Just In
Don't Miss
- News
ఇద్దరు కలెక్టర్లపై చర్యలు..ఎస్ఈసీ ఆదేశాలతో జీఏడీకి సరెండర్
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీకు తెలుసా.. ఈ కార్ ఉదయపూర్ యువరాజునే ఫిదా చేసింది.. ఆ కార్ మీకు కూడా ఇష్టమైనదే
ఉదయపూర్ యువరాజు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ పెద్ద ఆటోమొబైల్ ఔత్సాహికుడు. మేవార్ కుటుంబం భారతదేశంలో అరుదైన పాతకాలపు కార్లను కలిగి ఉంది. లక్ష్యరాజ్ సింగ్ అనేక అన్యదేశ కార్లను కలిగి ఉన్నాడు. ఇతనికి మహీంద్రా వాహనాలతో ముఖ్యంగా థార్ తో ప్రత్యేక సంబంధం ఉంది. గత సంవత్సరం ఆనంద్ మహీంద్రా ఉదయపూర్ యువరాజుకు సరికొత్త థార్ 700 యొక్క కీను అందజేశారు. అంతే కాకుండా ఇటీవల దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త థార్ కూడా కొనుగోలు చేశారు. అతను సరికొత్త థార్ కారుపై తన అభిప్రాయాలను ఒక వీడియో ద్వారా తెలిపారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

యువరాజు లక్ష్యరాజ్ సింగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో కొత్త థార్‌తో తన అనుభవాలను పంచుకుంటున్నారు. మహీంద్రా థార్ చాలా సంవత్సరాల తరువాత కొత్త డిజైన్ మరియు ఫీచర్‌లో నవీకరించబడింది. ఈ కారును నడిపిన ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా కొత్త థార్ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు బాగా నచ్చుతుంది.

లక్ష్యరాజ్ సింగ్ మేవార్ యొక్క అధికారిక ఛానెల్‌లోని వీడియోలో, తాను ఈ కారును చాలా ఇష్టపడుతున్నట్లు, ఈ కొత్త కారుకు ప్రవేశపెట్టిన మహీంద్రాకు మరియు మహీంద్రా టీమ్ కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. తాను కొత్త థార్‌ను పాతదానితో పోల్చబోనని, అయితే ఈ వాహనం భారతదేశంలో తయారైందనే వాస్తవం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు.
MOST READ:ట్రాక్టర్ వెనుకవైపు పెద్ద టైర్లు ఉండటానికి కారణం ఏంటో తెలుసా ?

ఉదయ్ పూర్ యువరాకు యొక్క గ్యారేజ్ లో మనదేశపు కాకుండా పాత అన్యదేశ కార్లు ఉన్నాయి. అతని గ్యారేజీలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ మరియు బెంట్లీ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. అతను 2012 లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ డెలివరీ తీసుకున్నాడు. అతని తండ్రి మహారాణా శ్రీజీ అరవింద్ సింగ్ మేవార్ కార్స్ బఫ్. అతని కుటుంబం 1911 లో మొదటి రోల్స్ రాయిస్‌ను కొనుగోలు చేసింది. ఆ సమయంలో అన్ని కార్లు రాజ కుటుంబానికి చెందినవి.
లక్ష్యరాజ్ సింగ్ మేవార్ ఆఫ్ రోడ్ వాహనాలు నడపడం అంటే ఇష్టం. ఈ సంవత్సరం ప్రారంభంలో అతను తన మాడిఫైడ్ మహీంద్రా థార్ మరియు కొన్ని ఇతర కార్లతో కొన్ని సిరీస్ ఆఫ్-రోడింగ్ చేస్తున్న వీడియోలను పంచుకున్నాడు.
MOST READ:హవ్వ.. 23 కోట్ల రూపాయలకు అమ్ముడైన 54 ఏళ్ల పాత ఫెరారీ కారు
మహీంద్రా ఈ నెల ప్రారంభంలో ఆల్-న్యూ థార్ ప్రారంభించింది మరియు అక్టోబర్ 2 నుండి ఇప్పటికే 9,000 బుకింగ్స్ స్వీకరించింది. కొత్త థార్ డెలివరీ నవంబర్‌లో ప్రారంభమవుతుంది. అయితే విపరీతమైన డిమాండ్ కారణంగా కారు కోసం ఇంకా కొన్ని రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ కొత్త థార్ ధర రూ. 9.8 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మహీంద్రా థార్ కొత్త పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో ప్రవేశపెట్టబడింది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుండగా, డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఇది కొత్త 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంది. ఏది ఏమైనా దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతితక్కువ కాలంలో అందరి మనసులను దోచిన SUV మహీంద్రా థార్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
MOST READ:50 ఏళ్ల ల్యాండ్ రోవర్ నడుపుతున్న టీనేజ్ అమ్మాయి [వీడియో]