ఇంధన ధరలు పెరగడానికి అదే కారణం అన్న కేంద్ర మంత్రి.. మండిపడుతున్న ప్రజానీకం.. ఇంతకీ ఏమన్నారంటే?

భారతదేశంలో రోజురోజుకి ఇంధన (పెట్రోల్ మరియు డీజిల్) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమాంతం పెరుగుతున్న ఈ ఇంధన ధరలు సామాన్య మానవుడిపై పెనుభారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే భారతదేశంలో దాదాపు చాలా నరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు 100 రూపాయలు దాటేసింది. ప్రస్తుతం ఒక లీటరు పెట్రోల్ ధర రూ. 110 వద్ద మరియు డీజిల్ ధర రూ. 100 వద్ద ఉన్నాయి.

ఇంధన ధరలు పెరగడానికి అదే కారణం అన్న కేంద్ర మంత్రి.. మండిపడుతున్న ప్రజానీకం.. ఇంతకీ ఏమన్నారంటే?

భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు గత మూడు వారాల్లో దాదాపు 15 రెట్లు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంధన దరల పెరుగుదలకు అనేక కారణాలున్నాయి. ఇందులో ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు పెరగడం, ఒపెక్ దేశాలు తక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం మరియు భారతదేశంలో ఇంధనాలపై విధిస్తున్న వివిధ పన్నులు.

ఇంధన ధరలు పెరగడానికి అదే కారణం అన్న కేంద్ర మంత్రి.. మండిపడుతున్న ప్రజానీకం.. ఇంతకీ ఏమన్నారంటే?

అయితే ఇటీవల ఒక కేంద్ర మంత్రి భారతదేశంలో ఇంధన ధరలు పెరుగుదలకు ప్రధాన కారణం 'కోవిడ్ -19 వ్యాక్సిన్ దేశ ప్రజలకు ఉచితంగా ఇవ్వడం' అని తెలిపారు. కేంద్ర మంత్రి చేసిన ఈ ప్రకటన సామాన్య ప్రజలను సైతం రెచ్చగొట్టింది. ప్రజలు ఈప్రకటన వల్ల ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంధన ధరలు పెరగడానికి అదే కారణం అన్న కేంద్ర మంత్రి.. మండిపడుతున్న ప్రజానీకం.. ఇంతకీ ఏమన్నారంటే?

కేంద్ర పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ శాఖా మంత్రి రామేశ్వర తేలి ఒక ప్రకటనలో, దేశంలో ఉచిత కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచుతోంది, అని తెలిపారు. అంతే కాకుండా ఇంధన ధరలు ఎక్కువగా లేవని, కానీ వాటిపై విధించే పన్నులు ఎక్కువగా ఉన్నాయన్నారు.

ఇంధన ధరలు పెరగడానికి అదే కారణం అన్న కేంద్ర మంత్రి.. మండిపడుతున్న ప్రజానీకం.. ఇంతకీ ఏమన్నారంటే?

కరోనా మహమ్మారి భారతదేశంలో అధికంగా విజృంభించిన సమయంలో, ఈ మహమ్మారి నివారణకు దేశంలోని ప్రతి పౌరుడికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి. కావున వ్యాక్సిన్ కోసం డబ్బు ఎక్కడ నుండి వస్తుంది..? అందుకే ఇంధనాల ధరలు ఈ విధంగా పెరుగుతున్నాయన్నారు.

ఇంధన ధరలు పెరగడానికి అదే కారణం అన్న కేంద్ర మంత్రి.. మండిపడుతున్న ప్రజానీకం.. ఇంతకీ ఏమన్నారంటే?

కేంద్ర మంత్రి రామేశ్వర తేలి అస్సాంలోని దిబ్రుగర్ లోక్ సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. భారతదేశంలో 130 కోట్ల మందికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలి, కావున ప్రభుత్వానికి దానికయ్యే ఖర్చుకిగాను ఇంధన ధరలు పెరిగాయని తెలియజేయడంతో, ప్రజలు ఈ వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంధన ధరలు పెరగడానికి అదే కారణం అన్న కేంద్ర మంత్రి.. మండిపడుతున్న ప్రజానీకం.. ఇంతకీ ఏమన్నారంటే?

అంతే కాకుండా, ఇంధన ధరలను ప్యాకేజ్డ్ తాగునీటితో పోల్చారు. మీరు నాణ్యమైన ప్యాక్ చేయబడిన నీటిని తాగాలనుకుంటే మీరు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు, పెట్రోల్ మరియు డీజిల్ పరిస్థితి కూడా అలా ఉంది, అని ఆయన స్పష్టం చేశారు.

ఇంధన ధరలు పెరగడానికి అదే కారణం అన్న కేంద్ర మంత్రి.. మండిపడుతున్న ప్రజానీకం.. ఇంతకీ ఏమన్నారంటే?

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం మరియు హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు భారతదేశంలో ఇంధనం (పెట్రోల్ మరియు డీజిల్) ధరలను మామూలుగా సవరించుకుంటాయి. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధర మరియు డాలర్ మారకం రేటుపై ఆధారపడి ఉంటాయి.

ఇంధన ధరలు పెరగడానికి అదే కారణం అన్న కేంద్ర మంత్రి.. మండిపడుతున్న ప్రజానీకం.. ఇంతకీ ఏమన్నారంటే?

కొత్త చమురు ధరలు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు అమలులోకి వస్తాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు సెప్టెంబర్ 24 నుండి డీజిల్ ధరలను మరియు సెప్టెంబర్ 28 నుండి పెట్రోల్ ధరలను పెంచుతున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్‌పై అధిక పన్నులు వాటి ధరలను పెంచడానికి కారణమవుతోంది.

ఇంధన ధరలు పెరగడానికి అదే కారణం అన్న కేంద్ర మంత్రి.. మండిపడుతున్న ప్రజానీకం.. ఇంతకీ ఏమన్నారంటే?

పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన వ్యాట్, డీలర్ కమిషన్ మరియు సరుకు ఛార్జీలు వంటివి కూడా ఇంధన ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. గత రెండేళ్లలో ఇంధనంపై ఎక్సైజ్ టాక్స్ గణనీయంగా పెరిగింది. ఇది కూడా ఇంధనాల ధరను నిరంతర పెంచడానికి దారితీసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అనేక నగరాల్లో మొదటిసారిగా పెట్రోల్ ధర రూ. 100 దాటింది.

ఇంధన ధరలు పెరగడానికి అదే కారణం అన్న కేంద్ర మంత్రి.. మండిపడుతున్న ప్రజానీకం.. ఇంతకీ ఏమన్నారంటే?

ఇంధన ధరలు GST పరిధిలోకి వస్తే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు గణనీయంగా తగ్గుతాయి. కానీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలను GST పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నాయి, ఎందుకంటే ఇంధన ధరలను GST పరిధిలోకి ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గుతుందని ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీనితో పాటు ఇంధనంపై ఎక్సైజ్ టాక్స్ తగ్గించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇంధన ధరలు పెరగడానికి అదే కారణం అన్న కేంద్ర మంత్రి.. మండిపడుతున్న ప్రజానీకం.. ఇంతకీ ఏమన్నారంటే?

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్న దేశాల్లో, భారతదేశం ఒకటి. ఈ ధరల పెరుగుదల అధిక పన్నుల కారణంగానే పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలను నిరసిస్తూ దేశంలో అనేక విచిత్ర సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగానే పెళ్లిళ్లు మరియు ఇతర శుభ సందర్భాలలో పెట్రోల్ లేదా డీజిల్ బహుమతులు అందించే సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఏదిఏమైనా ఈ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు భవిష్యత్ లో కూడా ఏమాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈకారణంగానే వాహన కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

Most Read Articles

English summary
Union minister says fuel prices are hiked to give free vaccines details
Story first published: Monday, October 18, 2021, 11:22 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X