కేంద్ర బడ్జెట్‌లో ఆటోమోబైల్‌ రంగంపై ఆ వరాలు ప్రకటిస్తే చాలు.. అన్ని మారిపోతాయి!!

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రేపు అనగా జూలై 23న పూర్తి స్థాయి బడ్జెట్‌ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామణ్‌ ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్‌కి సంబంధించి కీలక పత్రాలు ఇప్పటికే ఆర్థికశాఖ మంత్రికి చేరాయి. రేపు ఆ ప్రతులను ఆమె చదివి వినిపించనున్నారు. ప్రతీ రంగం ఈ బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాయి. గత ప్రభుత్వం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌తోనే ఇప్పుడు కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ రంగ వృద్ధికి ఊతమిచ్చే చర్యలపై ఆటోమొబైల్ పరిశ్రమ ఆశాజనకంగా ఉంది. ఈ బడ్జెట్ నుంచి మీరు ఏమి ఆశించవచ్చో ఇక్కడ చూడండి.

ఈ ఏడాది ప్రారంభంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి పెద్దగా ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ వస్తుండటంతో ఆటోమొబైల్ రంగానికి గణనీయమైన ప్రోత్సాహకాలు ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. భారత ఆటోమొబైల్ పరిశ్రమలోని పలు విభాగాలు తమ అవసరాలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ మద్దతును కొనసాగించడం ప్రధాన డిమాండ్లలో ఒకటిగా ఉంది.

Union-Budget-On-Auto-Industry

ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలపై సబ్సిడీని కొనసాగించడం వల్ల దేశవ్యాప్తంగా కాలుష్య రహిత, మెరుగైన రవాణా అవకాశాలను ప్రోత్సహించడానికి దోహద పడనుంది. ఇక హైబ్రిడ్ వాహనాలకు పన్ను ప్రోత్సాహకాలు మరో ముఖ్యమైన అంశంగా ఉంది. ఈ ప్రోత్సాహకాలు పర్యావరణ అనుకూల వాహన ఆప్షన్‌లను ఎంచుకోవడానికి వినియోగదారులను ప్రోత్సహిస్తాయి. తద్వారా వాతావరణంలో కాలుష్య స్థాయిలు కూడా తగ్గుతాయి. ఈ ప్రోత్సాహకాలను ప్రకటిస్తే, భారతదేశం అంతటా హైబ్రిడ్ వాహనాల అమ్మకాలు కూడా పెరుగుతాయి.

భారతదేశంలో పెట్రోల్, డీజీల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. దీని వల్ల రాష్ట్రాలలో ఇంధన ధరలు తగ్గుతాయి. ఇది వినియోగదారులకు భారీ ఊరటే అని చెప్పవచ్చు. రాష్ట్రంలో విధించే టాక్స్‌ లేకపోవడంతో ప్రజలకు కలిసి రానుంది. ఇక ఆటోమొబైల్ పరిశ్రమ కూడా వివిధ సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్య చాలా అవసరమైన ప్రోత్సాహకాలను అందించే చర్యల కోసం ఎదురుచూస్తోంది.

Union-Budget-On-Auto-Industry-Subsidy

ప్రపంచ మార్కెట్‌లో 3వ అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా భారత్‌ ఉంది. కాబట్టి ప్రపంచంతో మరింత పోటీ పడేందుకు ఈ ప్రోత్సాహకాలు కీలకంగా ఉంటాయి. ఈ ప్రోత్సాహకాలు అందిస్తే ప్రపంచంలో మూడో స్థానం నుంచి ఆటోమొబైల్ మార్కెట్‌ని శాసించే విధంగా భారత్ కొనసాగుతుంది. ఇక ఫేమ్ 3 గ్రాంట్ కోసం ఆటోమొబైల్ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ బడ్జెట్‌లో ఇదే కీలకమైన అంశంగా ఉండనుంది.

ఫేమ్‌ 3 కింద ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్‌ని ప్రోత్సాహించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటే అది పెను సంచనలనమే అని చెప్పాలి. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ 2024పై ఆటోమొబైల్ పరిశ్రమ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ బడ్జెట్‌ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంతో పాటు అదే సమయంలో వృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించే ప్రకటనల కోసం ఆటోమొబైల్ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఈ అంచనాలు నెరవేరుతాయో లేదో రాబోయే బడ్జెట్‌లోనే తేలనుంది. ఆటోమొబైల్ భవిష్యత్తుని వేగంగా పరుగులు పెట్టించేందుకు కొన్ని విధాన పరమైన మార్పులు మరియు ఆర్థిక చర్యలు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటిని సర్దుబాటు చేయడం వల్ల త్వరలోనే భారత్‌ నంబర్‌ వన్‌గా ఎదుగుతుందని భావిస్తున్నారు. ఇక మధ్యంతర బడ్జెట్‌లో ఆశించిన ప్రకటనలు లేకపోయినా ఈ పూర్తి బడ్జెట్‌లో కొంతమేర అయినా ఆటో రంగంపై ప్రకటనలు ఆశించవచ్చు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, July 22, 2024, 20:03 [IST]
English summary
Union budget 2024 what auto industry expecting from this financial year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+