బ్రేకింగ్ న్యూస్.. ఉబర్‌తో కలిసిపోయిన ఫ్లిప్‌కార్ట్, ఎందుకో తెలుసా.. !

భారతదేశంలో కోవిడ్ -19 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున, దీనిని నివారించడానికి భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ కారణంగా వాహన సేవలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు సూచించారు.

బ్రేకింగ్ న్యూస్.. ఉబర్‌తో కలిసిపోయిన ఫ్లిప్‌కార్ట్, ఎందుకో తెలుసా.. !

భారతదేశంలో లాక్ డౌన్ విధించడం వల్ల క్యాబ్ సేవా సంస్థ ఉబర్‌ మరియు ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వృద్ధులకు మరియు ఇంటి నుండి బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో అవసరమైన సామాగ్రి లేకపోవటం గురించి ఆందోళన చెందుతున్న వారికి సహాయం చేయడానికి ముందడుగు వేసాయి. లాక్ డౌన్ సమయంలో ప్రజల అవసరాలను తీర్చడానికి రెండు సంస్థలు భాగస్వామ్యమయ్యాయి.

బ్రేకింగ్ న్యూస్.. ఉబర్‌తో కలిసిపోయిన ఫ్లిప్‌కార్ట్, ఎందుకో తెలుసా.. !

ఈ కంపెనీలు అవసరమైన వస్తువులను బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలోని వినియోగదారులకు పంపిణీ చేస్తాయి. దీని ప్రకారం ఉబర్‌ ప్రజల ఇళ్లకు అవసరమైన వస్తువులను సరఫరా చేస్తుంది. దీని కోసం వినియోగదారులకు ఎటువంటి అదనపు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు.

బ్రేకింగ్ న్యూస్.. ఉబర్‌తో కలిసిపోయిన ఫ్లిప్‌కార్ట్, ఎందుకో తెలుసా.. !

లాక్ డౌన్ వల్ల డెలివరీ సిబ్బంది కొరత కారణంగా, ప్రజలు కిరాణా, పండ్లు, కూరగాయలు, పాలు వంటి అవసరమైన వస్తువులను సరఫరా చేయలేకపోతున్నారు. ఉబర్‌ మరియు ఫ్లిప్‌కార్ట్ వస్తువులను డోర్ డెలివరీ చేయడానికి సిద్దమైనది.

బ్రేకింగ్ న్యూస్.. ఉబర్‌తో కలిసిపోయిన ఫ్లిప్‌కార్ట్, ఎందుకో తెలుసా.. !

వస్తువులను సరఫరా చేయడం మాత్రమే కాకుండా అదనంగా, సిబ్బందికి గ్లౌజులు, మాస్కులు మరియు శానిటైజర్లు అందించబడతాయి. లాక్ డౌన్ వంటి కష్ట సమయాల్లో తమ వినియోగదారులకు సహాయం చేయడానికి కంపెనీ కట్టుబడి ఉందని ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.

బ్రేకింగ్ న్యూస్.. ఉబర్‌తో కలిసిపోయిన ఫ్లిప్‌కార్ట్, ఎందుకో తెలుసా.. !

సంస్థ తన వినియోగదారులందరికీ అవసరమైన వస్తువులతో సేవ చేయడానికి అన్ని ఎంపికలను సేకరిస్తోంది. ఇప్పటికే సంస్థ అన్ని అవసరమైన వస్తువుల పంపిణీని చేయడం ప్రారంభించింది. అంతే కాకుండా ఈ సేవలకు వినియోగదారుల నుండి అదనపు రుసుము వసూలు చేయదని కూడా స్పష్టం చేసింది.

బ్రేకింగ్ న్యూస్.. ఉబర్‌తో కలిసిపోయిన ఫ్లిప్‌కార్ట్, ఎందుకో తెలుసా.. !

భారతదేశంలో లాక్ డౌన్ వల్ల చాలా క్లిష్టమైన సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సమయంలో ఉబర్ మరియు ఫ్లిప్‌కార్ట్ రెండూ భాగస్వామ్యం అవ్వడం వల్ల చాల వరకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఏది ఏమైనా ఎట్టకేలకు ఈ సంస్థలు తీసుకున్న నిర్ణయం అభినందనీయం.

Most Read Articles

English summary
Uber Flipkart partnership to deliver essential items during lockdown. Read in Telugu.
Story first published: Wednesday, April 8, 2020, 10:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X