనర్ స్పందించారు. ఉబర్ సంస్థకు నోటీసులు జారీచేయాలని ప్రాంతీయ రవాణా అధికారి (RTO) ఆదేశాలు జారీచేశారు.

బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టు నుంచి ఎలక్ట్రానిక్ సీటికి వెళ్లేందుకు ఓ వ్యక్తి క్యాబ్ కోసం ప్రయత్నం చేశాడు. అయితే క్యాబ్ ధర చూసి షాక్ గురయ్యానంటూ ట్వీట్ చేశాడు. ధర సుమారుగా విమాన టికెట్‌కు చెల్లించినంత ఉందని ట్వీట్ చేశాడు.
ట్విట్టర్ వినియోగదారుడి స్క్రీన్‌షాట్ ప్రకారం బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి ఎలక్ట్రానికి సిటీ మధ్య సుమారు 52 కి.మీ దూరానికి ఉబర్ ప్రీమియం రూ.2,584.59 మరియు ఉబర్ ఎక్స్‌ఎల్ రూ.4,051.15 ఉంది. ఉబర్ క్యాబ్ ధర విమాన టికెట్‌కు చెల్లించినంత ఉందంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
ఉబర్ క్యాబ్ అధిక ధరలపై గతంలో అనేక వార్తలు వచ్చాయి. కేవలం 2 కి.మీ దూరానికి రూ.150 వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించింది. తొలి 4 కి.మీల దూరానికి చిన్న క్యాబ్‌లకు రూ.75 మరియు పెద్ద లగ్జరీ క్యాబ్‌లకు 150 రూపాయలు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని గతంలో హెచ్చరించింది.
2022లో రవాణా శాఖ ఓలా, ఉబర్, రాపిడో ఆటో సేవలపై నిషేధం విధించింది. దీంతో ప్రభుత్వం, ఆగ్రిగేటర్ సంస్థ మధ్య న్యాయ పోరాటం నడుస్తోంది. అయితే రవాణా శాఖ విధించిన నిషేధంపై కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సర్వీసుల నడపాలనే నిబంధన విధించింది. అయితే ఆటోలు అధిక ధరలు వసూలు చేస్తున్నాయని అనేక మంది ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్యం చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.
ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేయడానికి గల కారణాలను నోటీసుల్లో పేర్కొన్నాలని అధికారులు భావిస్తున్నారు. ఉబర్ నుంచి వచ్చే స్పందనను బట్టి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే దీనిపై స్పందించేందుకు ఉబర్‌కు కొంత సమయం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








