ఈ వీడియోను చూస్తే మీరు దుమ్మెత్తిపోస్తారు.. రీల్స్ పిచ్చి పరాకాష్టకు చేరితే ఇలాగే ఉంటుంది..

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఇటీవల కాలంలో చాలా మంది రీల్స్ పేరుతో వీడియోలు తీస్తూ ఇతరులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒకరి నుంచి మరోకరు రీల్స్ ట్రెండ్‌ను అలవాటు చేసుకుని రైళ్లు, బస్సులు, రోడ్లు, రైల్వే ట్రాకులు, ఇతర పబ్లిక్ స్థలాల్లో వీడియోలను షూట్ చేస్తూ, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. సోషల్ మీడియాలో పేరు సంపాదించడానికి ఎలాంటి రీల్స్ అయిన చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. రీల్స్ పిచ్చిలో కొంత మంది ప్రమాదకరమైన వీడియోలు షూట్ చేస్తూ ప్రాణాలను కూడా కోల్పోయారు. ఇలాంటి ఘటనలను చూసి కూడా మారట్లేదు. ఏదో విధంగానైన సెలబ్రిటీ హోదా పొందడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా రీల్స్ పిచ్చిలో పబ్లిక్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న కూడా వారిలో మార్పులు రావట్లేదు. తాజాగా రీల్స్ పేరుతో ఒక వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న వారిని బాగా ఇబ్బంది పెట్టాడు.

పూర్తి వివరాళ్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక వ్యక్తి తన మహీంద్రా థార్‌ తీసుకుని మట్టి బాగా ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. ఆ తరువాత ఒక పారతో అక్కడ ఉన్న మట్టిని తవ్వి దాన్ని కారు పై భాగంలో కుప్పగా పోశాడు. ఆ తర్వాత కారును రోడ్డు పైకి తీసుకొచ్చి వేగంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్ళిపోయాడు. దారి మధ్యలో ఉన్న వాహనాలను ఓవర్ టెక్ చేసి స్పీడ్‌గా థార్‌ను పోనిచ్చాడు.

Up Man Drives Mahindra Thar Pile Of Sand On Top For Reels

అలా వెళ్తున్న క్రమంలో థార్ పై భాగంలో ఉన్నటువంటి మట్టి నుంచి దుమ్ము, ధూళి క్రిందికి పడింది. ఇలా పడిన ధూళి వెనుక వస్తున్న ఇతర వాహనదారుల కళ్ళల్లో పడింది. దీంతో వారు తమ వాహనాలను నడపలేక చాలా ఇబ్బంది పడ్డారు. థార్‌ను డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఇతర వాహనాదారులకు కలుగుతున్న అసౌకర్యాన్ని గుర్తించకుండా నిర్లక్ష్యంగా ఎస్‌యూవీని వేగంగా ముందుకు పోనిస్తూనే ఉన్నాడు.

కళ్లలో దమ్ము పడుతున్న కూడా పట్టించుకోకుండా వెళ్తున్న థార్ డ్రైవర్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు అతడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఆ వ్యక్తి రీల్స్ కోసమే ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడ్డాడని తెలిసింది. ఈ వీడియో యూపీ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వైరల్ అయింది.

Mahindra Thar Pile Of Sand On Top

దీంతో అది చివరకు ఆ రాష్ట్ర పోలీసులకు చేరింది. ఈ నేపథ్యంలో ఆ వీడియోలో కనిపించిన థార్ నెంబర్ ఆధారంగా దాన్ని కనుగొన్నారు. రీల్స్ పేరుతో పబ్లిక్ ప్రాంతాల్లో ఇతరులకు తీవ్ర ఇబ్బందికి గురి చేసినందుకు గానూ, ట్రాఫిక్ చట్టం క్రింద కేసు నమోదు చేశారు. అలాగే థార్‌ను డ్రైవింగ్ చేసిన వ్యక్తిపై దాదాపు రూ.24 వేల వరకు భారీ జరిమానా విధిస్తామని పోలీసు ఉన్నతాధికారి ఒక సమావేశంలో వెల్లడించారు.

చాలా కాలంగా పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికి కూడా ఇలాంటి రీల్స్ చేష్టలు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు మీరట్‌లో థార్ డ్రైవర్ మట్టితో రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఆ మట్టి మొత్తం కూడా వెనుక వస్తున్న వాహనదారులపై పడింది. ఒకవేళ వారి కళ్లలో పడిన దమ్ముతో ఎదురుగా ఉన్న రోడ్డు కనిపించకుండా దేన్నైనా ఢీకొట్టి నట్లయితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కానీ అదృష్టవశాత్తు అలా జరగలేదు.

Up Man Drives Thar Pile Of Sand On Top

సోషల్ మీడియాలో ఎలాగైన ఫేమస్ కావడానికి, సమాజంలో అందరి దగ్గర సెలబ్రిటీగా అనిపించుకోడానికి రీల్స్ పేరుతో పిచ్చి పిచ్చి చేష్టలు పడటం, పబ్లిక్ రోడ్లపై ప్రజలను ఇబ్బందులకు గురి చేసినట్లయితే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తాజాగా పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, December 2, 2024, 12:47 [IST]
English summary
Up man drives mahindra thar pile of sand on top here the video
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+