బీచ్‌కు కొట్టుకొచ్చిన భారీ వస్తువు.. చంద్రయాన్-3కు సంబంధించినదా..?
పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌కు భారీ వస్తువు కొట్టుకువచ్చింది. అయితే జులై 14 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్3కు సంబంధించినదిగా కొన్ని పుకార్లు వస్తున్నాయి. దీనిపై ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ స్పందించింది.
ఈ వస్తువు వివరాలను కొనుగొనే ప్రయత్నంలో ఉన్నామని చెప్పింది. విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనానికి సంబంధించినది కావచ్చని భావిస్తున్నామని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. వస్తువు యొక్క పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఇతర దేశాల స్పేస్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నట్లు వెల్లడించింది.

గుర్తు తెలియని వస్తువు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆస్ట్రేలియా ప్రజలను ఆ దేశం సూచించింది. పూర్తి సమాచారం ఇంకా తెలియలేదని, ఆ వస్తువును తరలిచేందుకు ఎవరూ ప్రయత్నాలు చేయవద్దని సూచించింది. బీచ్ సమీపంలో మరే ఇతర అనుమానిత వస్తువులను గుర్తించినా అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరింది.
బీచ్‌కు కొట్టుకువచ్చిన వస్తువు సిలిండర్ ఆకారంలో ఉందని మరియు 2.5 మీటర్ల వెడల్పు, 2.5 నుంచి 3 మీటర్ల వరకు పొడవు ఉంటుందని తెలుస్తోంది. ఈ వస్తువును చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది దానిని చంద్రయాన్3కు సంబంధించినది చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా శ్రీహరి కోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి జులై 14 మధ్యాహ్నం 2.35 నిమిషాలకు చంద్రయాన్3ను ఇస్రో ప్రయోగించింది. ఆగస్టు 23 లేదా 24వ తేదీల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపైన సాఫ్ట్ ల్యాండింగ్ చేసేలా సర్వం సిద్ధం చేసింది. చంద్రుని మీద విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి, అందులోని ప్రజ్ఞాన్ రోవర్ ఆధారంగా 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేయాలని ఇస్రో భావిస్తోంది.
చంద్రుడిపై ప్రయోగాలను 2008లో భారత్ ప్రారంభించింది. అప్పట్లో చంద్రయాన్-1ను ప్రయోగించింది. అందులో భాగంగా ప్రయోగించిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడిని నీరు ఉనికి ఉందని తొలిసారిగా కనుగొంది. అనంతరం చంద్రుడి మీదకు ల్యాండర్ దించి చంద్రుని దక్షిణ ద్రువం పైన పరిశోధనలు చేయాలనేది చంద్రయాన్ మిషన్ ముఖ్య ఉద్దేశం.
ఇందుకోసం 2019 జులై 22న చంద్రయాన్-2ను ఇస్రో ప్రయోగించింది. ఇందులో భాగంగా ల్యాండర్, రోవర్‌ను చంద్రుడిపై సురక్షితంగా ల్యాండింగ్ చేయాలన్నది ఇస్రో ఆలోచన. అయితే అనుకున్న విధంగానే ఆర్పిటర్ విడిపోయింది. చంద్రుడిని కేవలం 2 కిలోమీటర్ల ఎత్తులో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లో సమస్య తలెత్తింది. ఫలితంగా అత్యంత వేగంగా ఈ రెండు చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టాయి.
చంద్రుని ఉపరితలంపైకి ఇప్పటికే అమెరికా, చైనా, రష్యా తమ ల్యాండర్లను పంపాయి. కానీ ఇప్పటివరకు ఎవరూ వెళ్లని చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దించి, అక్కడ కీలక పరిశోధనలు చేయాలని ఇస్రో లక్ష్యంగా పనిచేస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై సూర్యకాంతి పడని ఎన్నో ప్రాంతాలున్నాయని ఇస్రో భావిస్తోంది. అక్కడ ప్రయోగాలు నిర్వహించి విశ్వం పుట్టుగ రహస్యాలు, భవిష్యత్‌లో చంద్రుడిపై మానవులు నివసించేందుకు గల అవకాశాలపై ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకుంది.


Click it and Unblock the Notifications








