మీ పిల్లలు డ్రైవింగ్ చేస్తూ, పట్టుబడ్డారో.. మీకు మోత మోగుతుంది: ఇది చూడండి
భారతదేశంలో మోటార్ వాహన చట్టం చాలా కఠినంగా అమలు చేయబడుతోంది, దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నిలువరించడం. దీని కోసం ప్రభుత్వాలు చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల నోయిడా పోలీసులు మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేయకూడదని, ఈ విధానాన్ని పూర్తిగా రూపుమాపడానికి చర్యలు తీసుకుంటున్నారు.

నోయిడా పోలీసులు ఆ ప్రాంతంలో మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేయకుండా నిరోధించడానికి కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిర్దిష్ట వయోపరిమితి లేని పిల్లలకు బైక్‌లు, స్కూటర్లు, కార్లు ఇచ్చే తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని, అక్కడి పోలీసులు తెలిపారు.

నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 18 ఏళ్లలోపు పిల్లలు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే, వారి తల్లిదండ్రులకు దాదాపుగా రూ. 25,000 వరకు జరిమానా విధించబడే అవకాశం ఉందని అన్నారు. అంతే కాకూండా, ఈ నేరం మళ్లీ మళ్లీ జరిగితే మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆ పిల్లల తల్లిదండ్రులకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది.

ప్రస్తుతం భారతదేశంలో కరోనా మహమ్మారి చాలా వరకు తగ్గుముఖం పట్టింది. కావున ప్రజా రహదారులపైన వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. అంతే కాకుండా పాఠశాలలు, కళాశాలలు మొదలైనవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. కావున స్కూల్ మరియు కాలేజీ పిల్లలు ఎక్కువగా బైకులు మొదలైనవి తీసుకెళ్లడానికి ఇష్టపడతారు. ఆ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నోయిడా పోలీసులు దీనికి చరమగీతం పాడటానికి సిద్ధమయ్యారు.

భారతదేశంలో మోటారు వెహికల్ చట్టం ప్రకారం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ప్రజారహాదారులపైన వాహనం నడపడం చట్ట విరుద్ధం. కావున నోయిడా పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) కింద ఒక స్కీమ్ రూపొందించారు, దీని ప్రకారం తల్లిదండ్రులు వారి పిల్లలు బైక్ లేదా కారు ఇచ్చినట్లయితే, అది పోలీసులు గుర్తించినట్లయితే ఆ పిల్లల తల్లిదండ్రులకు జరిమానా విధించవచ్చు.

ఇది మాత్రమే కాకూండా సుమారు రోడ్లపైన లెక్కకు మించిన మైనర్లు వాహనాలను నడుపుతూ పోలీసులుకు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ ఏడాదిలో దాదాపు 90 మంది మైనర్లు పోలీసులకు పట్టుబడ్డారు. అయితే నిబంధనలు ఉల్లంఘించిన చాలా మంది తప్పించుకుంటున్నారని, నగరంలో దాదాపు 5 శాతం నుంచి 7 శాతం మంది డ్రైవర్లు మైనర్లే అనే స్థాయికి చేరుకున్నారని పోలీసులు చెబుతున్నారు.

దీంతో పోలీసులు ఈ నోటీసును పాఠశాలల యాజమాన్యంతో కూడా పంచుకున్నారు. మైనర్ పిల్లలకు కారు ఇస్తే తల్లిదండ్రులకు రూ. 25,000 వరకు జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కావున తల్లిదండ్రులు వారి పిల్లలకు వీలైనంత వరకు వాహనాలను ఇవ్వకపోడం మంచిది. లేకుంటే ఈ జరిమానా మరియు జైలు శిక్ష వంటికి అనుభవించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం నోయిడాలో మైనర్ పిల్లలను డ్రైవింగ్ చేయకుండా నిరోధించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా రోడ్డుపైన వాహనాలు డ్రైవింగ్ చేసే మైనర్లు ఎదుటివారిని ప్రమాదంలో పడేయడమే కాకూండా, వారి ప్రాణాలకు కూడా హాని కలిగిస్తుంది. పోలీసులు తీసుకువచ్చిన ఈ కొత్త విధానం తప్పకుండా మార్పు తీసుకువస్తుందని ఆశిస్తున్నాము.

భారతదేశంలో ప్రతి ఏటా లక్షలమంది రోడ్డు ప్రమాదాలవల్ల మరణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ నియమాలను అనుసరించకపోవడం, అంతే కాకూండా హెల్మెట్ లేకుండా ఉండటం మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.

అయితే భారతదేశంలో రోడ్డుప్రమాదాలు జరగటానికి సరైన రోడ్లు లేకపోవడం కూడా ఒక కారణమే, కావున కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లు విస్తరించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల ఆంధ్రప్రదేశాలో కూడా సరైన రోడ్డు మార్గాలకోసం సన్నాహాలు సిద్ధం చేసారు. ఏది ఏమైనా ప్రమాదాలను నిలువరించడానికి కేవలం పోలీసులు మాత్రమే పాటుపడితే సరిపోదు, వాహనదారులు కూడా తప్పకుండా బాధ్యతగా వ్యవహరించాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చు.
గమనిక: ఈ ఆర్టికల్ లో ఉపయోగించిన ఫోటోలు కేవలం అవగాహన కోసం మాత్రమే, పాఠకులు గమనించగలరు.


Click it and Unblock the Notifications








