నంబర్ ప్లేట్ తీసేసి కదులుతున్న కారులో క్రాకర్స్ షో.. వైరల్ అవుతున్న వీడియో
దీపావళి పండుగ ఇంకా ఏదైనా సంతోషకరమైన సందర్భాల్లో క్రాకర్స్ కాలుస్తాం. అది కూడా ఇంటివద్ద లేదంటే బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే.. కానీ ఇక్కడ కొందరు రోడ్డుపై కారులో వెళ్తూ క్రాకర్స్ కాల్చి వీరంగం సృష్టించారు.
రోడ్డుపై కారులో వెళ్తూ టపాసులు కాల్చిన వ్యక్తులపై ఈ రోజు గురుగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేశఆరు. గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో కారు వెళ్తుండగా బానెట్ లోపల నుంచి క్రాకర్లు పేలాయి. ఇందుకు సంబంధించిన 14 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే సంబంధిత కారు యజమాని ఎవరనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. వీడియోలో చూసినట్లయితే కారుకు నంబర్ ప్లేట్ కూడా లేదు. తన గుర్తింపును దాచేందుకు కారు యజమాని నంబర్ ప్లేట్‌ను తొలగించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే కారు కలర్ మరియు బ్రాండ్ ఆధారంగా అలాంటి కార్లు ప్రస్తుతం సిటీలో ఎన్ని ఉన్నాయో తెలపాలని రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీకి గురుగ్రామ్ పోలీసులు లేఖ రాశారు.
కాగా గతేడాది కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగిందని.. ఇలా రోడ్డుపై కారులో వెళ్తూ క్రాకర్స్ కాల్చిన ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారని ఉన్నతాధికారి చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 14 సెకన్ల క్లిప్‌లో ఎస్‌యూవీలో ఉన్నవారిలో ఒకరు కారులో వేలాడుతూ కనిపించగా, మరికొందరు బాణాసంచా పేల్చినట్లుగా కనపడుతోంది.

గతేడాది అక్టోబర్ 29 న, దీపావళి రోజు గురుగ్రామ్‌లోనే ఇదే తరహాలో ఓ వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. సైబర్ హబ్ నుంచి DLF ఫేజ్-III వైపు వెళుతున్న బ్లాక్ సెడాన్‌లో బాణసంచా పేలుస్తూ వెళ్తున్నారు. ఈ దృశ్యాలను ఆ కారు వెనుక వస్తున్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.
ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో అనంతరం కారు యజమానిని పిలిపించి విచారణ చేపట్టగా ఆ కారును విక్రయించినట్లు తేలింది. కాగా ఘటనకు పాల్పడిన నకుల్ (26), జతిన్ రావు (27), క్రిషన్ కుమార్ (26) అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ కార్లు కొని విక్రయించేవారని పోలీసులు తెలిపారు.

గురుగ్రామ్‌లో టపాసులు పేలిన కారు ఫోర్డ్ ఎండీవర్ ఎస్‌యూవీ మోడల్‌గా పోలీసులు పేర్కొన్నారు. ఇది దేశీయ మార్కెట్లో ఫోర్డ్ ఎండీవర్ ప్రముఖ ఫుల్ సైజ్ ఎస్‌యూవీ.. గత పద్దెనిమిదేళ్లుగా భారత్‌లో దీనిని విక్రయిస్తున్నారు. ఇంకా ఈ ఎస్‌యూవీ దాని విభాగంలో ప్రత్యేకతను చాటుకోగా.. సెకండ్ జెన్‌ను 2016లో ప్రారంభించారు.
కాగా భారత్‌లో ఎండీవర్ మోడల్ విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా 37 శాతం నమోదయ్యాయి. సెప్టెంబరు 2021 నాటికి, ఇది ఫుల్ సైజ్ ప్రీమియం SUV సెగ్మెంట్‌లో 44 శాతానికి పైగా నమోదైంది. సెకండ్ జెన్ ఎండీవర్ ఏడాదికి సగటున 10,000 నుంచి 12,000 యూనిట్ల విక్రయాలను కలిగి ఉంది.

భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఫోర్డ్ ఎండీవర్ ప్రీమియం SUV 2.0 లీటర్ ఎకోబ్లూ టర్బో డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 168 bhp వద్ద 420 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ MGతో 10 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించారు. ఇందులో ప్రయాణీకుల సేఫ్టీ కోసం ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్ట్ మరియు పార్కింగ్ కెమెరా వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








