పాల్‌కు నివాళిగా 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7' నిలిపివేత
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ చిత్రాలతో అత్యంత పాపులారిటీని దక్కించుకున్న హాలీవుడ్ నటుడు పాల్ వాకర్ (Paul Walker) గడచిన శనివారం ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, పాల్ వాకర్‌కు నివాళిగా యూనివర్సల్ పిక్చర్స్ (ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాన్ని నిర్మిస్తున్న సంస్థ) తమ 7వ ఎడిషన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్ర షూటింగ్‌ను కొంత కాలం పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా, పాల్ వాకర్ జ్ఞాపకార్థం యూనివర్సల్ పిక్చర్స్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7కు సంబంధించిన ఓ వీడియోను కూడా యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ వీడియోను ఇప్పటికే 1.62 కోట్లకు పైగా అభిమానులు వీక్షించారు. ఫిలీప్పిన్స్ తుపాను బాధితులకు సాయం చేయటం కోసం నిధుల సేకరణకు శాంతా క్లారిటాలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పాల్ వాకర్ మరణించాడు.
పాల్ వాకర్‌ను గుర్తు చేస్తూ యూనివర్స్ పిక్చర్స్ విడుదల చేసిన ఆ వీడియోని మనం కూడా వీక్షిద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/o8UCI7r1Aqw?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








