టేకాఫ్‌ అయిన కాసేపటికే ఊడిన విమానం టైర్‌.. కింద ఉన్న కార్లు ధ్వంసం.. వైరల్‌ వీడియో చూసేయండి.!!

టేకాఫ్ అయిన కాసేపటికే విమాన టైర్(Flight Tyre) ఊడిన సంఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. టేకాఫ్‌ అయిన కాసేపటికే విమానం టైర్‌ ఊడిపోవడం ఏంటి అనుకుంటున్నారా.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..

విమానాలు, విమానాశ్రయాలకు సంబంధించిన ఇటీవల పలు సంఘటనలు చక్కర్లు కొడుతున్నాయి. టేకాఫ్‌ అయిన కాసేపటికే సాంకేతిక కారణాల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అవ్వడం, విమానం గాల్లో ఉండగానే డోర్లు ఊడిపోవడం, సీట్ల పై నుంచి నీరు కారడం లాంటి సందర్భాలు చోటుచేసుకున్నాయి. అంతే కాకుండా విమానంలో బాంబు కలకలం, ఫ్లైట్‌లో ప్రయాణికుల మధ్య గొడవలు లాంటివి నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి.

Boeing-Flight-Tyre-Falls-Off-After-Take-Off

సోషల్‌ మీడియా పుణ్యమా అని జాతీయ, అంతర్జాతీయ విమానాలు, ఎయిర్‌పోర్టులకు సంబంధించి ఆసక్తికర సంఘటనలు, వైరల్‌ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. అంతేకాకుండా ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో నేలపైనే ప్రయాణికులు భోజనాలు చేసిన సందర్భాలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఇలాంటి సంఘటనల కారణంగా విమానయాన సంస్థలు ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఈ కారణంగా డీజీసీఏ సైతం.. సదరు సంస్థలకు భారీగా జరిమానాలు విధిస్తోంది. కాగా ఇటీవల చలికాలంలో పొగమంచు కారణంగా చాలా వరకు ఫ్లైట్లు లేటవ్వడం లేదా క్యాన్సిల్‌ అవ్వడం జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇప్పుడు విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే టైర్‌ ఊడిపోవడం ప్రయాణికులను, నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Boeing-Flight-Tyre-Falls-Off-After-Take-Off

గురువారం నాడు(మార్చి 7, 2024) జపాన్‌కు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్(Boeing 777- 200 Flight) జెట్ విమానం శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్‌ నుంచి జపాన్‌లోని ఒకాసాకు బయల్దేరింది. 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందితో ఈ విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఫ్లైట్‌ టేకాఫ్‌ అయిన కాసేపటికే టైర్ ఊడిపోయింది.

ఫ్లైట్‌ టైర్‌ ఊడిపోతున్న వీడియోను కొందరు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అయితే ఇక్కడే ఓ హఠాత్పరిణామం చోటుచేసుకుంది. శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్‌లో విమానం టేకాఫ్‌ అయిన వెంటనే టైర్ ఊడిపోగా.. ఆ టైర్‌ ఉద్యోగుల పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న కార్లపై పడింది. దీంతో కారు వెనక ఉన్న అద్దం ధ్వంసం కావడంతో.. అక్కడున్న వారు షాక్‌కు గురయ్యారు.

Boeing-Flight-Tyre-Falls-Off-After-Take-Off

దీంతో వెంటనే తేరుకున్న ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది.. ఆ విమానాన్ని వెంటనే లాస్ ఏంజెల్స్‌లో సురక్షితంగా ల్యాండింగ్‌ చేశారు. విమానంలో సమస్య తలెత్తడంతో ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చానట్లు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. ఈ సంఘటన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 777-200 లో చోటుచేసుకుంది. ఈ విమానాన్ని 2002లో ఏవియేషన్ సంస్థ రూపొందించింది.

కాగా బోయింగ్‌ 777 విమానాలను సంస్థ అత్యంత పకడ్బందీగా రూపొందించింది. ఈ విమానాల్లో రెండు ల్యాండింగ్‌ గేర్లకు ఆరు చొప్పున టైర్లను అమర్చుతారు. ఒకవేళ ఈ టైర్లు డ్యామేజ్‌ అయినా, ఊడిపోయినా.. ల్యాండింగ్‌ సురక్షితంగా అయ్యేలా దీనిని సంస్థ డిజైన్‌ చేసింది. ఈ నేపథ్యంలో తాజా ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణ చేపడుతుంది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 9, 2024, 9:10 [IST]
English summary
United airlines boeing flight tyre falls off after take off and damaged a car video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+