డిప్యూటీ సీఎంకు హైడ్రోజన్‌ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన కేంద్ర మంత్రి... ఎందుకో తెలుసా?

భారత్‌లో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను ప్రోత్సహించడంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల కొద్ది రోజుల నుంచి గడ్కరీ సరికొత్త హ్యుందాయ్‌ ఐయోనిక్‌- 5 ఎలక్ట్రిక్‌ కారులో ప్రయాణిస్తూ కనిపించారు. అంతకు ముందువరకు హైడ్రోజన్‌తో నడిచే కార్లలో ప్రయాణం చేసేవారు.

ఇటీవల Bharat NCAP - భారత్‌ న్యూ కార్ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం ప్రారంభోత్సవంలో పాల్గొ్న్న మంత్రి కొత్త హ్యుందాయ్‌లో కనిపించారు. హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ కారు కంటే హైడ్రోజన్‌తో నడిచే టయోటా మిరాయ్‌ సెడాన్‌లో ప్రయాణిస్తూ కనిపించారు. పర్యావరణ అనుకూల ఇంధన వాహనాల్లో ప్రయాణాన్ని ప్రోత్సహిస్తున్నారు.

Nitin Gadkari gifted his car to bihar Deputy CM

ఇందులో భాగంగా బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు హైడ్రోజన్‌తో నడిచే మిరాయ్‌ సెడాన్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇటీవల మిరాయ్‌ వాహనంలో ప్రయాణం చేస్తూ తేజస్వీ యాదన్‌ కనిపించారు.ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ- ICATతో పైలెట్‌ ప్రోగ్రాంలో భాగంగా టయోటా మిరాయ్‌ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ వాహనం లాంచ్‌ అయింది.

కర్ణాటకలో టయోటా ప్లాంట్‌లో రెండో తరం మిరాయ్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంప్రెస్డ్ గ్యాస్‌తో మిరాయ్‌ నడుస్తుంది. ఈ కారు అధిక పీడనం కలిగిన ఇంధన ట్యాంక్‌ ఉంటుంది. 646 కి.మీ మైలేజీని ఇస్తుంది. మిరాయ్‌ కారు హైడ్రోజన్‌ను నీరు, ఆక్సిజన్‌గా మారుస్తుంది. ఈ బ్యాటరీ సాంప్రదాయ ఎలక్ట్రిక్‌ బ్యాటరీ కంటే 30 రెట్లు చిన్నగా ఉంటుంది. హైడ్రోజన్‌, FCEV గురించి అవగాహన కల్పించేందుకు గడ్కరీ చొరవ తీసుకుంటున్నారు.

Nitin Gadkari gifted his car to bihar Deputy CM

హ్యుందాయ్‌ ఐయోనిక్‌ 5 : ఈ సంవత్సరం జనవరిలో హ్యుందాయ్‌ కొత్త ఐయోనిక్‌ 5 EV క్రాసోవర్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ కొత్త క్రాసోవర్‌ ధర రూ.44.95 లక్షల ప్రారంభ ధరను కలిగి ఉంది. ఐయోనిక్‌ 5 రెట్రో, మోడ్రన్‌ రెండింటి కలయికతో వస్తుంది. ఈ కారు ముందు భాగంలో LED హెడ్‌ల్యాంప్‌లు, వెనుకవైపు పిక్సలేటెడ్‌ LED టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది.

హ్యుందాయ్‌ ఐయోనిక్‌ 5 ఎలక్ట్రిక్‌ కారు ఒక్క పవర్‌ట్రైయిన్ ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరియు ఈ కారు ఒక్క ఎలక్ట్రిక్‌ మోటార్‌ను మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్‌ మోటార్‌ గరిష్ఠంగా 217hp మరియు 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

Nitin Gadkari gifted his car to bihar Deputy CM

ఇది 72.6kWh లిథియం అయాన్‌ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ 800v ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. మరియు కేవలం 18 నిమిషాల్లో 10% నుంచి 80% వరకు ఛార్జింగ్‌ చేయగలదు. సింగిల్‌ ఛార్జింగ్‌పై 631 కి. మీ రేంజ్‌ ఇస్తుంది. ఈ కారు వెనుక చక్రాలకు శక్తిని పంపిస్తుంది.

పెట్రోల్‌, డీజిల్‌ బదులు ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలకు మారేలా కేంద్ర రోడ్డ రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రోత్సాహం అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం కూడా ఇదేనని చెబుతున్నారు. భవిష్యత్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలదేనని, అయితే దాంతోపాటు హైడ్రోజన్‌, సీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను కూడా ప్రోత్సహించాలని గడ్కరీ ఆలోచనగా తెలుస్తోంది.

Nitin Gadkari gifted his car to bihar Deputy CM

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 27, 2023, 15:30 [IST]
English summary
Union minister nitin gadkari gives hydrogen powered toyota mirai to bihar deputy cm
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+