అలెర్ట్.. ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు తప్పనిసరికాడు, అయితే కొన్ని వాటికి ఇప్పటికి ఆధార్ కార్డు తప్పనిసరి. కొన్ని సర్వీసులను ఉపయోగించుకోవడానికి ఇప్పటికి ఆధార్ కార్డు అవసరం. ప్రభుత్వ గ్రాంట్లు మరియు కొన్ని ఇతర సర్వీసులకు కూడా ఆధార్ కార్డు చాలా అవసరం, అంతే కాదు తప్పనిసరి కూడా.

ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

వాహనాలు డ్రైవ్ చేయాడానికి డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరం కావున, ఇప్పుడు ఈ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో, కేంద్ర రహదారి రవాణా శాఖ తన అన్ని సర్వీసులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది.

ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

ఇది ఆన్‌లైన్‌లో సర్వీస్ ఉపయోగించుకునే వారికీ మాత్రమే తప్పనిసరి చేయడం జరిగింది. ఇందులో ప్రత్యక్షంగా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునేవారికి ఆధార్ కార్డు అవసరం లేదు అని, కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆర్టీఓ కార్యాలయాలు అందించే ఆన్‌లైన్ సర్వీసులకు ఆధార్ కార్డు తప్పనిసరి.

MOST READ:ఈ రిక్షా కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన సుప్రీమ్ కోర్టు

ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

రవాణా శాఖ డైరెక్ట్ కనెక్టివిటీ లేకుండా ఆన్‌లైన్‌లో ప్రస్తుతం 16 వేర్వేరు సర్వేసులను అందిస్తుంది. ఇందులో రవాణా శాఖ ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, అడ్రస్ చేంజ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు లర్నింగ్ లైసెన్సింగ్‌ వంటి సర్వీసులు ఉన్నాయి.

ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

ఈ ఆన్‌లైన్‌ సర్వీసులన్నీ వినియోగించుకోవడానికి వినియోగదారునికి ఆధార్ కార్డు తప్పనిసరి అని రవాణా శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ లో ఎలాంటి మోసాలు జరగకుండా ఉండటానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేయబడిందని చెబుతున్నారు.

MOST READ:ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్ ఇవే, చూసారా..?

ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

ఆధార్ కార్డు లేనివారు లేదా ఆధార్ కార్డు సమర్పించడానికి ఇష్టపడని వినియోగదారులు స్వయంగా ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లి ఈ సర్వీస్ వినియోగించుకోవచ్చని వారు సూచించారు. ఈ విధంగా సర్వీస్ ఉపయోగించుకునే వారికి ఆధార్ కార్డు అవసరం లేదు.

ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

ప్రభుత్వ ఆన్‌లైన్ సేవను ఉపయోగించే చాలా మంది ప్రజలు నకిలీ డాక్యుమెంట్స్ తో అప్లై చేస్తున్నట్లు తెలిసింది. ఈ అక్రమ మార్గాలను నివారించడానికి ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల సదరు వినియోగదారుని పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.

MOST READ:ఇలా చేస్తే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందటం వెరీ సింపుల్

ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

మోటార్ వాహన చట్టం ప్రకారం వాహనదారులు తప్పకుండా కొన్ని రూల్స్ పాటించాలి. ఇందులో భాగంగానే వాహనదారుడు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అప్పుడే అతడు చట్ట రీత్యా డ్రైవింగ్ చేయడానికి అర్హుడు. కావున వాహనాదాలు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి.

Most Read Articles

English summary
Union Transport Ministry Mandates Aadhar Card For Its Online Services. Read in Telugu.
Story first published: Wednesday, February 10, 2021, 9:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X