నితిన్ గడ్కరీ మొదటి వాహనం అదేనట.. ఓ ఈవెంట్‌లో ఆసక్తిర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి
ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో మొదటి సైకిల్, మొదటి బైక్, మొదటి స్కూటర్, మొదటి కారు.. ఇలా ఏదో ఒక వాహనం లేదా వస్తువు ఖచ్చితంగా ఉంటుంది. ఇందుకు ప్రముఖులు కూడా తీసిపోరు. అలాగే మన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కూడా ఓ మొదటి స్కూటర్.. మధుర జ్ఞాపకమట. దాని గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఇంతకీ ఆ స్కూటర్ ఏంటి.. ఈ కథనంలో చదివేయండి..
కైనెటిక్ లూనా 1970, 80 లలో భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్. సైకిల్‌ను స్కూటర్‌కు మారాలనుకునేవారు ఈ దేశీ మోపెడ్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. అంతలా దీనిని ఆదరించేవారు.. రూరల్ ప్రాంతాల నుంచి అర్బన్ ప్రాంతాల వరకూ లూనా మోపెడ్‌ను ఇష్టపడని వారుండరు. అయితే ఇప్పుడు ఈ లూనా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మొదటి వాహనం ఇదేనట.

మార్కెట్లో తీవ్రమైన పోటీతో ఉత్పత్తి ఆగిపోయిన లూనా(Kinetic Luna).. ఇప్పుడు భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతుండటంతో ఇటీవల.. కైనెటిక్ గ్రీన్(Kinetic Green) రీ ఎంట్రీ ఇచ్చింది. కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ మోపెడ్‌ను లాంచ్ చేసింది. కాగా కైనెటిక్ eLuna ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా హాజరయ్యారు.
కైనెటిక్ ఇ-లూనా(Kinetic E-Luna) లాంచ్ కార్యక్రమంలో హాజరైన నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari).. తన గత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ క్రమంలో తన మొదటి వాహనం గురించి సమాచారాన్ని కూడా పంచుకున్నారూ. తన మొదటి వాహనం లూనానే అని గడ్కరీ చెప్పుకొచ్చారు. లూనాను చూడగానే తనకు పాత రోజులు గుర్తుకొచ్చాయని పేర్కొన్నారు.
తన తల్లి తనకు బహుమతిగా లూనాను ఇచ్చినట్లు గడ్కరీ పేర్కొన్నారు. ఈ మోపెడ్ ధర చాలా తక్కువ అని.. మెయింటెన్స్ ఖర్చులు చాలా తగ్గిస్తుందని చెప్పారు. అందుకే ఆ కాలంలో లూనా చాలా మందికి ఫేవరెట్‌గా మారిందని, అందుకే తన తల్లి తనకోసం కొనుగోలు చేసిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కైనెటిక్ ఎనర్జీ ఇ లూనాను లాంచ్ చేయడం సంతోషకరమన్నారు.
కైనెటిక్ ఇ-లూనా(Kinetic E-Luna Launch) మార్కెట్లో రెండు వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. మార్కెట్లో ఈ మోపెడ్ ధర రూ. 69,990 నుంచి రూ. 75 వేల వరకు ధరలకు విక్రయానికి అందుబాటులో ఉంచింది. ఇ లూనా గరిష్ఠంగా గంటకు 50 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 2.2 kW మోటార్‌ను ఉపయోగించారు.
బ్యాటరీ ప్యాక్(Kinetic) విషయానికొస్తే ఇ-లూనా 1.2 kWh, 2 kWh మరియు 3 kWh ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. కాగా బ్యాటరీ ప్యాక్ ప్రకారం ఇ-లూనా 110 కి.మీ నుంచి 150 కి.మీ వరకు రేంజ్‌ను అందిస్తుంది. అయితే కిలోమీటరుకు 10 పైసలు మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ వెల్లడించింది. ఇ లూనాను ఫ్యామిలీ వాహనంగానే కాకుండా కార్గో అవసరాలకు కూడా ఉపయోగించవచ్చని సంస్థ తెలిపింది.
టెక్నాలజీ ఫీచర్ల పరంగా కూడా ఇ-లూనా ఎందులోనూ తీసిపోలేదు. ఇందులో పెద్ద డిజిటల్ స్క్రీన్, USB ఛార్జింగ్ పోర్ట్, టెలిస్కోపిక్ ఫోర్క్, 16-అంగుళాల వైర్ స్పోక్ వీల్స్ మరియు కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. రైడర్ విభిన్నం రైడింగ్ అనుభూతిని పొందేందుకు ఇందులో మూడు వేర్వేరు మోడ్‌లు అందించింది.


Click it and Unblock the Notifications








