కస్టమర్ కోసం అరేబియా సముద్రంలో ఎదురుచూస్తున్న క్యాబ్: వైరల్
ఓ కస్టమర్ ఉబర్ ట్యాక్సీ ద్వారా కారు బుక్ చేసుకుంటే అది అరేబియా మహా సముద్రం మీదుగా తన వద్దకు వస్తున్నట్లు మ్యాప్‌లో చూపించింది.
Recommended Video

భారత నగరాల్లో రవాణా పరంగా ట్యాక్సీ సర్వీసులదే పైచేయి. సిటీ బస్సుల్లో నిలబడుకొని మరియు అవస్థలు పడుతూ చేసే ప్రయాణాలకు నగర ప్రజలు పుల్‌స్టాప్ పెడుతున్నారు. ప్రత్యామ్నాయంగా క్యాబ్ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు.

టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో చరవాణి ద్వారా క్యాబును బుక్ చేసుకుంటే కేవలం నిమిషాల వ్యవధిలో మన ముందుకు వస్తున్నాయి. టెక్నాలజీ యుగంలో ఉన్న మనం ఇప్పుడు కేవలం నిమిషం వ్యవధిలోపే ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్ ద్వారా కారు బుక్ చేసుకుంటే మనం ఉన్న చోటకే వచ్చి, మనకు కావాల్సిన ప్రదేశానికి చేరవేసే సర్వీసులు అందుబాటులోకి వస్తాయని పదేళ్ల క్రితం ఎవ్వరూ ఊహించి ఉండరు. అయితే, టెక్నాలజీ అన్నింటిని సుసాధ్యం చేసింది.

కానీ, ప్రతి ఆవిష్కరణలో ప్రయోజనాలు ఉన్నట్లే, వాటి ద్వారా కొన్ని సమస్యలు కూడా పుడుతుంటాయి. అందుకు నిదర్శనం ఈ "క్యాబ్ బుక్ చేసుకుంటే సముద్రంలో ఎదురు చూస్తున్న కారు" సంఘటన.

ఊహించడానికి కూడా సాధ్యం కాని ఈ సంఘటన ముంబాయ్‌లో జరిగింది. ఓ కస్టమర్ ఉబర్ ట్యాక్సీ ద్వారా కారు బుక్ చేసుకుంటే అది అరేబియా మహా సముద్రం మీదుగా తన వద్దకు వస్తున్నట్లు మ్యాప్‌లో చూపించింది.

ఉబర్ కస్టమర్ హుసేన్ తన మొబైల్ యాప్‌లో చూపించిన మ్యాప్‌ను స్క్రీన్ షాట్ తీసుకొని, "అస్లాం బాయ్ సబ్‌మెరైన్ ద్వారా వస్తున్నాడని"(Aslam bhai submarine se aarele hai) ట్యాగ్ లైన్‌తో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

సాంకేతిక లోపం కారణంగా ఇలాంటి సమస్యలు రావడం సహజమే, కానీ కారు ఏకంగా సముద్రంలో చూపించడం దారుణమనే చెప్పాలి. కారు నడుపుతున్నపుడు గుడ్డిగా ఇలాంటి సూచనలు నమ్మితే అంతే సంగతులు.

ఏదేమైనప్పటి ఉబర్ మొబైల్ యాప్ చూపించిన తప్పుడు సమాచారానికి ఫేస్‌బుక్‌లో భలే స్పందన లభించింది. ఈ ఒక్క పోస్టుకు 1500 లైకులు, 4500 షేర్లు మరియు లెక్కలేనన్ని కామెంట్లు వచ్చాయి. దీని గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్సులో పాఠకులతో పంచుకోండి...



Click it and Unblock the Notifications








