14,000 కిలోల బరువైన బస్సు, ట్రక్కును కలిపి లాగిన F77 ఎలక్ట్రిక్ బైక్.. ఈ అడ్వెంచర్ వీడియో చూసి తీరాల్సిందే
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల హవా కొనసాగుతోంది. వాటి మెరుగైన పనితీరుతో మార్కెట్లో కస్టమర్లకు బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా అల్ట్రావయోలెట్ కంపెనీకి చెందిన 'F77' ఎలక్ట్రిక్ బైక్ చాలా ఫేమస్ అయింది.
అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ శక్తి సామర్థ్యాలను ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ పరీక్షించింది. ఈ వీడియోను బైక్ విత్ గర్ల్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. ఇందులో Ultraviolette F77 ఎలక్ట్రిక్ బైక్‌తో.. కారు, ట్రక్కు మరియు బస్సును లాగడం ద్వారా దాని శక్తిని పరీక్షించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మొదటగా 1700kg బరువున్న టయోటా ఇన్నోవా MPVని UltraViolet F77తో లాగడానికి యూట్యూబర్ ప్రయత్నించారు. అనంతరం ట్రక్కును లాగేందుకు యత్నించారు. ట్రక్కు వంటి భారీ వాహనాన్ని ఓ ఎలక్ట్రిక్ బైక్ లాగగలదా అని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది అనుకున్నంత సాధ్యంగా లేదు. 20 అడుగుల పొడవుతో 6,500 కిలోల బరువున్న ట్రక్కును అల్ట్రావయోలెట్ F77 ఇ-బైక్ ద్వారా లాగారు.
అయితే, టయోటా ఇన్నోవా కారును లాగినంత వేగంగా ఈ ట్రక్కును లాగలేకపోయింది. ఇది కొంచెం స్లోగా వెళ్లింది. బస్సు లాంటి పెద్ద వాహనాన్ని ఎలక్ట్రిక్ బైక్ లాగలేదని చాలా మంది భావిస్తారు. అల్ట్రా వయొలెట్ ఎఫ్77 బైక్ ఆ అంచనాల్ని తలక్రిందులు చేసింది. ఈ బైక్ తక్కువ వేగంతో 7,500 కిలోల బరువైన భారీ బస్సును లాగింది.

అయితే ఈ సాహసాన్ని ప్రైవేట్ ట్రాక్‌పై ప్రయత్నించారు. పబ్లిక్ రోడ్లపై ఇలాంటి వాటికి అనుమతి ఉండదని గుర్తుంచుకోవాలి. ఇంతలోనే యూట్యూబర్ ట్రక్కు మరియు బస్సు రెండింటినీ కలిపి అంటే దాదాపు 14,000 కిలోల బరువును కలిసి లాగాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా ఎగ్జెయిటింగ్‌గా కొనసాగింది.
రెండింటినీ తాడుతో జాయింట్ చేసి F77 బైక్‌తో లాగారు. కాకపోతే ఇది చాలా నెమ్మదిగా సాగింది. కాగా ఫ్యూయెల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలతో పోలిస్తే, ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలతో భారీ బరువైన వాహనాలను నడపడం వారికి సాధ్యమైంది.

ఇక బెంగళూరుకు చెందిన అల్ట్రావయోలెట్ తన F77 ఎలక్ట్రిక్ బైక్‌తో దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందింది. ఇందులో స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఎలక్ట్రిక్ మోటార్ గరిష్ఠంగా 38.8 bhp శక్తిని మరియు 95 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా గంటకు 147 కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది.
F77 వేరియంట్‌లు వరుసగా 7.1 kWh మరియు 10.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. అల్ట్రావయోలెట్ F77 రేంజ్ విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్ బైక్ పూర్తి ఛార్జింగ్‌తో 206 కి.మీ నుంచి 307 కి.మీల రేంజ్‌ను ఇస్తుంది.

ఇందులో ఫీచర్ల విషయానికొస్తే, ఇది 5-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంటల్ కన్సోల్, LED లైటింగ్, రైడ్ అనలిటిక్స్, నావిగేషన్, జియోఫెన్సింగ్, క్రాష్ డిటెక్షన్ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ F77 బైక్‌ను మార్కెట్లో రూ.3.8 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రవేశపెట్టారు. కాగా దీని ప్రీమియం మోడల్, F77 రీకాన్ ధర రూ. 4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.


Click it and Unblock the Notifications








