రూ. 1.26 కోట్ల రూపాలకు అమ్ముడైన 118 సంవత్సరాల పాత వెహికల్ నెంబర్.. ఎందుకో తెలుసా

సాధారణంగా వాహనాలు మాత్రమే ఖరీదైనవి అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి వాహనాలకు వేసే నెంబర్ ప్లేట్స్ కూడా చాల ఖరీదైనవే. ఇటీవల కాలంలో ఇలాంటి వాటికీ సంబంధించిన కథనాలు ఇదివరకే ప్రచురించబడ్డాయి. ఇదే నేపథ్యంలో ఇప్పుడు మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

రూ. 1.26 కోట్ల రూపాలకు అమ్ముడైన 118 సంవత్సరాల పాత వెహికల్ నెంబర్.. ఎందుకో తెలుసా

ఈ రోజుల్లో చాలా లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తున్నట్లు చాలా నంబర్ ప్లేట్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల బ్రిటన్ లో లో ఒక నంబర్ ప్లేట్‌ను 1,28,800 పౌండ్లకు వేలం వేయడం జరిగింది. ఇది భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ. 1.26 కోట్లు.

రూ. 1.26 కోట్ల రూపాలకు అమ్ముడైన 118 సంవత్సరాల పాత వెహికల్ నెంబర్.. ఎందుకో తెలుసా

ఈ నంబర్ ప్లేట్ కోట్లలో అమ్ముడవ్వడానికి అతి పెద్ద కారణం ఏమిటంటే, ఈ ప్లేట్ 1902 కి సంబంధించినది. 118 సంవత్సరాల వయస్సు గల ఈ నంబర్ ప్లేట్ 1902 లో బర్మింగ్‌హామ్‌కు చెందిన చార్లెస్ టామ్సన్‌కు జారీ చేయబడింది. ఆ సమయంలో బ్రిటన్‌లో కొద్ది మందికి మాత్రమే కారు ఉపయోగించేవారు. 1955 లో చార్లెస్ గతించిన తర్వాత ఈ నెంబర్ ని బ్యారీ టామ్సన్ కి ఇచ్చారు.

MOST READ:రోడ్డెక్కనున్న కొత్త డబుల్ డెక్కర్ బస్సులు.. ఎక్కడో తెలుసా..!

రూ. 1.26 కోట్ల రూపాలకు అమ్ముడైన 118 సంవత్సరాల పాత వెహికల్ నెంబర్.. ఎందుకో తెలుసా

బ్యారీ టామ్సన్ ఈ నెంబర్ ని జాగ్వార్, ఆస్టిన్ మార్టిన్, మినీ మరియు ఫోర్డ్ కార్లలో ఉపయోగించారు. 2017 లో బ్యారీ టామ్సన్ మరణించిన తరువాత, ఈ నెంబర్ తప్పిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత బ్రిటీష్ బిడ్డింగ్ సంస్థ సిల్వర్‌స్టోన్ వేలం ఈ సంఖ్యను వేలం వేసే హక్కులను కొనుగోలు చేసింది.

రూ. 1.26 కోట్ల రూపాలకు అమ్ముడైన 118 సంవత్సరాల పాత వెహికల్ నెంబర్.. ఎందుకో తెలుసా

ఇటీవల జరిగిన వేలంలో ఈ నంబర్ ప్లేట్ ధరను రూ. 1.26 కోట్లుగా నిర్ణయించబడింది. అయితే ఈ నంబర్ కొనుగోలుదారు గురించి సమాచారాన్ని కంపెనీ రహస్యంగా ఉంచుతుంది.

MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు

రూ. 1.26 కోట్ల రూపాలకు అమ్ముడైన 118 సంవత్సరాల పాత వెహికల్ నెంబర్.. ఎందుకో తెలుసా

కోట్ల రూపాయల్లో ఈ సంఖ్యను వేలం వేసినట్లు ఇంటర్నెట్‌లో వార్తలు రావడంతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. ఇంత ఖరీదైన ధరకు నంబర్ ప్లేట్ కొనడం పిచ్చి అని చాలా మంది అంటున్నారు. అదే సమయంలో, ఇది డబ్బు వృధా అని కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

రూ. 1.26 కోట్ల రూపాలకు అమ్ముడైన 118 సంవత్సరాల పాత వెహికల్ నెంబర్.. ఎందుకో తెలుసా

ఈ నెంబర్ ప్లేట్స్ కొనే ధరతో చాలా లగ్జరీ కార్లను కొనుగోలు చేయవచ్చని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు తెలిపారు. ఈ నెంబర్ ప్లేట్ వ్యవస్థాపించిన కారుకు వేరే గుర్తింపును ఇస్తుందనే వాస్తవాన్ని కొంతమంది వేళలో నెంబర్ ప్లేట్ సొంతం చేసుకున్న వ్యక్తికి మద్దతు పలికారు. ఈ నంబర్ ప్లేట్‌ను మళ్లీ అధిక ధరకు వేలం వేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా వాహనప్రియుల తమ వాహనాలు ప్రత్యేకంగా కనిపించడానికి ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు అనటానికి ఇది నిలువెత్తు నిదర్శనం.

MOST READ:అద్భుతంగా ఉన్న గాజు ముక్కలతో డెకరేట్ చేసిన వోక్స్‌వ్యాగన్ కారు.. చూసారా..!

NOTE : ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

Most Read Articles

English summary
United Kingdom: Man Pays Rs 1.26 Crore To Get Special License Plate. Read in Telugu.
Story first published: Tuesday, November 17, 2020, 17:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X