అమిత్‌ షా కారు నెంబర్‌ ప్లేట్‌పై CAA.. వైరల్‌ అవుతున్న వీడియో

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah Car Number Plate) కారు నెంబర్‌ ప్లేట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఇందుకు కారణం ఆయన కారు నెంబర్‌లో 'CAA' అనే ఇంగ్లీష్‌ అక్షరాలు(CAA Car Number Plate) ఉండటమే. పూర్తి సమాచారం ఈ కథనంలో..

ఇటీవల, పౌరసత్వ సవరణ చట్టం లేదా CAAకి సంబంధించి అమిత్ షా పేరు నిత్యం వార్తలో నిలిచింది. కాగా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం CAA 2019 నిబంధనలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి టాటా సఫారీ కారులో అమిత్ షా చేరుకోగా.. ఆ ఎస్‌యూవీపై CAA అక్షరాలు.. ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

Amit-Shah-Tata-Safari-CAA-Viral-Video

దీంతో ఇప్పుడు నెట్టింట్లో సీఏఏ హాట్‌ టాపిక్‌గా మారింది. 2019లో కేంద్రం ప్రతిపాదించిన సీఏఏ ప్రకారం బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం పొందేందుకు వీలుంటుంది. కేంద్రం ప్రతిపాదనతో సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో ఈ చట్టం అమల్లోకి రాలేదు.
కాగా పార్లమెంటు ఎన్నికల కోడ్‌ వచ్చే లోగా సీఏఏ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.

ఇటీవల ET నౌ గ్లోబల్ సమ్మిట్ 2024లో అమిత్ షా దీనిపై మాట్లాడారు. ఎన్నికలకు మందు CAA కు సంబంధించిన నోటిఫికేషన్‌ ఖచ్చితంగా జారీ అవుతుందని చెప్పారు. ఈ చట్టం ఖచ్చితంగా అమల్లోకి వస్తుందని.. దీనిపై ఎవరూ గందరగోళానికి గురికావద్దని చెప్పారు.

Amit-Shah-Tata-Safari-CAA-Viral-Video

ఇక వీడియోను పరిశీలించినట్లయితే.. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట తెల్లటి టాటా సఫారీ రావడాన్ని చూడవచ్చు. ఈ SUV రిజిస్ట్రేషన్ నంబర్ DL 1CAA 4421. అయితే ఈ నంబర్‌ గతంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పేరుతో రిజిస్టర్ చేయబడిన 2018 మోడల్ 4×4 టాటా సఫారీగా వెల్లడైంది.

అయితే ఇది సాధారణ టాటా సఫారీ కాదు. చాలా పకడ్బందీగా సేఫ్టీ ఫీచర్లతో టాటా సఫారీ ఎస్‌యూవీని ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇది సాయుధ వాహనం. కాబట్టి ఇందులో విండ్‌స్క్రీన్ మరియు బాడీ ప్యానెల్‌లు అన్నీ పటిష్ఠంగా ఉంటూ బుల్లెట్‌ప్రూఫ్‌గా ఉంటుంది. ఆయన పదవి దృష్ట్యా టాటా సఫారీ ఎస్‌యూవీని పకడ్బందీగా రూపొందించారు.

Amit-Shah-Tata-Safari-CAA-Viral-Video

వీడియోలో కనిపించే టాటా సఫారి 2.2 డికోర్ వెర్షన్. ఇది 2.2-లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 138 bhp మరియు 320 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కావడంతో ఈ ప్రత్యేక సఫారిలోని ఇంజిన్ ఏదైనా ప్రత్యేకంగా ట్యూన్‌ చేయబడిందా అనేదానిపై స్పష్టత లేదు. బరువు ఆధారంగా సస్పెన్షన్‌ సెటప్‌, టైర్లు ఖచ్చితంగా అప్‌గ్రేడ్‌ చేయబడి ఉండొచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, March 2, 2024, 14:34 [IST]
English summary
Union home minister amit shah tata safari suv number plate with caa viral video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+