డర్టీ కార్ ఆర్టిస్ట్ స్కాడ్ వాడే డిజైన్ చేసిన చి(సి)త్రాలు చూశారా?
కారు అద్దాలపై దుమ్మ పడితే మనం ఏం చేస్తాం.. ఆ.. ఏంచేస్తాం. మహా అయితే క్లీన్ చేస్తాం. లేదంటే సరదాగా దానిపై వేలితో పిచ్చిరాతలు రాస్తాం. అంతేకదా..! కానీ ఈయన మాత్రం అలా చేయడు. దుమ్ము పట్టి కార్ల అద్దాలపై అద్భుతమైన కళాఖండాలను గీసేస్తాడు ఈ స్కాట్ వాడే (Scott Wade).
ఒకవేళ కార్లపై దుమ్ము లేకపోయిన సరే, ప్రత్యేకంగా వాటిపై దుమ్ము చల్లి మరీ అద్భుతమైన చిత్రాలు గీస్తుంటాడీయన. స్కాడ్ వాడేను అందరూ ముద్దుగా 'డా విన్సీ ఆఫ్ డస్ట్' అని, 'మిచెల్ఏంజిలో ఆఫ్ మడ్' అని పిలుస్తుంటారు. ఎక్కువగా ఈయనను 'డర్టీ కార్ ఆర్టిస్ట్' (దమ్ముతో ఆర్ట్ చేస్తాడు కాబట్టి) అని కూడా పిలుస్తుంటారు.
స్కాడ్ వాడే చిన్నప్పుడు అందరు పిల్లల మాదిరిగానే దుమ్మ పడిన కార్లపై పిచ్చిరాతలు, చెత్త బొమ్మలు వేస్తుండే వాడు. అదే అతని జీవనాధారం అవుతుందని స్కాట్‌కు అప్పట్లో తెలియదు. ఇప్పుడు ఈ డర్టీ కార్ ఆర్ట్‌లో స్కాట్ ప్రపంచ ప్రసిద్ధి గాంచాడు. దుమ్ము పట్టిన కార్లను మొబైల్ ఆర్ట్ గ్యాలరీలుగా మార్చేస్తుంటాడు.
ఈరోజు ఈ కథనంలో స్కాట్ వాడే సృష్టించిన కొన్ని అద్భుత కళాఖండాల గురించి, కార్ డర్టీ ఆర్ట్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి. మరి ఆలస్యమెందుకు ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి (చివరి స్లైడ్‌లో వీడియోని వీక్షించడం మర్చిపోకండి).

స్కాట్ వాడే చేతిలో రూపుదిద్దుకున్న అంకుల్ ఆల్బెర్ట్ (Uncle Albert) డర్టీ కార్ ఆర్ట్.

స్కాట్ వాడే స్టయిల్‌లో రూపుదిద్దుకున్న మోనా లీసా (Mona Lisa) డర్టీ కార్ ఆర్ట్.

బ్రష్‌తో డర్డీ కార్ ఆర్ట్‌ను రూపొందించేందుకు సిద్ధంగా ఉన్న స్కాడ్ వాడే.

ఫొటోను చూసి కాపీ కొడుతున్న స్కాడ్ వాడే.

స్కాట్ వాడే కేవలం ప్రముఖ చిత్రాలను కాకుండా వ్యంగ్య చిత్రాలను (కార్టూన్) కూడా డిజైన్ చేస్తాడు.

ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు రోనాల్డిన్హో (Ronaldinho).

మిత్సుబిషి కోల్ట్ కారు ప్రకటన.

నక్కమనిషి, ఈజిప్ట్ మమ్మీ.

అడవిలో జింకలు.

పెంపుడు జంతువుల పండుగ.

వీనస్ జననం (ది బర్త్ ఆఫ్ వీనస్).

కారులో చిక్కుకున్నాడు.. రక్షించండి.

శాంటా క్లాజ్ (హ్యాపీ హాలిడే).

శునకాల పేకాట క్లబ్.

స్కాట్ వాడే డిజైన్ చేసిన మరో అద్భుత చిత్రం
వీడియో
తన డర్టీ కార్ ఆర్ట్ గురించి స్కాట్ వాడే ఏమంటున్నాడో ఈ వీడియోలో మీరే చూడండి.
Photos: Scott Wade


Click it and Unblock the Notifications








