Just In
- 11 hrs ago
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- 11 hrs ago
సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వస్తుందా..?
- 13 hrs ago
2020 ఇండియన్ నేషనల్ మోటార్‌సైకిల్ డ్రాగ్ ఛాంపియన్షిప్ విజేతగా హేమంత్ ముద్దప్ప
- 14 hrs ago
భారత్‌కు హ్యుందాయ్ 'ఎన్-లైన్' పెర్ఫార్మెన్స్ కార్లు వస్తున్నాయ్..
Don't Miss
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Movies
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగిస్తే 10000 జరిమానా; ఎక్కడో తెలుసా
భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం దీనికి ప్రధాన కారణం. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య తక్కువగా లేదు.

కరోనా లాక్ డౌన్ సమయంలో దేశంలోని దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోడ్లు ఖాళీగా ఉండటం వల్ల ట్రాఫిక్ పరిమితం చేయబడింది. ఇదే సమయంలో కొంతమంది వాహనదారులు ఖాళీ రహదారులపై విపరీతమైన వేగంతో ప్రయాణిస్తున్నారు. దీంతో లాక్డౌన్ కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య యధావిధిగా పెరిగింది.

కరోనా వైరస్ డ్యూటీలో బిజీగా ఉన్న పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి పెద్దగా ఆంక్షలువిధించే అవకాశం ఉండదు. ఈ కారణంగానే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఎక్కువగా ఉల్లంఘిస్తున్నారు.
MOST READ:జెసిబి ప్రమాదంలో బైకర్ ప్రాణాలు కాపాడిన మహీంద్రా బొలెరో; ఎలాగో తెలుసా ?

కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడంతో పోలీసులపై ఒత్తిడి మరింత పెరిగిపోతొంది. ఈ కారణంగా వారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం మళ్ళీ ప్రారంభించారు.

డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్న వారిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడే వారికి పోలీసులకు రూ. 10 వేల జరిమానా విధించారు.
MOST READ:దొంగిలించిన ఎటిఎం కార్డు పాస్వర్డ్ అడగడానికి వచ్చిన దొంగ ; తర్వాత ఎం జరిగిందో తెలుసా !

మొదటిసారి పట్టుబడితే వారికి రూ. 1,000 జరిమానా విధించబడుతుంది. రెండోసారి పట్టుబడితే వారికి పదివేల రూపాయల జరిమానా విధించబడుతుంది. అదనంగా అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ ఆదేశించింది.

భారతదేశంలో పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఒక ప్రధాన కారణం. మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల అధిక సంఖ్యలో ప్రమాదాలు జరగడం దీనికి కారణం అవుతుంది.
MOST READ:ఎలక్ట్రిక్ కారుకి పెట్రోల్ నింపడానికి ట్రై చేసిన వ్యక్తి : ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

ఈ కారణంగా ఈ విధమైన ఉల్లంఘనలకు భారీగా జరిమానాలు విధించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. భారీ జరిమానాలు విధించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అదనంగా ఆర్థిక సంక్షోభం కూడా ఎదుర్కొంటుంది. అటువంటి పరిస్థితిలో ఇంత మొత్తంలో జరిమానా విధించడం అనేది సరైన నిర్ణయమేనా అనేది ఒక ప్రశ్న.
MOST READ:వర్షపు నీటిలో పడవపై ప్రయాణించిన వ్యక్తిపై కేసు బుక్ చేసిన పోలీసులు : ఎందుకో తెలుసా