కోటి వాహనాల విక్రయం, 5 కోట్ల ఉద్యోగాలు.. ఎలక్ట్రిక్ వాహన రంగంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు..!
ఎలక్ర్టిక్ వాహనాల తయారీ, విక్రయం, ఈ రంగంలోని ఉద్యోగ అవకాశాలపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ( Nitin Gadkari ) కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి సుమారుగా కోటి ఎలక్ట్రిక్ వాహనాలను ( Electric Vehicles ) భారత్‌లో విక్రయించనున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా దేశంలో సుమారు 5 కోట్ల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా భారత్..! : ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా భారత్ నిలుస్తుందని గడ్కరీ ఇప్పటికే చాలా వేదికలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతోపాటు భారత్‌కు అవసరమైన వాహనాలను తయారుచేసుకొనే సామర్థ్యం దేశానికి ఉందని చెప్పారు.

34.54 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు : పెట్రోల్/ డీజిల్ ముడిచమురు దిగుమతులను తగ్గించుకొనేందుకు ప్రభుత్వం కూడా అనేక ప్రణాళికలు రచిస్తోంది. ఈ వాహనాల స్థానంలో ప్రత్యామ్నాయ వాహనాలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తనవంతు సాయం చేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు రాయితీలు అందిస్తోంది. వాహన్ పోర్టల్ సమాచారం ఆధారంగా దేశంలో ఇప్పటి వరకు 34.54 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ చేయబడ్డాయి.
ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తి మద్దతు.. ! : ప్రస్తుత కాలుష్య పరిస్థితుల నుంచి హైబ్రిడి మరియు ఎలక్ట్రిక్ వాహనాలకు మారేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని గడ్కరీ హామీ ఇచ్చారు. ప్రజారవాణా, ఎగుమతి, దిగుమతుల్లో ఉపయోగించే వాహనాలను కూడా విద్యుత్ వాహనాలుగా మార్చే లక్ష్యంతో పనిచేస్తోందని తెలుస్తోంది.

50 శాతం పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు : 2023 ఏప్రిల్ - నవంబర్ మధ్య భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు సుమారుగా 50 శాతం పెరిగాయి. ఈ మొత్తం సంఖ్యలో 56 శాతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 38 శాతం 3 వీలర్ వాహనాలున్నాయని తెలుస్తోంది. ఈ గణాంకాల ఆధారంగా ప్రస్తుతం ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అర్థం అవుతోంది.
ఈ వాహనాలపై ఆసక్తి చూపడం లేదా..? : అయితే ప్రస్తుతం భారీ మొత్తంలో చెల్లించి ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ శాతం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అయితే మౌలిక సదుపాయాలు కొరత కూడా కొంత కారణం. అయితే ఛార్జింగ్ స్టేషన్లు, నిపుణులు అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు గణనీయంగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








