రైల్వే ప్లాట్‌ఫామ్ పైకి వచ్చిన మంత్రి కారు.. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చా అని మండిపడుతున్న నెటిజన్లు..

ఆఖరి నిమిషంలో బస్సు, లేదా రైలు మిస్ అవుతుందని పరిగెత్తడం చాలా మంది చేసే పనే.. స్టేషన్‌కు సమయానికి చేరుకోవం కోసం కొంతమంది రోడ్డుపై స్పీడ్‌గా డ్రైవ్ చేయడం లేదా రాంగ్ రూట్లో ప్రయాణించడం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

ఆలస్యమవుతుందనే తొందరలో ఇక్కడ ఓ వ్యక్తి ఏకంగా రైల్వే సేష్టన్ ప్లాట్‌ఫామ్‌లోకి ఏకంగా కారును తీసుకువచ్చాడు. ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి అయితే మనం ఇంతలా ఇక్కడ చర్చించుకునే వాళ్లం కాదు. ఆయన ఓ ప్రజాప్రతినిధి.. సాధారణ ప్రజలు నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా వేసే ప్రభుత్వం.. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధి చేయడం ఇలా చేయడమేంటని అనుకుంటున్నారా.. ఇంతకీ ఎవరా మంత్రి.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Minister-Drives-Into-Railway-Platform

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఆ రాష్ట్రంలో బీజేపీ పాలనలో ఉంది. అక్కడ రాష్ట్ర మంత్రిగా ధరంపాల్ సింగ్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆయనకు అధికారిక కార్యకలాపాల కోసంం టయోటా ఫార్చ్యూనర్ కారును అందించారు. అయితే ఆయన ఆ కారులోనే చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడ్డారు.

యూపీ మంత్రి ధరంపాల్ సింగ్ ఈ కారులో లక్నో రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పైకి వెళ్లి కలకలం సృష్టించారు. తనకి ఆలస్యం కావడంతో రైలును అందుకునేందుకు మంత్రి ధరంపాల్ సింగ్ తన కారులో ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చారు. ఈ సంఘటనను కొందరు వీడయో తీయడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Minister-Drives-Into-Railway-Platform

వీడియోలో మంత్రి ధరంపాల్ సింగ్ తన అధికారిక టయోటా ఫార్చూనర్ కారులో లక్నో రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించడాన్ని మీరు చూడవచ్చు. అతని టయోటా ఫార్చ్యూనర్ వీల్ చైర్ల ఉపయోగం కోసం రూపొందించిన ర్యాంప్‌పై రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి అక్కడ ఉన్న ప్రయాణికులందరినీ షాక్‌కు గురి చేసింది.

లక్నో రైల్వే ప్లాట్‌ఫామ్ పైకి ఒక్కసారిగా కారు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అలాగే మంత్రి చేసిన ఈ చర్య ప్రయాణికులకు అసౌకర్యం కలిగించింది. అయితే దీనిపై మంత్రి ధరంపాల్ సింగ్‌పై ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా అనేది ఖచ్చితంగా తెలియరాలేదు.

Minister-Drives-Into-Railway-Platform

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌పై సామాన్యులు కారు నడపగలరా? అంటూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సాదారణ ప్రజలు అలా కారు నడిపితే అధికారులు చర్యలు తీసుకోకుండా వదిలేస్తారా.. అని మండిపడుతున్నారు.

వాస్తవమేమిటంటే, ఒక సామాన్యుడు ఇలా చేసి ఉంటే, అతను జరిమానాలతో సహా తీవ్రమైన చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల మంత్రి ధరంపాల్ సింగ్‌పై పక్షపాతం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏదేమైనా ఒక ప్రజాప్రతినిధి ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

బస్ స్టేషన్, రైలు స్టేషన్‌లు మరియు విమానాశ్రయాలకు వెళ్లేటప్పుడు, మిస్ అవకుండా ఉండాలంటే కొంచెం ముందుగా మీరు ఇంటి నుంచి బయలుదేరాలి. రైళ్లు, విమానాలు ఎవరి కోసం ఎదురు చూడవని గుర్తుంచుకోవాలి. మనం సరైన సమయానికి వెళ్లాలి కాబట్టి ముందుగానే బయలుదేరడం మంచిది.

దారిలో మీరు ట్రాఫిక్ జామ్, వాహనాల రిపేరు మొదలైన అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. ట్రిప్ ప్లాన్ చేసే ముందు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే లాస్ట్ మినిట్ హడావిడి లేకుండా సాఫీ జర్నీ చేయవచ్చు. ఇక్కడ ఈ విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

దేశంలో రైల్వే ప్లాట్‌ఫామ్‌పై కారు నడపడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. అయితే మీరు వీటికి దూరంగా ఉండాలి. రైల్వే ట్రాక్‌లకు ఆనుకుని రద్దీగా ఉండే ప్లాట్‌ఫారమ్‌లపై కార్ల వంటి వాహనాలను నడపడం ప్రయాణికులకు సురక్షితం కాదు.. అంతేకాకుండా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 25, 2023, 18:45 [IST]
English summary
Up minister drives toyota fortuner car into railway station platform video ge viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+