Just In
Don't Miss
- News
బలవంతపు ఏకగ్రీవాలు జరగనివ్వొద్దు .. పంచాయతీ పోరు కోసం టీడీపీ కంట్రోల్ రూమ్ : చంద్రబాబు
- Sports
ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లను తిట్టినోళ్లు దొరకలేదట.!
- Movies
ఆ హీరోలు రిజెక్ట్ చేసిన మల్టీస్టారర్ కథలో విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట!
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు
- Finance
Budget 2021: 80సీ లిమిట్ పెరుగుతుందా, ఐటీ స్లాబ్స్‌లో మార్పులు?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పేస్ మాస్క్ విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ
గత సంవత్సరం మొదలైన కరోనా మహమ్మరి సమస్య ఇప్పటికి చాలా దేశాలను ప్రభావితం చేస్తూనే ఉంది. కరోనా మహమ్మరి వల్ల దాదాపు అన్ని దేశాలు సతమతమయ్యాయి. కరోనా మహమ్మారిని పూర్తిగా రూపుమాపడానికి ప్రభుత్వాలు అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కరోనావైరస్ సమస్య ప్రారంభమైనప్పటి నుండి భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవన విధానం చాలా విషయాల్లో మారిపోయింది.

కరోనా వల్ల ఇప్పుడు ఫేస్ మాస్క్ జీవితంలో ఒక భాగంగా నిలిచిపోయింది. ఇప్పటికి కూడా చాలా దేశాలలో పేస్ మాస్క్ తప్పనిసరి. ఫేస్ మాస్క్ ధరించడం వల్ల కరోనావైరస్ సంక్రమణ తగ్గిస్తుంది. ఈ కారణంగా ప్రజలు ఇప్పుడు ఫేస్ మాస్క్ ధరించడం అత్యవసరం.

ప్రజలు బయటకు వెళ్లే సమయంలో ఫేస్ మాస్క్ ధరించాల్సిన అవసరం గురించి ప్రభుత్వం వారిలో అవగాహన పెంచుతోంది. భారతదేశంలో బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించని వారికి పోలీసులు, వివిధ శాఖ అధికారులు అధిక మొత్తంలో జరిమానా విధిస్తున్నారు.
MOST READ:నిండు ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్.. ఎలా అనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

ఇప్పటికి కూడా మనదేశంలో కొన్ని రాష్ట్రాల్లో వాహనదారులకు ఫేస్ మాస్క్ తప్పనిసరి. అయితే, వాహనాల్లో ఒంటరిగా ప్రయాణించే వారికి ఫేస్ మాస్క్ ధరించాలా వద్దా అనే గందరగోళం ఇప్పుడు ఒక అనుమానంగా మొదలైంది. పోలీసులు వాహనాలలో ఒంటరిగా ప్రయాణిస్తూ మాస్క్ ధరించని వారికీ కూడా ఎక్కువ జరిమానాలు విధించడంతో, ఈ అనుమానం తలెత్తింది.

ఈ క్రమంలో పేస్ మాస్క్ ధరించని లాయర్ సౌరభ్ శర్మకు 2020 సెప్టెంబర్ 9 న ఢిల్లీ పోలీసులు రూ. 500 జరిమానా విధించారు. అయితే ఆ సమయంలో సౌరభ్ శర్మ తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నాడు. అయితే ఫేస్ మాస్క్ ధరించనందుకు పోలీసులు అతనికి జరిమానా విధించారు.
MOST READ:జీప్ కంపాస్ కొనాలనుకునే వారికి సువర్ణావకాశం.. త్వరపడండి.. ఈ అఫర్ పరిమిత కాలం మాత్రమే

తన జరిమానాను తిరిగి చెల్లించామని కోరుతూ సౌరభ్ శర్మ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్‌లో సౌరభ్ శర్మ తన నష్టానికి రూ .10 లక్షల పరిహారం కోరారు. ఈ కేసు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో ఢిల్లీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

వాహనంలో ప్రయాణించే ఎవరైనా ఫేస్ మాస్క్ ధరించాలని ఢిల్లీ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఒంటరిగా ప్రయాణించేవారికి ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి చేయడానికి ఎటువంటి మార్గదర్శకాలు లేవని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తన అఫిడవిట్‌లో పేర్కొంది.
MOST READ:22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్

ఒంటరిగా ప్రయాణించేటప్పుడు ఫేస్ మాస్క్ ధరించాలా వద్దా అనే గందరగోళం నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ యొక్క ఈ అఫిడవిట్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే కరోనా మహమ్మారిని నివారించడానికి బహిరంగ ప్రదేశాలలో పేస్ మాస్క్ తప్పని సరి, కానీ కారులో ఒంటరిగా ప్రూయాణించేటప్పుడు ఈ పేస్ మాస్క్ అవసరం లేదని కేంద్ర ఆరోగ్య తెలిపింది.
Note: Images used are for representational purpose only.