వీడియో: రోజు బాగోలేకపోతే అంతే.. ట్రాక్టర్ డ్రైవర్ ఇక్కట్లు..!

ఒక్కోసారి రోడ్డుపై జరిగే చిన్న చిన్న ప్రమాదాలు, వాటిని అడ్డుకునేందుకు కొందరు చేసే ప్రయత్నాలు నవ్వు పుట్టించేవిగా ఉంటాయి. ఊహించని పరిణామం ఏర్పడినప్పుడు, కంగారులో అవగాహన రాహిత్యం కోల్పోయిన వారు చేసే ప్రయత్నాలు విచిత్రంగా ఉంటాయి. ఇదిగో ఈ వీడియో చూడండి. ఈ ట్రాక్టర్ డ్రైవర్‌కు నిజంగా నిద్ర లేచిన సమయం బాగోలేదో ఏమో తెలియదు కానీ, అతని పరిస్థితి మాత్రం చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా మారింది.

ఓ అన్‌లక్కీ ట్రాక్టర్ డ్రైవర్ రోడ్డుపై వెళ్తుండగా తన ట్రాక్టర్ ట్రైలర్ (ట్రక్కు లాంటింది) ఊడిపోయి, ఎత్తుగా ఉన్న రోడ్డు నుంచి వెనక్కు దొర్లిపోయింది. ఆ ట్రక్కును దొర్లిపోకుండా పట్టుకోవాలనే ప్రయత్నంలో సదరు ట్రాక్టర్ డ్రైవర్ రన్నింగ్‌లో ఉన్న ట్రాక్టర్‌ను అలానే వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి ట్రాక్టర్ ట్రక్కును పట్టుకునే ప్రయత్నం చేశాడు.

ఈ ప్రయత్నంలో సదరు ట్రాక్టర్ డ్రైవర్ రోడ్డుపై కాలికో ఏదో తట్టుకొని క్రింద పడిపోయాడు. ఈ లోపు ట్రక్కు నేరుగా దొర్లుకుంటూ వచ్చే రోడ్డుకు పక్కగా పార్క్ చేసి ఉన్న మోటార్‌సైకిళ్లు, కారుపై దూసుకొచ్చి వాహనాలకు డ్యామేజ్ చేసింది. ఇదిలా ఉంటే, కంగారులో సదరు డ్రైవర్ వదిలేసి వచ్చిన ట్రాక్టర్ కూడా వెనక్కు దొర్లుకుంటూ వచ్చి ట్రక్కును గుద్దుకోవటంతో నష్టం మరింత పెద్దదైంది.

మరి ఆ సరదా వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/j4ywZkY084E?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Monday, March 24, 2014, 10:37 [IST]
English summary
We have here a tractor driver who loses his trailer, falls face down on the ground trying to recover it, only to find that his unlucky streak has not ended yet. The tractor follows suit, ending with both the trailer and the tractor crashing into parked vehicles, leaving behind a frustrated and limping driver.&#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+