ఉబెర్‌ యాప్‌లో ‘ఎమిషన్ సేవింగ్స్‌'.. ఈ కొత్త ఫీచర్‌తో ఎన్నో లాభాలు.!!

భారత్‌లో అగ్రగామి ట్యాక్సీ సర్సీస్‌గా సేవలందిస్తున్న ఉబెర్‌ ఇండియా(Uber India).. నేడు ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశంలో కర్బన ఉద్గారాలను నియంత్రించడమే లక్ష్యంగా 'ఉబర్‌ గ్రీన్‌' సేవలను అందిస్తున్న ఈ సంస్థ.. ఇప్పుడు 'ఎమిషన్‌ సేవింగ్స్‌' పేరుతో గ్రీన్‌ ఇండియా దిశగా అడుగులు వేస్తోంది. దీని గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో..

ప్రముఖ ట్యాక్సీ అగ్రిగేటర్‌ ఉబెర్‌ ఇండియా తన యాప్‌లో మరో ఫీచర్‌ను తీసుకువచ్చింది. 'Emission Savings' అనే ఫీచర్‌ ద్వారా రైడర్లు ఎంతమేరకు కర్బన ఉద్గారాలను నియంత్రించారో తెలుసుకోవచ్చని తెలిపిందే.. కాగా ఇప్పటికే ఉబెర్‌ ఇండియా ఉబెర్‌ గ్రీన్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ వాహనాల ద్వారా సర్వీస్‌ను అందిస్తోంది.

Uber-India-Emission-Savings

ఉబెర్‌ యాప్‌ ద్వారా ఉబెర్‌ గ్రీన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రయాణికులు బుక్‌ చేసుకున్న తర్వాత వారు జర్నీ చేసిన టైంలో ఎన్ని కిలోగ్రాముల CO2 ఉద్గారాలను ఆదా చేశారనేది ఆ యాప్‌లో ఉబెర్‌ రైడర్లకు సమాచారం అందిస్తుంది. దీని ద్వారా పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుందనేది గణాంకాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఉబెర్‌ ఇండియా యాప్‌లో ఈ ఫీచర్‌ను మొదటగా ఢిల్లీ-NCR, ముంబయి మరియు బెంగళూరు నగరాల్లో తీసుకువచ్చారు. ఈ నగరాల్లో ఈ ఫీచర్‌ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇక్కడ రైడర్‌లు Uber యాప్‌లో ఆల్-ఎలక్ట్రిక్ వెహికల్ రైడ్ కేటగిరీ అయిన Uber Greenని బుక్ చేసుకుని.. కర్బన ఉద్గారాలను నియంత్రించడం ద్వారా.. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించడమే ఉబెర్‌ చేస్తున్న ప్రయత్నంగా తెలుస్తోంది.

Uber-India-Emission-Savings

ఈ కొత్త ఫీచర్‌పై ఉబెర్ ఇండియా సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ నితీష్ భూషణ్ మాట్లాడారు. రైడర్లు ఉబెర్‌ గ్రీన్‌ ద్వారా తమ రైడ్‌లో పర్యావరణానికి ఎంత మేరకు దోహదపడుతున్నారో వారు తెలుసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇందుకోసమే ఎమిషన్‌ సేవింగ్స్‌ను ఫీచర్‌ను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఉబెర్‌ సర్వీస్‌ పట్ల రైడర్‌ రేటింగ్‌లతో పాటు.. పర్యావరణం పట్ల స్పృహను కలిగి ఉండాలనే ఉద్దేశంతో CO2 ఉద్గారాలను కిలోగ్రాముల చొప్పున యాప్‌లో ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు.

ఉబెర్‌ యాప్‌ ద్వారా C02 ఉద్గారాలను ఈ విధంగా తెలుసుకోవచ్చు. Uber యాప్‌లోని ఖాతా విభాగంలో.. Uber Green ను సెలెక్ట్‌ చేసుకోవాలి. ఇక్కడ రైడర్లు Estimated CO2 Emission Savings ను ఎంచుకోవడం ద్వారా పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రైడర్‌లు తమ ఉద్గార పొదుపులను ఎలా తెలుసుకోవచ్చో.. ఉదాహరణల ద్వారా యాప్‌లో తెలియజేశారు.

Uber-India-Emission-Savings

ఫీచర్‌లో రైడర్లు ఇప్పటి వరకూ చేసిన CO2 ఉద్గార పొదుపులు పోల్చుతూ ఒక గ్రాఫిక్‌ను పొందుపరుస్తుంది. రైడర్‌ ఉబెర్‌ గ్రీన్‌ను తీసుకున్నప్పుడు.. ఉబర్‌ ప్రీమియర్‌ ట్రిప్‌ను పోల్చుతూ.. గ్రీన్‌ సర్వీస్‌ ద్వారా సగటున నివారించబడిన CO2 ఉద్గారాల అంచనా మొత్తాన్ని ఫీచర్‌ ప్రదర్శిస్తుంది.

జీరో ఎమిషన్స్‌ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్‌గా మారడానికి Uber కట్టుబడి ఉన్నట్లు.. నితీశ్‌ భూషణ్ తెలిపారు. ఎమిషన్స్‌ సేవింగ్‌ ఫీచర్‌ ద్వారా రైడర్లకు వారు ఆదా చేసిన కర్బన ఉద్గారాల గురించి ఓ అంచనా అందించడంతో పాటు సమాజంపై ఓ సానుకూల ప్రభావాన్ని అందించేందుకు సహాయపడే ప్రయాణంలో ఓ కీలకమైన దశగా పేర్కొన్నారు.

కాగా బెంగళూరు, ముంబయి, ఢిల్లీ-NCR నగరాల్లో చాలా మంది ఉబెర్‌ గ్రీన్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. త్వరలో మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరించే దిశగా సంస్థ కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా 125 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా.. దాదాపు 8 లక్షల మంది దీనిపై ఉపాధి పొందుతున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 12, 2024, 19:11 [IST]
English summary
Uber india introduces new feature emission savings to track co2 savings through green rides
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+