భారతీయ మార్కెట్లో ఉన్న ఐదు అందవిహీనమైన కార్లు
కార్లు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అందులో మెక్ లారెన్ పి1, ఫెరారి యఫ్12 మరియు కోయింగ్‌సెగ్ వన్: 1 వంటి కార్లను చూడటానికి ఎంతో అత్భుతంగా తీర్చిదిద్దారు. ఇలా ఎంతో అందంగా ఉండే కార్లు ప్రస్తుతం మార్కెట్లో మంచి సేల్స్ సాధిస్తున్నాయి.
అంతే కాకుండా మన భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఉన్న హోండా జాజ్, మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్, హ్యుందాయ్ ఎలెంట్రా వంటి కార్లను అందమైన డిజైన్ గల కార్లు అని ఉదాహరణ చెప్పవచ్చు.
Also Read: ఒక్క సారి ఛార్జింగ్ చేసుకుని 1496 కిలోమీటర్లు చుట్టొచ్చిన సోలార్ కారు.
ఇక మన భారతీయ మార్కట్లో అందవిహీనమైన కార్లకు కొదవే లేదని చెప్పవచ్చు. అసలు ఇలాంటి కార్లను డిజైన్ చేసింది ఎవరని ఉర్రూతలూగిపోతారు. ఎందుకంటే వీటి డిజైన్ అంత చెత్తగా ఉంటుంది. మొత్తానికి ఆ కార్లు ఏవో తెలుసుకోవాలని ఉందా? అయితే క్రింద గల స్లైడర్‌లో ఉన్న కార్ల మీద ఓ లుక్కేయండి...

టాటా నానొ
నానో మంచి ఇంధన సామర్థ్యం గల కారు మరియు నగర రోడ్లకు ఎంతో బాగా సరిపోయే కారు మరి ఎందుకు దీనిని చెత్త కారు అని అంటునేగా మీ సందేహం. ఇందులో కుటుంబ సమేతంగా ప్రయాణించడానికి వీలు కాదు మరియు అన్నింటికన్నా ఇది ఇచ్చే శబ్దం చాలా దారుణంగా ఉంటుంది.

హ్యూందాయ్ ఐ10
హ్యూందాయ్ ఐ10 ని ఎందుకు డిజైన్ చేశారు అని అనిపిస్తుంది. దీనిని ముందు నుంచి చూస్తే డిజైన్ ఏమాత్రం బాగా లేదనే ఫీలింగ్ వస్తుంది . మరియు దీని ముందు గల లైట్లు చూడండి కోడిగుడ్డుకు రెండు ఆవాలు అద్దినట్లు ఉంది కదా, ఇంకా ఇంత చిన్న కారుకు చెవులులాగా ఉండే అంత పెద్ద సైడ్ మిర్రర్‌లు అవసరమా చెప్పండి ?

మారుతి సుజకి స్టింగ్‌రే
దీనిని యువత ఆకర్షించడానికి అన్నట్లు బాక్స్ రూపంలో డిజైన్ చేశారు. అక్కడే వీరి ప్లాన్ బెడిసికొట్టింది. ఎందుకంటారా అప్పటికే మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ మోడల్‌ను కూడా ఇదే రూపంలో డిజైన్ చేశారు. మరి ఈ స్టింగ్‌రేను కూడా అలాంటి డిజైన్‌లో అందిస్తే దీనిని ఎలా ఇష్టపడతారు చెప్పండి.

రెనొ స్కాలా
విశాలమైన క్యాబిన్ స్పేస్ మరియు అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఎన్నో మంచి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇవి ఉంటే చాలా డిజైన్ కూడా బాగుండాలి కదా. దీని ముందు వైపు డిజైన్ కూడా బాగానే ఉంది. కాని ఇది ఇండియాలో పెద్దగా అమ్మకాలు సాధించలేదు. అయితే ఈ రెనొ స్కాలా వెనుకవైపు డిజైన్ బాగోలేదని టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో...

టాటా మాంజా
టాటా వారి మరోక ఉత్పత్తులలో టాట మాంజాని చాలా చెత్తగా డిజైన్ చేశారు. ఇది ఇలా ఉండటానకి ఒక కారణం ఉందివలేండి. దీనిని నాలుగు బృందాలు నాలుగు భాగాలుగా విభజించుకుని. అన్నింటిని కలిపి ఈ కారును సృష్టించారు.



Click it and Unblock the Notifications








